24235 వార్తలు





అమరావతి: ఎపికి చెందిన యువకుడు అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల మండల దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ(34) అనే యువకుడు 2019లో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లారు. చదువు పూర్తి చేసిన అనంతరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటున్నాడు. కీవ్‌లాండ్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసి అనంతరం తల్లిదండ్రులు అమెరికాకు తీసుకెళ్లి గృహ ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసిన అనంతరం రవితేజ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గృహ ప్రవేశం జరగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దైదగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కళ్ల ముందు కన్న కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీంటి పర్యంతమయ్యారు.

లండన్: దేశం కోసం ఆడడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను క్రికెట్లో కొనసాగుతున్నకాలం తనపై విమర్శలు వస్తునే ఉన్నాయని, తాను బ్యాట్‌తో సమాధానం చెప్పానని వివరణ ఇచ్చాడు. విమర్శలపై పోరాటం చేయడం కంటే జట్టు విజయంలో భాగమయ్యేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తానని చెప్పాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే తన లక్ష్యమని కెరీర్ ఆరంభం నుంచి ఇదే పని చేస్తున్నానని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే తరువాత రోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో కూడా 138 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించిన విషయం విధితమే.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహే ష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని... అజ య్ భూపతి దర్శకత్వంలో ’శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రావే చెలియా సాంగ్ ని లాంచ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటను ప్రే మ, భావోద్వేగాలతో హార్ట్ టచ్చిం గ్ మెలోడీగా కంపోజ్ చేశారు. నాగ్ అర్జున్ రెడ్డి అందించిన మనసుని తాకే సాహిత్యానికి, కపిల్ కపిలన్ తన గాత్రంతో ప్రాణం పో శారు. ప్రేమ, ఎడబాటు, మనసులోని భావాలను ఈ పాట అద్భుతంగా పలికించింది. ఈ పాటలో జై కృష్ణ, రాషా తడానీ మధ్య ప్రేమ దూరమైనప్పుడు కలిగిన భావోద్వేగాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


బార్బొడాస్: వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డే లో న్యూజిలాండ్ ఒక వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక వన్డే మిగిలివుండగానే 31 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 188 పరుగులకు ఆలౌటైంది. ఆమిర్ జంగో (51), మోటి (41), అకీమ్ (33) పరుగులు చేశా రు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. చాప్‌మన్ (80) అద్భుత బ్యాటింగ్‌తో కివీస్‌ను గెలిపించాడు.














కల్లేర్: కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కల్లేర్ మండలం బాచుపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కారు నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బాచుపల్లి శివారులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కల్లేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.