20671 వార్తలు

రన్ రాజా రన్’ చిత్రంలో బుజ్జిమా పాత్రతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల తార సీరత్ కపూర్ చిత్రపరిశ్రమలోకి వచ్చి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తయ్యాయి. కొరియోగ్రఫీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీరత్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ నోట్‌ను షేర్ చేశారు. “12 సంవత్సరాలు... లెక్కలేనన్ని పాఠాలు..అంతులేని కృతజ్ఞత. ఇప్పటికీ నేర్చుకుంటూ.. రూపాంతరం చెందుతూ నన్ను కదిలించే కథలనే ఎంచుకుంటున్నాను” అంటూ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక వేడుక కోసం సీరత్ కపూర్ చేసిన గ్లామరస్ ఫోటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయాలకు సంస్కృతి ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ఒక ప్రతిక అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ ఉజ్జయిని అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనం పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎవరి వృత్తుల్లో వారు విజయం సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారని, బోనాల ఉత్సవాల్లో కులాలకతీతంగా మతలకతీతంగా భాగస్వామ్యమై జరుపుకుంటారని ప్రశంసించారు.

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అటిట్యూడ్ నచ్చకనే జట్టు నుంచి తప్పించేవారని, ఈ విషయం అర్ధమయ్యేది కాని చెప్పుకొచ్చాడు. గాయంతో భారత జట్టుకు దూరమైన పాండ్యా.. బెంగళూరులోని బిసిసిఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. టీమిండియా తదుపరి వైట్ బాల్ సిరీస్‌లలో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఆడలేదని, జట్టు కోసమే ఆడానని తెలిపాడు. ‘సారథ్యం విషయానికి వస్తే.. నాకు నేను ఎప్పుడూ సందేహించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పదవులు కోసమో లేక నా మాట నెగ్గించుకోవడానికో ఆడను అని పేర్కొన్నాడు.











భోపాల్: బైక్‌పై వెళ్తున్న దంపతులు అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి వారిపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదును దొచుకున్నారు. మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్న సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం గుణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దంపతులు దేవాలయానికి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలోని గాదేర్ గ్రామ శివారులోని ఓ పెట్రోల్ పంపు దగ్గర వారిని ఐదుగురు అడ్డగించారు. అనంతరం దంపతులను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి వారిపై దాడి చేశారు. వారిని లాక్కెళ్లుతుండగా ఓ వ్యక్తి గమనించి పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దంపతుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదును లాక్కున్నారు. భర్తపై ముందు భార్యపై అత్యాచారం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దంపతులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు బబ్లూ బంజారా(23), చోటు బంజారా(28), సర్దార్ బంజారా(30), మహేంద్ర బంజారా(20), దినేష్ బంజారా(28)ను అరెస్టు చేసి రిమాండ్‌ఉ తరలించారు.








