19767 వార్తలు

మగాడి జీవితమూ నిశ్శబ్ద ఆరాట పోరాటం పిల్లాడిగా ఆటపాటలు తండ్రి వేలు పట్టి నడకలు అమ్మ ఒడి కన్నీటిని తుడిచే గుడి అమ్మ ఒడిలోంచి బడిలోకి బతుకు అర్థంతో పాటు అర్థాన్ని ఆర్జించే జ్ఞాన సముపార్జన ఉద్యోగ ఉపాధుల వేటలు జీవనోపాధికి ఏదో ఒక వృత్తిలో మునకలు పెళ్లితో తలపై కుటుంబ భారం ఎదిగే కొద్దీ తన ఇష్టాల్నిచంపుకొని కుటుంబ నవ్వుల కోసం అలుపెరుగని అవిశ్రాంత పరుగులు గెలుపోటముల నడుమ నలిగి పోతాడు భర్త, తండ్రి అయ్యాక అతనో డైరీ మాత్రమే అయి, పేజీల్లో ఖర్చులు, బాధలే చెమట వరదల పెట్టుబడితో కుటుంబ నవ్వుల పంటను సాగు చేస్తూ అప్పులు, నొప్పులతో ఒంటరై పోతాడు తన రెక్కల కింది పెరిగిన పిల్లలు ఎదిగి ఎగిరి పోయాక ఒంటరై పోయి ఆలి ఒడిలో పిల్లాడిలా ఒరిగి పోతాడు జీవితాంతం అందరి కోసం బతికి చివరగా జ్ఞాపకాలతో మిగిలిపోతాడు తను ఎన్నిసార్లు ఓడినా. కుటుంబం గెలుపును కోరుకుంటూ. కన్నీటిని కలల సాగుకు వాడుకుంటూ చెమట చుక్కలతో సాఫల్య స్నానం చేస్తూ ఒంటరిగా వచ్చి ఒంటరిగానే నిష్క్రమిస్తాడు - మధుపాళీ


పెద్దపల్లి: గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యౌటింక్లయిన్ కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పోతన కాలనీలోని 83వ బ్లాక్‌లో యాదవనేని వసంత్ విజ్ఞత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వకీల్‌పల్లి గనిలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మరో రూమ్‌లో ఉన్న సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానికులు వెంటనే దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ఎస్‌ఐ ప్రసాద్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



ఈ రోజు ఒప్పు్పకోక తప్పదు ఊరి చివర తుప్పల్లోను వీధి మూల సందుల్లోనూ గుత్తులుగా పూసిన అనాథ పూలు అందాన్ని ఊరేగిస్తూ ఆకాశాన్ని ముద్దాడుతుంటే గెలుపు ఒప్పు్పకోక తప్పదు ఎక్కడో వీధి చివర వెలివేసిన బొక్కెడు మల్లె ఈసడింపులను ఎదురీదుకొని ఎండా వానను భరించుకొని ఒక్క వసంతానికై వేచే ఆశకు మరే ఋతువైనా చిన్నబోదా? వేర్లు తెంపి, తుంచేసినామొదల్లు పీకి పారేసినా ఎక్కడో కొన ఊపిరితోమళ్ళీ వేళ్ళూనుకునాలనే ఓ ప్రయత్నం ఉంటే చాలదా? ఏ వసంతమో వచ్చి ఆదుకోదా? - వినోద్ కుత్తుం


(ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రముఖ కవి,సాహితీ విమర్శకులు సచ్చిదానందన్‌తో రఘు శేష భట్టార్ చేసిన ఇంటర్వ్యూ ) మీరు భారతీయ కవుల్లో శిఖర సమానులు. పాఠకులే కాదు ఉద్దం డులైన ఎంతోమంది కవులు మీ కవిత్వానికి ఫిదా ఔతారు. ఇంత మందిని mesmarize చేసేలా రాయటం ఎలా సాధ్యమైంది? చిలీకి చెందిన సుప్రసిద్ధ కవి నికనర్ పర్రా అంటాడు. - కవి ఐన వాడు ఖాళీ పేజీలపై తనదైన ముద్ర వేయాలని. ఆ పేజీలను నేను కొత్తగా సున్నితంగా మలచాలనుకుంటాను. నిజానికి కవి ఐన ప్రతి మనిషి ఈ సూత్రాన్ని పాటించాలి. అప్పుడు మాత్రమే పాఠకుల కు దగ్గరౌతాం. బహుశా నేను నికనర్ పర్రా మాటల్ని గట్టిగా పట్టించుకొని ఉంటాను. ఒక అత్యుత్తమ కవికి ఉండే లక్షణం ఏమిటంటే అతడు ఎంతో మంది అజ్ఞాత పాఠకులకు స్ఫూర్తినిస్తాడు. తన రాతలతో వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఎంతోమందిని తట్టిలేపిన మీరు అలా స్ఫూర్తి పొందిన సందర్భాలున్నాయా? నేనిప్పటికీ కవిత్వం చదువుతాను. గంగలో మునిగి అర్ఘ్యం ఇచ్చే వాడిలా లేదా మక్కా వైపు తిరిగి ప్రార్థించే వాడిలా శ్రద్ధగా చదువుతా ను, రాసేప్పుడు కూడా అలాగే ఉంటాను. అట్లా ఉండటమే సాహిత్య సాంప్రదాయం అనుకుంటాను. ప్రతీకలు, రూపకాలు నాకు వర్ణమాలలాంటివి. చదవటం నా



మనిషి చరిత్రను గమనిస్తే ఒక విరోధాభాసం స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ కోసం పుట్టిన మనిషే, తన చేతుల తో తానే బంధనాలను నిర్మించుకున్నాడు. ప్రకృతిలోని ఇతర జీవుల మాదిరిగా ప్రేమతో, సహజత్వంతో జీవించాల్సిన మ నిషి, నాగరికత పెరిగిన కొద్దీ అధికారం, ఆధిపత్యం, మతం, జాతి, సంపద, విజ్ఞానం పేర్లతో తన చుట్టూ కనిపించని సంకెళ్లను వేసుకున్నాడు. ప్రపంచంలోని యుద్ధాలు, రాజ్యాలు, వలస పాలనలు, మత ఘర్షణలు అన్నీ చివరికి ఒక మనిషి మరో మనిషిపై ఆధిపత్యం చెలాయించాలనే తపన నుంచే పుట్టాయి. ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి సహజ మానవ విలువలు క్రమంగా భయం, ద్వేషం, అసూయ, అహంకారాల కింద నలిగిపోయాయి. నాగరికత మనిషికి సౌకర్యాలు ఇచ్చినా, అంతరంగ శాంతిని మాత్రం దూరం చేసింది. ఈ సంక్షోభాన్ని ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియో టాల్ స్టా య్, దాదాపు 116 సంవత్సరాల క్రితమే తన హిందువులకో ఉత్తరంలో విశ్లేషించాడు. 1908లో అమెరికాలోని భారత స్వాతంత్య్ర సమరయోధుడు తారకనాథ్ దాస్ కు రాసిన ఈ లేఖలో టాల్‌స్టాయ్ కేవలం బ్రిటిష్ వలస పాలనను మాత్రమే విమర్శించలేదు. బానిసత్వం అనే భావన మనిషి అంతర్మనస్సులో ఎలా పుడుతుందో వివరిస్తాడు. ఈ లేఖను మళ్ళీ ఇ న్నాళ్ళకు చింతకుంట్ల సంపత్



హైదరాబాద్: ఈ సంవత్సరం కుంభవర్షాలు కురుస్తాయని భవిష్యవాణి మాతంగి స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివర ఘట్టానికి చేరుకో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. వరదల్లో ప్రజలు కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది తనని బాధపెడుతున్నారు, కంటతడి పెట్టిస్తున్నారని, తాను సంతోషంగా లేనని, కోపంతో వచ్చానని హెచ్చరించారు. భక్తులకు దోసెడంత ఇచ్చినా కూడా నాకు గోరంత కూడా ఇవ్వడం లేదన్నారు. తన విగ్రహ పత్రిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ప్రజల్లో అహంకారం ఎక్కువవుతోందని, తగ్గించుకుంటే మంచిదని సూచించారు. వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట చేయకపోతే ప్రాణనష్టం తప్పదని స్వర్ణలత శాపం పెట్టారు.

నేను, నా సాహితీ యాత్ర: 25 పుట్టిపెరిగింది చదువుకున్నది అంతా పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్‌పూర్లో. సాహిత్యాభిమాని, సభలు సమావేశాలేవీ వదలని మా తాతయ్య దుర్గయ్య నాయుడుకు బాల్యం నుండి చేతికర్రగా తిరిగిన ఫలితం, బహుశా నాకున్న ఈ కొద్దిపాటి సాహిత్యానుబంధం. నేను చదువు కుంటున్న క్రమంలో నాకు దొరికిన గురువులు స్నేహితులు బంధువులు నాకు సాహిత్య మార్గాన్ని చూపించారు. అప్పట్లో పాఠశాలల్లో ప్రతీ ఏడాదీ ఒక వార్షిక పత్రిక వెలువడేది. అందులో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఏదో ఒకటి రాసే వారు. కొందరు గురువుల సూచనలు సలహాలు విద్యార్దుల లోని వారికే తెలియని మరో కోణాల్ని వారు ఆవిష్కరించుకో గలిగేవారు. అలా నాకు ఒక సంస్కృత ఉపాధ్యాయుడు మంకాల శ్రీపతి గారి మూలంగా రాయడం, ఇతర ఆసక్తికర పుస్తకాలను చదువుకోవడం ఒక అభిరుచిగా మారింది.ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. నేను చదువుకున్న ఖరగపూర్‌లోని ఆంధ్రా ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే, తెలుగు ఒక పాఠ్యపుస్తకంగా ఉండేది. ఆ తరువాత అంతా ఆంగ్ల బోధనలోనే నా చదువు కొనసాగింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కాలేజీ రోజుల్లో కథలు రాయటం ఒక సరదాగా ఉండేది. ఆ తరువాత పై చదువులు, ఉద్యోగం, సంసారంలో పడి సర


నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇంతకుముందు ‘చైనా పీస్’ పేరుతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిత్రం, ఇప్పుడు ‘సీక్రెట్ సోల్జర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.




అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అర్థరాత్రి తణుకు- కొమరవరం మార్గంలో బైకుపై తల్లి, కూతురు వెళ్తుండగా బైకు అదుపుతప్పి కిందపడి బాలిక మృతి చెందింది. ప్రమాదంలో ఉన్న తల్లిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తల్లి మరణంచింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నిడమరు మండలం బువ్వనపల్లికి చెందిన కల్యాణి( 24), కీర్తన(4) గా పోలీసులు గుర్తించారు.

