🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3795 వార్తలు

హై కోర్టును ఆశ్రయించిన సినీనటి అషురెడ్డి
పాత
తెలంగాణ

హై కోర్టును ఆశ్రయించిన సినీనటి అషురెడ్డి

ఎన్‌ఆర్‌ఐ ధర్మేంద్ర, సినీనటి అషురెడ్డిల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ధర్మేంద్రతో రాజీకుదుర్చుకునేందుకు అషురెడ్డి ప్రయత్నించడం చర్చనీయాంశం అయింది. బిగ్‌బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి వివాహం చేసుకుంటానని, తనను నమ్మించి రూ.9.83కోట్లు తీసుకుని మోసం చేసిందని షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సిసిఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనను, తన కుటుంబ సభ్యులపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. తనపై వస్తున్న ఆరోపణలను అషురెడ్డి తోసిపుచ్చారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన వెర్షన్ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులో వాస్తవం లేదని, కాబట్టి ఆ కేసును కొట్టివేయాలని ఆమె కోర్టును వేడుకున్నారు. కేసు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది. రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా, ఇప్పుడు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో బాధితుడు ధర్మేంద్రకు అషురెడ్డి పంపిన

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పే స్కేల్ పై కీలక ఆదేశాలు
పాత
టిజి జెన్కోకు అంతర్జాతీయ గుర్తింపు
పాత
తెలంగాణ

టిజి జెన్కోకు అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టిజి జెన్కో) తన నాణ్యత, సామర్థ్యం, నిరంతర మెరుగుదల పట్ల చూపుతున్న కట్టుబాటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జెన్‌కో సంస్థ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ 9001:2015 (క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్) సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ సర్టిఫికేషన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ అందుకున్నారు. ఒక స్వతంత్ర ఐఎస్‌ఓ ధృవీకరణ సంస్థ నిర్వహించిన సమగ్ర ఆడిట్ అనంతరం ఈ గౌరవం దక్కింది. ఈ తనిఖీల్లో భాగంగా ఆడిట్ బృందం టీజీ జెన్కోలోని అన్ని విభాగాలు, కార్యకలాప విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా ఐఎస్‌ఓ పత్రాల అనుసరణ, విభాగాల వారీ పనితీరు, కార్యకలాపాల ప్రభావితం, సంస్థ లక్ష్యాల సాధన, నాణ్యత నిర్వహణ వ్యవస్థల అమలును బృందం లోతుగా మూల్యాంకనం చేసింది. ప్రతి విభాగం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్తమ పద్ధతులను పాటిస్తోందని నిర్ధారించిన అనంతరం ఈ సర్టిఫికేషన్ మంజూరుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీజీ

ఎన్నికల తర్వాత పెట్రోల్, డిజిల్ ధరలు పెంచం: కేంద్రం క్లారిటీ
పాత
ఎండలో తిరిగి... ఇంటికొచ్చిన వెంటనే కూల్ వాటర్ తాగుతున్నారా...? మీరు రిస్క్ లో పడినట్లే...!
పాత
చెలరేగిన స్టోయినిస్.. రాజస్థాన్ కు భారీ టార్గెట్
పాత
తెలంగాణ

చెలరేగిన స్టోయినిస్.. రాజస్థాన్ కు భారీ టార్గెట్

ఐపిఎల్ 2026లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్, రాజస్థాన్ జట్టుకు భారీ టార్టెట్ ను నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్నీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పయి 222 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభుసిమ్రాన్ సింగ్(59), ప్రియాన్ష్ ఆర్య(29), కాన్లీ(30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(30)లు రాణించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్ భారీ షాట్లతో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సులతో అజేయంగా 62 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్, రాజస్థాన్ జట్టు ముందు 223 పరుగుల టార్టెగ్ ను ఉంచింది.

మార్కస్ మెరుపులు, ప్రభ్‌సిమ్రాన్ దూకుడు.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
పాత
Samantha: రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ బర్త్‌డే.. 'బీస్ట్' వీడియోతో అదిరిపోయే ట్రీట్!
పాత
కేసీఆర్ ఇంటికి నీటి కొరతపై  జలమండలి క్లారిటీ.. అసలు నిజం ఇదే..
పాత
ఒపెక్ దేశాల కూటమికి యూఎఐ గుడ్‌బై?
పాత
తెలంగాణ

ఒపెక్ దేశాల కూటమికి యూఎఐ గుడ్‌బై?

దుబాయ్: యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యుఎఇ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్ , ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మే1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలియజేసింది. అయితే చమురు దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్‌లో చాలా ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది. ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తరువాత 1967లోయూఏఈ అందులో చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తరువాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఇప్పుడు కూటమి నుంచి వైదొలగడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.

మళ్లీ మొదలైన అక్రమ ఇసుక దందా
పాత
తెలంగాణ

మళ్లీ మొదలైన అక్రమ ఇసుక దందా

-టాస్క్ ఫోర్స్ అధికారుల దాడితో వెలుగులోకి..-దాచారం శివారుల్లో భారీగా ఇసుక అక్రమ నిల్వ పట్టివేత-ఎస్ఐ బదిలీ సాకుతో గాగీళ్లపూర్ మాఫీయదారుల ఇష్టారాజ్యం-ట్రాక్టర్ పట్టివేత..ఠాణాకు తరలింపునవతెలంగాణ-బెజ్జంకిచట్టప్రకారం విధులు నిర్వర్తించిన ఎస్ఐ బదిలీ అంశం మండలంలో చర్చనీయాంశమైతే..మరోపక్క ఇసుక మాఫీయదారులకు వరంగా మారింది. బదిలీ సాకుతో మండల పరిధిలోని గాగీళ్లపూర్ గ్రామంలోని పలువురు ఇసుక అక్రమ రవాణదారులు ఇసుక అక్రమ నిల్వలేర్పాటు చేసి మళ్లీ ఇసుక దందాకు తేరలేపారు.మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో మండల పరిధిలోని దాచారం శీవారులో […] The post మళ్లీ మొదలైన అక్రమ ఇసుక దందా appeared first on Navatelangana.

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
పాత
రాష్ట్ర డిజిపిగా సివి ఆనంద్ నియామకం
పాత
తెలంగాణ

రాష్ట్ర డిజిపిగా సివి ఆనంద్ నియామకం

రాష్ట్ర నూతన డిజిపిగా సివి ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుత డిజిపి శివధర్ రెడ్డి ఈ నెల 30j ఉద్యో గ విరమణ పొందనున్న నేపథ్యంలో సివి ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డిజిపిగా సివి ఆనంద్ మే 1వ తేదిన బాధ్యతలు స్వీక రించనున్నారు. సివి ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన వ్యక్తి కాగా ఆయన తర్వాత సీనియార్టీ జాబితాలో 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఇందులో అత్యంత సీనియర్ అయిన సివి ఆనంద్ నియామకానికి యూపిపీఎస్‌సి ఆమోదించింది. సివి ఆనంద్ తన సర్వీసులో కొంతకాలం పాటు కరీంనగర్, వరంగల్ ఎస్‌పీగా, సైబరాబాద్, విజయవాడ నగర కమిషనర్‌గా రెండు పర్యాయాలు హైదరాబాద్ నగర కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తు తం తెలం గాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కొంతకాలం పాటు రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్‌గా పని చేశారు. అలాగే అవినీతి నిరోధక బ్యూరో డిజి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డిజి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోం శాఖ వంటి అనేక కీలక పదవులను నిర్వహిం చారు. హైదరాబా ద్ పాతబస్తీకి చెందిన సివి ఆనంద్ తండ్రి సి.దామోదర్ రెడ్డి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధ

ఇప్పుడు జోక్యం చేసుకోకుంటే విమానాలు నడపలేం
పాత
తెలంగాణ

ఇప్పుడు జోక్యం చేసుకోకుంటే విమానాలు నడపలేం

న్యూఢిల్లీ : విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరగడం వల్ల విమానాలను నడపడం కష్టంగా మారిందని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉపశమన చర్యలు తీసుకోకుంటే విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా మూసివేయడం తప్పమరో మార్గం లేదని విమానయాన సంస్థలు ప్రభుత్వానికి మూకుమ్మడిగా మొర పెట్టుకున్నాయి. ఈమేరకు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలతో ఏర్పాటైన ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్స్ పౌరవిమానయాన శాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ రాసింది. విమానాల నిర్వహణలో 40 శాతం వాటా ఇంధనానిదే కావడం, ఇటీవల ఏటీఎఫ్ ధరలు విపరీతంగా పెరగడంతో విమాన సంస్థలు ప్రభుత్వానికి పరిస్థితి వివరిస్తూ లేఖ రాశాయి. కిలోమీటరుకు ఎటిఎఫ్ ధరలు రూ.2 లక్షల వరకు పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు దారి తప్పుతున్నాయి. విమానాల నిర్వహణలో ఇంధనం వాటా ప్రస్తుతం 40 శాతం కాగా, ఇప్పుడు 55 శాతం నుంచి 60 శాతం పెరిగింది. దీంతో విమాన రంగంపై ఆర్థిక ఒత్తిడి విపరీతంగా పెరిగిందని విమానయాన సంస్థలు ప్రభుత్వానికి వివరించాయి. ఈ సమయంలో ప్రభుత్వ మద్దతు అందకపోతే విమాన సేవల మూసివేత శరణ్యమని పేర్కొన్నాయి. ఏటీఎఫ్‌ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని,

వచ్చే నెలలో భారత్‌కు ఎస్400 క్షిపణి వ్యవస్థ
పాత
తెలంగాణ

వచ్చే నెలలో భారత్‌కు ఎస్400 క్షిపణి వ్యవస్థ

భారత్ ఆయుధ పరంగా మరింత పటిష్టం కానుంది. రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ వచ్చే నెలలో చేరుకోనుంది ఈ మేరకు మంగళవారంనాడు కేంద్ర ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఎస్ 400 వ్యవస్థ మే నెల మొదటి వారంలోనే భారత్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రష్యా నుంచి బయలుదేరినట్లు వెల్లడించారు. ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ భారత్‌కు చేరితే దేశ వైమానిక దళ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అక్టోబర్ 2018లో అధునాతన ఎస్-400 క్షిపణి వ్యవస్థకు చెందిన ఐదు యూనిట్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే మూడు ఎస్-400 యూనిట్లను భారత్‌కు రష్యా అందించింది. చివరిది అయిన ఐదో యూనిట్ నవంబర్ నాటికి రష్యా అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒప్పందం ప్రకారం అన్ని భారత్‌కు చేరితే దేశంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థల సంఖ్య 10కి చేరుతుంది.

అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు
పాత
తెలంగాణ

అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన అక్క ఖాతాలోని రూ.20,000 బ్యాంకు నుంచి డ్రా చేసుకునేందుకు ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మండుటెండలో మూడు కిలోమీటర్లు బ్యాంకుకు నడిచాడు. అంతకుముందు ఎప్పుడో సమాధిలో ఖననం చేసిన తన సోదరి అస్థిపంజరాన్ని స్వయంగా తవ్వి బయటకు తీశాడు. ఈ ఘటన దియానాలి గ్రామంలో చోటుచేసుకుంది. జితు ముండా అనే వ్యక్తి సోదరి కాక్రాకు మల్లిపాసిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఖాతా ఉంది. కాక్రా రెండు నెలల క్రితం చనిపోయింది. ఆమె భర్త, సంతానం అంతకు ముందే మరణించారు. కాక్రాకు కుటుంబ సభ్యుడిగా మిగిలింది జితు మాత్రమే. దీంతో తన సోదరి ఖాతాలో మిగిలిన రూ.20,000 విత్‌డ్రా చేసుకోవడానికి జితు బ్యాంకుకు వెళ్లాడు. అయితే డబ్బు తీసుకోవాలంటే ఖాతాదారుడు తప్పనిసరిగా హాజరు కావాలని, లేదా మరణ ధ్రువీకరణ పత్రం గానీ, వారసత్వ పత్రాలు గానీ సమర్పించాలని చెప్పి, డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు. దీంతో సోమవారం నాడు శ్మశానవాటికకు వెళ్లిన జితు తన సోదరి అవశేషాలను బయటకు తీశాడు. అస్థిపంజరాన్ని గుడ్డలో చుట్టి బ్యాంకుకు తీసుకెళ్లాడు. జితు చేతిలోని

ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోడీ
పాత
తెలంగాణ

ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోడీ

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో ప్రధాని మోడీ కాసేపు సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ వేడుకలు నిర్వహిస్తునారు. గోల్ కొట్టి మిగతా క్రీడాకారులతో మోడీ సంబరాలు చేసుకుటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో వైరల్ అయ్యాయి. యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ’గ్యాంగ్‌టక్‌లో ఉదయం యువ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడడం ఎంతో శక్తినిచ్చింది’ అని మోడీ పేర్కొన్నారు. అనంతరం సిక్కింలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వివిధ రంగాల్లో రూ.4,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. తమ ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్ పాలసీకి కట్టుబడి ఉందన్నారు. 8 ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో రాజీ పడబోమని చెప్పారు. మరోవైపు ప్రధాని మోడీ ఫుట్‌బాల్ ఆడడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత పోలింగ్ నేపథ్యంలో ఆయన జ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..
పాత
తెలంగాణ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత ధరలు పెంచుతారన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రణాళికలు తమకు లేవని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. "పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదు" అని తెలిపారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత రిటైల్ ఇంధన ధరలు పెంచుతారా అనే ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో భయాందోళనలతో కొనుగోళ్లు జరపడానికి కారణమైన, తక్షణమే ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలను ఆమె తోసిపుచ్చారు."కొన్ని చోట్ల భయాందోళనలతో కొనుగోళ్లు జరపడాన్ని మేము చూశాం. ఈ ప్రాంతాలన్నింటిలోనూ మేము రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. నిల్వలు అందుబాటులో ఉండేలా, కొరత ఏర్పడకుండా ఉండేందుకు అన్ని రిటైల్ అవుట్‌లెట్లను పర్యవేక్షిస్తున్నాము" అని ఆమె అన్నారు. బుధవారం తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కే

అద్దె ఇంట్లోకి రానివ్వని యజమాని..స్మశానంలోనే మహిళ,తన ఇద్దరు కూతుర్లతో నివాసం
పాత
తెలంగాణ

అద్దె ఇంట్లోకి రానివ్వని యజమాని..స్మశానంలోనే మహిళ,తన ఇద్దరు కూతుర్లతో నివాసం

కరీంనగర్ జిల్లా కేంద్రంలో గుండెలు పగిలే విషాదం చోటుచేసుకుంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన సమాజం, కనీసం తలదాచుకోవడానికి నీడ ఇవ్వని అమానుష స్థితికి చేరుకుంది. ఒకవైపు భర్తను కోల్పోయిన వేదన, మరోవైపు కన్నబిడ్డలతో కలిసి ఉండటానికి ఇల్లు లేని దుస్థితిలో ఒక అభాగ్యురాలు స్మశానవాటికనే ఆశ్రయంగా మార్చుకుంది.​ కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలోని గాంధీనగర్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య రూప, ఇద్దరు చిన్నారులు దక్షత, శేహరికలతో కలిసి అద్దె ఇంట్లో నివసించేవాడు. శ్రీకాంత్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో, మనస్తాపానికి గురైన శ్రీకాంత్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రూపకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. శ్రీకాంత్ మరణించిన తర్వాత ఇంటి యజమాని దయ లేకుండా అత్యంత దారుణంగా వ్యవహరించాడు. 12 రోజుల కార్యక్రమం పూర్తయ్యే వరకు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ కఠినమైన నిబంధన పెట్టి గెంటేశాడు. ఉండటానికి వేరే దారి లేక ఆ తల్లి తన ఇద్దరు పసిబిడ్డలను పట్టుకుని రోడ్డున పడింది. ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆ

పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు
పాత
తెలంగాణ

పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతల మధ్య ఆటా పాటలతో గడపాల్సిన ఇద్దరు చిన్నారులు భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో తల్లి వద్దని వెళ్లిపోతే చేరదీయాల్సిన ఆ తండ్రి కూడా వదిలేయడంతో ఆ ఇద్దరు పిల్లలు పోలీస్ స్టేషన్ మెట్లపై బిక్కు బిక్కుమని ఏడ్చేసిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మా పూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని తమిళ కాలనీకి చెందిన దంపతులు లలిత,రవి అనే ఇద్దరు పదేళ్ల కింద ఒకరి కొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారికి శృతి,ప్రీతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.గత కొంత కాలంగా రవి-లలిత దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి వేరుగా ఉంటున్నారు. లలిత హైదరాబాద్ లో నర్సింగ్ కోర్సు చేస్తుండగా,రవి స్థానికంగా బావుపేట వద్ద కిరాణ వ్యాపారం చేసుకుంటున్నాడు.భార్యాభర్తల మధ్య,విభేదాలు రావడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు పెట్టిన కూడా ఇద్దరి మధ్య సాయోధ్య కుదరక పోవడంతో వీరి పంచాయతీ సోమవారం ఎల్ ఎండీ పోలీసే స్టేషన్ కు వచ్చింది. పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు కౌన్సిలింగ్ నిర్వ హించి,భార్య భర్తలు కలిపేందుకు ప్రయత్నించారు. పోలీసులు సర్ది చెప్పిన వినకుండా

సమంత బర్త్ డే సర్ ప్రైజ్.. స్పెషల్ వీడియో రిలీజ్
పాత
తెలంగాణ

సమంత బర్త్ డే సర్ ప్రైజ్.. స్పెషల్ వీడియో రిలీజ్

హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘మా ఇంటి బంగారం’. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం సామ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో సామ్ నటించిన యాక్షన్ సీక్వెన్స్ పై మేకర్స్ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.ఇక ‘ఓ బేబీ’ సినిమా తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేస్తున్న రెండో సినిమా ఇది. సమంత భర్త రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటితో కలిసి ఈ సినిమాకు కథ అందించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మే 15న ఈ సినిమాను థీయేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స ప్రకటించారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో..11.40 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
పాత
సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు...
పాత
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA