24246 వార్తలు










కల్లేర్: కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కల్లేర్ మండలం బాచుపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కారు నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బాచుపల్లి శివారులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కల్లేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) చలో పార్లమెంట్ ఉద్రిక్తతకు దారితీసింది. నీట్‌లో అవకతవకలు, కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా సహా పలు డిమాండ్లతో సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజే సుమారు 20వేల మందికిపైగా సిజెపి మద్దతుదారులు అటువైపుగా దూసుకెళ్లారు. తొలుత జంతర్‌మంతర్ వద్దే ఆందోళనకారులను అడ్డుకునేందుకు అడుగుడుగనా భద్రతా దళాలు, బారికేడ్లను మోహరించారు. పోలీసులు పార్లమెంట్ మార్చ్‌కు అనుమతి ఇవ్వకపోయినా విద్యార్థులు, నిరసనకారులు లెక్కచేయకుండా ముందుకే కదిలారు. పోలీసులు ఎంత అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రతిఘటించండంతో పోలీసులు లాఠీలు ఝలిపించారు. టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా బలగాలకు, నిరసనకారులకు నడుమ జరిగిన ఘర్షణలు, తోపులాటల్లో ఇరు పక్షాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వేర్వేరు మార్గల ద్వారా పార్లమెంట్ సమీపం వరకు నిరసనకారులు వెళ్లగలిగారు. మరోవైపు పుకార్లు వ్యాప్తి చెందకుండా సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. పార్లమెంట్ సమీపంలోని హై సెక్యూరిటీ ఏరియా

బొద్దింకల పార్టీ (కాక్రోచ్ జనతా) ఢిల్లీ పెద్దల మొద్దు నిద్ర వదిలించింది. పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచినా, లాఠీలు స్వైర విహారం చేసినా, బాష్పవాయువు కమ్ముకొచ్చినా ఏమాత్రం లెక్కచేయక, బెదరక ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు కదం తొక్కారు. పార్లమెంట్ రోడ్డంతా రణరంగాన్ని మరిపించింది. ఢిల్లీ నగరం గడగడలాడింది. ఢిల్లీ రైల్వే మెట్రో కార్పొరేషన్ ఐదుస్టేషన్లను మూసివేసింది. ఇంటర్నెట్ సర్వీసులు రద్దయ్యాయి. నీట్ యుజి పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్లు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున జంతర్ మంతర్ నుంచి చేపట్టిన ర్యాలీ ఉప్పెనలా ముందుకు సాగింది. భద్రతా దళాలు ఈ ఉప్పెనను అడ్డుకోలేకపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరికాక తప్పలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకవైపు పార్లమెంట్ భవనం లోనే భేటీ కాగా, మరోవైపు చలో పార్లమెంట్‌కు నాయకత్వం వహిస్తున్న నాయకులతో కేంద్ర మంత్రి జెపి నడ్డా చర్చలు జరిపారు. ఆస్పత్రిలో వైద్య చికిత్

భారత్‌లో క్రీడలంటే ఇప్పటికీ చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది క్రికెట్ మాత్రమే. ఆ ఆట దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించింది. అయితే ఒక పరిపక్వ క్రీడా దేశం ఒక్క ఆటపైనే ఆధారపడకూడదు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్‌కు కూడా సమాన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ముంబైలోని చారిత్రక నెవిల్లే డిసౌజా ఫుట్‌బాల్ మైదానాన్ని కన్వెన్షన్ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఉద్యమించారు. గువాహటిలోని జనతా భవన్ ఆటస్థలాన్ని పార్కింగ్ స్థలంగా మార్చకుండా కాపాడేందుకు చిన్నారులు, క్రీడాకారులు, వృద్ధులు, స్థానికులు కలిసి ముందుకొచ్చారు. ఇవి రెండు నగరాలకు మాత్రమే పరిమితమైన సంఘటనలు కావు. దేశవ్యాప్తంగా ఆటస్థలాలు క్రమంగా కనుమరుగవుతున్నాయనే వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి. ఒక ఫుట్‌బాల్ మైదానం కనుమరుగవడం అంటే కేవలం కొంత భూమిని కోల్పోవడం కాదు. ఆ మైదానంలో ఆడాలని కలలు కనే వేలాది మంది చిన్నారుల అవకాశాలను కోల్పోవడం. ఒకసారి ఆటస్థలం వాణిజ్య సముదాయంగా లేదా పార్కింగ్ స్థలంగా మారిపోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడం దాదాపు అసాధ్యం. 140 కోట

మన తెలంగాణ/ నల్గొండ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. బ్యారేజీలపై నిర్వహిస్తున్న సమగ్ర శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని, వాటి ఆధారంగా మరమ్మతులు, పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉ-త్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి కాళేశ్వరం బ్యారేజీలు పునరుద్ధరించడమే లక్షంగా పనిచేస్తున్నామని ఉ త్తమ్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఉ-న్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ.. బ్యారేజీల పునరుద్ధరణ లో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తోందని స్పష్టం చేశారు. భద్రతపై నిపుణులు పూర్తిస్థాయిలో ధ్రువీకరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి నిర్వహణలోకి తీసుకురాబోమని వెల్లడించా రు. దేశంలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసె ర్చ్ స్టేషన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి అత్యున్నత సాంకేతి

వ్యవసాయం ప్రకృతితో ముడిపడిన జీవన విధానం. వర్షం సకాలంలో పడితే రైతు ముఖంలో చిరునవ్వు విరుస్తుంది. అదే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసినా, పూర్తిగా దూరమైనా వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రమవుతున్నాయి. ఈ మార్పులకు తోడు ఎల్‌నినో వంటి వాతావరణ దృగ్విషయాలు భారతదేశ వ్యవసాయాన్ని మరింత సవాలుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు క్షీణించడం రైతుల ఆందోళనను పెంచుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం అంటే కేవలం వర్షాలు తగ్గడమే కాదు. రుతుపవనాల తీరు మారుతుంది. వర్షాలు పడాల్సిన సమయంలో పడకపోవడం, ఒకేసారి అధిక వర్షాలు కురవడం, పంటల పెరుగుదల దశలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా విత్తనాల నుంచి కోత వరకు ప్రతి దశలో రైతు అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ‘సాంప్రదాయ సాగు విధానాలు కొనసాగించాలా? లేక వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకోవాలా?’ అనే ప్రశ్న అత్యంత కీలకంగా మారింది. దీనికి సమాధానం స్పష్టమే. ప్రకృతి మారుతున్నప్పుడు వ్యవసాయం కూడా మారాల్సిందే. గత

బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి మూలాధారం డిపాజిట్లు. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత వారి వారి జీవితకాల పొదుపులను ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉంచే సీనియర్ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్ అనేది కేవలం పెట్టుబడి కాదు, అది వారి జీవన ఆధారం. ఇటువంటి నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు పూర్తి బీమా రక్షణ కల్పించాలన్న ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చ కు దారితీసింది. దేశంలోని కొన్ని వర్గాల బ్యాంకు డిపాజిట్లపై, అంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, చిన్న డిపాజిటర్లకు పూర్తి బీమా రక్షణ కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు ప్రతిపాదనపై ఆ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇటీవల జైపూర్ లో జరిగిన డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రతిపాదన చేశారు. అదే సమావేశంలో మరో డిప్యూటీ గవర్నర్ జె. స్వామినాథన్ మాట్లాడుతూ డిపాజిట్ బీమాకు రిస్క్ ఆధారిత ప్రీమియం విధానాన్ని అమలు చేయాలన్న సూచన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఒకే రకమైన ప్రీమియం చెల్లిస్తుండగా, ర