🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3799 వార్తలు

పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు
పాత వార్త
తెలంగాణ

పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతల మధ్య ఆటా పాటలతో గడపాల్సిన ఇద్దరు చిన్నారులు భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో తల్లి వద్దని వెళ్లిపోతే చేరదీయాల్సిన ఆ తండ్రి కూడా వదిలేయడంతో ఆ ఇద్దరు పిల్లలు పోలీస్ స్టేషన్ మెట్లపై బిక్కు బిక్కుమని ఏడ్చేసిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మా పూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని తమిళ కాలనీకి చెందిన దంపతులు లలిత,రవి అనే ఇద్దరు పదేళ్ల కింద ఒకరి కొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారికి శృతి,ప్రీతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.గత కొంత కాలంగా రవి-లలిత దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి వేరుగా ఉంటున్నారు. లలిత హైదరాబాద్ లో నర్సింగ్ కోర్సు చేస్తుండగా,రవి స్థానికంగా బావుపేట వద్ద కిరాణ వ్యాపారం చేసుకుంటున్నాడు.భార్యాభర్తల మధ్య,విభేదాలు రావడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు పెట్టిన కూడా ఇద్దరి మధ్య సాయోధ్య కుదరక పోవడంతో వీరి పంచాయతీ సోమవారం ఎల్ ఎండీ పోలీసే స్టేషన్ కు వచ్చింది. పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు కౌన్సిలింగ్ నిర్వ హించి,భార్య భర్తలు కలిపేందుకు ప్రయత్నించారు. పోలీసులు సర్ది చెప్పిన వినకుండా

Adminఏప్రిల్ 28, 2026 - మంగళవారం👁 1
సమంత బర్త్ డే సర్ ప్రైజ్.. స్పెషల్ వీడియో రిలీజ్
పాత
తెలంగాణ

సమంత బర్త్ డే సర్ ప్రైజ్.. స్పెషల్ వీడియో రిలీజ్

హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘మా ఇంటి బంగారం’. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం సామ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో సామ్ నటించిన యాక్షన్ సీక్వెన్స్ పై మేకర్స్ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.ఇక ‘ఓ బేబీ’ సినిమా తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేస్తున్న రెండో సినిమా ఇది. సమంత భర్త రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటితో కలిసి ఈ సినిమాకు కథ అందించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మే 15న ఈ సినిమాను థీయేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స ప్రకటించారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో..11.40 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
పాత
సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు...
పాత
ఘనంగా బారట పోచమ్మ పండగ
పాత
తెలంగాణ

ఘనంగా బారట పోచమ్మ పండగ

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ మండలం కేంద్రంలోని బరడ పోచమ్మ బోనాలను మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మహిళలందరూ ఉపవాసం ఉండి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం మహిళలు, ఆడప డుచులు గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తు కొని ఊరే గింపుగా బయలుదేరి డప్పు చప్పులతో, యువకుల కేరింతతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి  దీప, దూప నైవేద్యాలు సమర్పించి, కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మ వారికి మొక్కులు సమర్పించుకున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు […] The post ఘనంగా బారట పోచమ్మ పండగ  appeared first on Navatelangana.

ప్రపంచ ఇంధన మార్కెట్‎లో సంచలనం:  ఒపెక్, ఒపెక్+ కూటమి నుంచి UAE ఔట్
పాత
అణు ఒప్పందం లేకుండా యుద్ధ విరమణకు ఇరాన్
పాత
తెలంగాణ

అణు ఒప్పందం లేకుండా యుద్ధ విరమణకు ఇరాన్

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేసి, అమెరికా ఆంక్షలను ఎత్తివేస్తే యుద్ధాన్ని ముగించడంతో పాటు హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధమని ఇరాన్ చేసిన ప్రతిపాదనపై అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు.పాకిస్థాన్ ద్వారా అమెరికాకు చేరిన ఈ ప్రతిపాదనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే సందేహాలు వ్యక్తం చేశారు. ఏ ఒప్పందమైనా ఇరాన్ అణ్వాయుధాల దిశగా ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లకుండా పూర్తిగా అడ్డుకునేలా ఉండాలి అని ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా బృందంతో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దీనిపై ట్రంప్ తరువాత అధికారికంగా స్పందించే అవకాశం ఉందని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచి రష్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కు దీర్ఘకాలంగా మద్దతు ఇచ్చే రష్యా ప్రస్తుతం ఎలాంటి సహాయం అందిస్తుందన్నది స్పష్టంగా తెలియరాలేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ లో కనీసం 3,375 మంది మరణించినట్లు సమాచారం.అల

సమర్థ శిక్షణలో సేవాదళ్ నాయకులు ఉమర్
పాత
తెలంగాణ

సమర్థ శిక్షణలో సేవాదళ్ నాయకులు ఉమర్

నవతెలంగాణ-నవాబు పేటతెలంగాణ రాష్ట్ర టీపీసీసీ రాష్ట్ర స్థాయి సమర్థ శిక్షణ శిబిరంలో భాగంగా రాష్ట్ర సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరానికి నవాపేటకు చెందిన సేవాదళ్ నాయకులు ఎండి ఉమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమర్ మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను పార్టీ విధి విధానాలలో భాగంగా ఇచ్చే శిక్షణలో పాల్గొని పార్టీకి నిబద్ధతతో కూడిన కార్యకర్తగా పనిచేసేందుకు కృషి చేస్తానని అన్నారు. టీపీసీసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తనకు శిక్షణలో అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు […] The post సమర్థ శిక్షణలో సేవాదళ్ నాయకులు ఉమర్  appeared first on Navatelangana.

మల్లారం విద్యుత్ సమస్యకు పరిష్కారం
పాత
తెలంగాణ

మల్లారం విద్యుత్ సమస్యకు పరిష్కారం

రూ. 25 లక్షల నిధులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబుమంత్రి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుల పాలభిషేకంనవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని మల్లారం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తుల, రైతుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. గ్రామానికి, వ్యవసాయ రంగానికి ఒకే విద్యుత్ లైన్ ఉండటంతో ఇన్నాళ్లూ ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చొరవతో తెరపడనుంది. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో […] The post మల్లారం విద్యుత్ సమస్యకు పరిష్కారం appeared first on Navatelangana.

తల్లిగా నా పెంపకంపై మచ్చ పడకూడదు.. అకీరా, ఆద్యలకు రేణు దేశాయ్ ఎమోషనల్ కండిషన్!
పాత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
పాత
తెలంగాణ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డిఆర్ఐ అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకుని, వారి వద్ద నుండి 11.4 కేజీల యాంఫేటమైన్ (Amphetamine) స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.11.4 కోట్లు ఉంటుందని అంచనా. బ్లాక్ కవర్లుల్లో, డిజైనర్ పేపర్‌తో కప్పి, బెడ్‌షీట్‌ల మడతల్లో దాచి మహిళలు స్మగ్లింగ్ చేస్తున్నారు.ఇద్దరు మహిళ నిందితులను డిఆరఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Rohit Sharma: ముంబై ఇండియన్స్కి గుడ్ న్యూస్.. జట్టులోకి రోహిత్ రీఎంట్రీకి లైన్ క్లియర్
పాత
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ధాన్యం లారీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు
పాత
తెలంగాణ

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ధాన్యం లారీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు

మెదక్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొల్చారం దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసి సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి, ధాన్యం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ఘటనలో దాదాపు ౩౦ మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్టీసి బస్సు.. హైదరాబాద్ నుండి మెదక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

బ్యాంకాక్ టూ హైదరాబాద్.. శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో రూ. 2 కోట్ల డ్రగ్స్ సీజ్
పాత
డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం దెబ్బ తింటుంది
పాత
తెలంగాణ

డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం దెబ్బ తింటుంది

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు నవతెలంగాణ – పరకాల జిల్లాలో నెలకొన్న డీజిల్ కొరత వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుత సాగు సీజన్‌లో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అత్యవసరమని, అయితే బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో సాగు పనులు […] The post డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం దెబ్బ తింటుంది appeared first on Navatelangana.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రేవూరి
పాత
తెలంగాణ

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రేవూరి

పరకాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంనవతెలంగాణ – పరకాల రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం […] The post రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రేవూరి appeared first on Navatelangana.

దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం దోలా భారత్‌కు అప్పగింత
పాత
తెలంగాణ

దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం దోలా భారత్‌కు అప్పగింత

భారత భద్రతా, నిఘా సంస్థలకు కీలక విజయంగా భావిస్తున్న పరిణామంలో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు చెందిన ప్రముఖ సభ్యుడు, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు అయిన సలీం దోలాను భారత్‌కు అప్పగించారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇటీవల భారత, అంతర్జాతీయ నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సలీం దోలా పట్టుబడ్డాడు. అనంతరం ప్రత్యేక విమానంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ఉదయం ఢిల్లీలోని టెక్నికల్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు.అధికారుల సమాచారం ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వహించడంలో దోలా కీలక పాత్ర పోషించాడు. అతడు నడిపిన మాదకద్రవ్యాల సామ్రాజ్య విలువ రూ.5,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దావూద్ ఇబ్రహీం ఆధ్వర్యంలోని డీ -కంపెనీకి చెందిన అంతర్జాతీయ డ్రగ్ పంపిణీ వ్యవస్థను ఛేదించే దిశగా ఈ అప్పగింత కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు.ఈ నెట్‌వర్క్ చాలాకాలంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ), ముంబై పోలీసుల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది.దేశ రాజధానికి చేరుకున్న వెంటనే సలీం దోలాను నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య

ఔటర్ రింగ్ రోడ్డు రైలింగ్ ఢీకొట్టిన కారు..ఒకరు మృతి
పాత
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం... మెకానిక్ షెడ్డులో మంటలు... రెండు కార్లు పూర్తిగా దగ్ధం...
పాత
శంషాబాద్ టు ముంబై, బెంగళూరు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ : సీఎం రేవంత్
పాత
భర్తను హనీమూన్ తీసుకెళ్లి చంపిన భార్య సోనమ్‎కు బెయిల్
పాత
రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
పాత
తెలంగాణ

రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

నవతెలంగాణ-రాయికల్రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జరిగింది. తెలంగాణ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల నియమావళి-2020 ప్రకారం నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్ల ద్వారా ఈ ఎన్నిక చేపట్టారు.మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరు సభ్యులుగా వల్లకొండ మహేష్, మహిళా సభ్యురాలిగా సుదవేని లత ఎన్నికయ్యారు. మైనారిటీ వర్గానికి చెందిన సభ్యులుగా ఇర్ఫాన్ అలీ, మహిళా సభ్యురాలిగా ఎం.డి. ఇంత్యాజ్ పర్వీన్ ఎన్నికయ్యారు.ఎన్నిక అనంతరం కో-ఆప్షన్ […] The post రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక appeared first on Navatelangana.

ఒడ్డేలింగాపూర్ అంగన్వాడిలో పోషణ పక్వాడ్
పాత
తెలంగాణ

ఒడ్డేలింగాపూర్ అంగన్వాడిలో పోషణ పక్వాడ్

నవతెలంగాణ-రాయికల్మండలంలోని ఒడ్డేలింగాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం,గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించగా.. గర్భిణీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం కార్యక్రమం చేపట్టారు. పోషణ, ఆరోగ్యంపై వైద్యాధికారి సతీష్ అవగాహన కల్పిస్తూ తల్లులు, గ్రామస్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎన్. మానస,ఉపసర్పంచ్ శంకర్, అంగన్వాడి టీచర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. The post ఒడ్డేలింగాపూర్ అంగన్వాడిలో పోషణ పక్వాడ్  appeared first on Navatelangana.

ఆలూరులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి సర్వే
పాత
తెలంగాణ

ఆలూరులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి సర్వే

నవతెలంగాణ-రాయికల్మండలంలోని ఆలూరు గ్రామపంచాయతీని జాతీయ గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్ సంస్థ ప్రతినిధి సుధాకర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సభల్లో ప్రజల పాల్గొనింపు స్థాయి, గ్రామపంచాయతీ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సర్వే నిర్వహించారు. గ్రామస్థుల అభిప్రాయాలను సేకరిస్తూ.. గ్రామ సభల నిర్వహణలో ఉన్న లోపాలు, వాటి మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అలాగే పలు సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.సేకరించిన వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను జాతీయ స్థాయి ప్రభుత్వ శాఖకు […] The post ఆలూరులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి సర్వే appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA