24416 వార్తలు








భారత షట్లర్ పివి సింధు ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు రాజమౌళి పోస్ట్‌కు సింధు ఇచ్చిన రిప్లై అందరినీ ఆకర్షిస్తూనే నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. మంచి కమ్‌బ్యాక్ ఇచ్చావు. కంగ్రాట్స్ సింధు. నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన సింధు.. ‘‘ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ వారణాసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ మీరు తెరకెక్కించే ఏ సినిమాలో అయినా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే.. మీ పరిచయ నటిగా మారడానికి నేను ఎంతో సంతోషిస్తాను’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పంచుకున్నారు.


హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. మంగళవారం రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.


అగర్తాలా: త్రిపుర డిజిపి అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిజిపి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అగర్తలా పోలీస్ హెడ్ క్వార్ట్స్‌లో తన రూమ్ లో గన్ కాల్చుకున్నట్టు సమాచారం. రక్తపు మడుగులో ఉన్న అతడిని గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. డిజిపి మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. డిజిపి మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారని, అప్పటికే చనిపోయాడని, దాదాపు 40 నిమిషాల పాటు సిపిఆర్ చేశామని, చివరికి 12:48 గంటలకు మృతి చెందారని వైద్యులు వివరించారు. అనురాగ్ మే 2025లో త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన త్రిపురలో ఇంటెలిజెన్స్ విభాగంలో డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో విశిష్టమైన సేవలందించిన ఆయన, తన పదవీకాలంలో అనేక కీలకమైన కేసుల దర్యాప్తును చేపట్టారు. వృత్తిపరమైన పనితీరు మరియు విస్తృతమైన పోలీసింగ్ అనుభవానికి పేరుగాంచిన ధంకర్, రాష్ట్రంలోని అత్యంత సీనియర్ IPS అధికారులలో ఒకరిగా గుర్తింపు పొందారు

ఢిల్లీ: పార్లమెంట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు వద్ద కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు స్ట్రీట్ కు వేలాదిగా సిజెపి కార్యకర్తలు తరలివచ్చారు. బారీకేడ్లు తోసుకుని వచ్చిన కార్యకర్తపై పోలీసుల లాఠీఛార్జీ చేశారు. తోపులాటలో పలువురు పోలీసులు, సిజెఐ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పార్లమెంటు గేట్లు పోలీసు భద్రతా బలగాలు మూసి వేశారు. పార్లమెంటు సమీపంలోని పటేల్ చౌక్, అన్ని మార్గాల్లో సిజెపి కార్తలు భైఠాయించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాఠీఛార్జ్ ఖండిస్తూ పెద్దఎత్తున సిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు.

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. పైగా, రోహిత్ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. భారత్ ఈ మ్యచ్‌లో ఓడినప్పటికీ రోహిత్ బ్యాటింగ్ ామత్రం అదరగొట్టేశాడు. ఈ అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బిసిసిఐ టివితో మాట్లాడుతూ ‘‘మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయడం నా ముఖ్య విధి. దేశానకి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విఫయం. నా అరంగేట్రం రోజు నుెంచి నేటి దాకా అదే నిబద్ధత, అంకితభావంతో ముందుకు సాగుతున్నాను. అంతేకాదు నేను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన రోజు నుంచే ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాను. నేను మళ్లీ మైదానంలోకి వెళ్లే దాక అవి ఆగవు. ఇలాంటి రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపించవు’’ అని రోహిత్ పేర్కొన్నాడు.







హైదరాబాద్: పేదవాడి చిరు కోరిక సొంత ఇల్లు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలోని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. హైదరాబాద్ లో అల్పాదాయ వర్గాల హౌసింగ్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగష్టు నాటికి 2 లక్షల పైగా ఇళ్లు పూర్తి కాబోతున్నాయని, ఇందిరమ్మ రాజ్యంలోనే సొంత ఇల్లు సాకారమని తెలియజేశారు. స్థలం ఉన్నవారికి 4.50 లక్షల ఇళ్లు ఇచ్చామని, పేదలు నివసించే ప్రాంతంలోనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయంచామని పొంగులేటి పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని, గజం రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉన్న ప్రాంతంలో కూడా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల కట్టిన ఇళ్లు కూడా ఇవ్వలేక పోయారని, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో కొంత మందే నివసిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కోర్ పరిధికి 30 కి.మీ. దూరంలో గత ప్రభుత్వం ఇళ్లు ఇచ్చిందని, ఉపాధికి దూరంగా ఉండడంతో పేదలకు ఇచ్చిన ఇళ్లలో నివసించడానికి ఇష్టపడట్లేదని అన్నారు. ధనికులు నివసించే చోట

