25104 వార్తలు






నేడు ఇంగ్లండ్‌తో మూడో వన్డే అండన్(లార్డ్): ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌లో సమంగా నలిచిన ఇరు జట్లకు మూడో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఎవరూ గెలుపొందినా సిరీస్ విజేతగా నిలువనున్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన మొదటి వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించిన టీమిండియా కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో పరాజయంపాలైంది. దీంతో మూడో వన్డేలో ఎలాగైనా గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలనే యోచనతో బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమష్టిగా రాణించింది. బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషించి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఇక బ్యాటింగ్‌లోనూ భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు విఫలమైనా మిగతా ఆటగాళ్లు అద్భుత బ్యాటింగ్‌తో దాని ప్రభావం జట్టుపై పడకుండా చూశారు. ఈ మ్యాచ్‌లోనైనా స్టార్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలు తమ పాత్రను సమర్థంగా పోషించక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోకోలు రాణిస్తే టీమిండియాకు ఎదుర









నవతెలంగాణ-హైదరాబాద్ : ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి భారీ స్పందన రావడంతో టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అధికారిక విక్రయాల్లో ఒక్కో టికెట్ ప్రారంభ ధర 11,327 డాలర్లు (సుమారు రూ.10.9 లక్షలు) కాగా, రీసేల్ మార్కెట్లో ప్రీమియం టికెట్లు 28,479 డాలర్లు (సుమారు రూ.27.4 లక్షలు) పలుకుతున్నాయి. జులై 20న న్యూయార్క్‌లోని మెట్లైఫ్ స్టేడియంలో జరగనున్న ఈ […] The post ఫిఫా ఫైనల్ మ్యాచ్..రికార్డు స్థాయికి టికెట్ ధరలు appeared first on Navatelangana.


ముగిసిన ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ చాంపియన్‌షిప్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే విగతజీవులుగా మారారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఒకే కుటుంబం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరిన క్రమంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బాధితులు ప్రయాణిస్తున్న కారు ఆనందపురం పరిసరాల్లోని గండిగుండం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా […] The post లారీని ఢీకొట్టిన కారు, నలుగురి దుర్మరణం! appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు జరుపుతున్న వరుస దాడుల్లో ఇప్పటివరకు కనీసం 50 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ అధికారికంగా వెల్లడించారు. గత 24 గంటల్లోనే 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడిన వారిలో 37 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో […] The post ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులు..50 మంది మృతి appeared first on Navatelangana.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఆనందపురం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం-ఆనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేట ఎంఎల్ఎ పిఎ చంద్రశేఖర్ గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం విశాఖలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం శుభకార్యానికి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంగనర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. The post తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు..ఎల్లో అలర్ట్ appeared first on Navatelangana.

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలుఐదు కీలక బిల్లులతో వస్తున్న ప్రభుత్వం అదనుచూసి డీలిమిటేషన్, మహిళా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం వాంగ్‌చుక్, అయోధ్య విరాళాల అవకతవకలపై నిలదీసేందుకు విపక్షం రెడీ నేడు అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడీవేడిగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సోమవారంనాటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాల కోసం అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త బిల్లులతో సిద్ధమవుతూనే అదనుచూసి డీలిమిటేషన్, మహిళా బిల్లులను ప్రవేశపెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. మరోవైపు డీలిమిటేషన్, మహిళా బిల్లులతో ప్రభుత్వం మళ్లీ సభ ముందుకు వస్తే ఎలాగైనా ఎండగట్టాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు గట్టిపట్టుదలతో ఉన్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను బలవంతంగా భగ్నం చేయడం, అయోధ్యలోని రామమందిరం విరాళాల్లో అవకతవకల అంశం ఈ సారి పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకోవాలని విపక్షం భావిస్తోంది. అదే సమయంలో విపక్షాన్ని సమర్థంగా ఎదుర్కొనే తాము ఆశించిన బిల్లులను ఆమోదింపజేసుకోవా

శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ‘విక్రమ్-1’ ఆర్బిటాల్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారంనాడు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి మ ధ్యాహ్నం 12:05 గంటలకు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. తొలుత ఉదయం 11.30గంటలకు చేపట్టాల్సిన ఈ ప్రయోగం సాంకేతికలోపం కారణంగా 35నిమిషాలపాటు ఆలస్యమైంది. శాస్త్రవేత్తలు ఇంధన వ్యవస్థలో లోపాన్ని గుర్తించి సరిచేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత రాకెట్ నిర్దిష్ట కక్షలోకి చేరింది. అనంతరం ‘హల్ స్పేస్.. విక్రమ్1 వచ్చేసింది’ అని స్కైరూట్ ఎక్స్‌లో పోస్టు చేసిన ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది. మిషన్ ఆగమన్ పేరిట స్కైరూట్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్‌కు ఆ పేరు పెట్టింది. అంతరిక్షంలోకి ఏమేం మోసుకెళ్లింది.. విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్‌డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమానిస్ట్రేషన్