🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5371 articles

సర్కారు బడుల్లో వారోత్సవాల సందడి షురూ
Older
Telangana

సర్కారు బడుల్లో వారోత్సవాల సందడి షురూ

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలిక్కి తీయడంపాఠశాలలపై విశ్వాసం పెంచడంనవతెలంగాణ – మల్హర్ రావువిద్యా ప్రమాణాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 11 నుంచి 17 వరకు ఏడు రోజుల పాటు విద్యాశాఖ వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు.రోజుకో కార్యక్రమం చొప్పున అధికారులు ఏడు రకాల కార్యక్ర మాలు చేపడుతున్నారు. సర్కారు బడులపై విశ్వాసం పెంచడం, విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడం, తల్లిదండ్రులు,ప్రజా ప్రతినిధులను భాగసామ్యం చేయడమే […] The post సర్కారు బడుల్లో వారోత్సవాల సందడి షురూ appeared first on Navatelangana.

Admin4 days ago👁 2
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె.. బిఎస్‌ఎఫ్‌కు భూమి అప్పగింత
Older
Telangana

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె.. బిఎస్‌ఎఫ్‌కు భూమి అప్పగింత

15 రోజుల్లో ప్రక్రియ పూర్తిఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాలో చేరిక జూన్ 1 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సిఎం సువేందు అధికారి నేతృత్వంలో కేబినెట్ తొలి నిర్ణయాలు మేనిఫెస్టోలో హామీల అమలు దిశగా అడుగులు కోల్‌కతా : ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో సోమవారంనాడు జరిపిన పశ్చిమ బెంగాల్ తొలి మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ కోసం భూమిని బిఎస్‌ఎఫ్‌కు తక్షణమే స్వాధీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టి తీరుతామని బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రధానంగా హామీ ఇచ్చింది. ఈ హామీ అమలు దిశగా సువేందు సర్కార్ తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో సువేందు మాట్లాడుతూ.. -బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్‌కు అవసరమైన భూమి బిఎస్‌ఎఫ్ నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. బిఎస్‌ఎఫ్‌కు భూమిని బదిలీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. సరిహద్దు ఫెన్సింగ్‌ను బిఎస్‌ఎఫ్ సాధ్యమైనంత

తాడిచెర్లలో జనగణన ప్రారంభం
Older
PBKS vs DC: ప్రియాంష్ ఆర్య మెరుపు బ్యాటింగ్.. 10 ఓవర్లకి పంజాబ్ స్కోర్ ఎంతంటే!
Older
బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి
Older
ఉపాధిహామీ కూలీలకు మజ్జిక ప్యాకేట్స్ అందజేత
Older
వకీల్ సాబ్ కాదు.. ఈసారి అంతకుమించి! 'వీరభద్రుడు'గా సూర్య రుద్రతాండవం.. అదిరిపోయిన ట్రైలర్!
Older
రజనీ-కమల్ హిస్టారికల్ మల్టీస్టారర్‌లో త్రిష ఎంట్రీ.. ఆఫర్ చేసిన భారీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Older
ఒడిశా టూ మహారాష్ట్ర..పటాన్ చెరు ORR దగ్గర రూ. 2 కోట్ల గంజాయి సీజ్
Older
అందమైన ‘మందారం’గా డింపుల్...
Older
Telangana

అందమైన ‘మందారం’గా డింపుల్...

చార్మింగ్ స్టార్ శర్వా... డైరెక్టర్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్ -ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా ’భోగి’. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం, శర్వా కెరీర్‌లో అత్యంత భారీ స్థాయి వెంచర్‌లలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు డింపుల్ హయాతి పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. డింపుల్ హయతి ఈ చిత్రంలో ‘మందారం’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో కనిపిస్తున్న ఆమె లుక్ 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఇటీవల చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించింది. హైదరాబాద్‌లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్ నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల క

జులై 1 నుంచి అమల్లోకి ‘విబిజిరామ్ జి’ చట్టం
Older
Telangana

జులై 1 నుంచి అమల్లోకి ‘విబిజిరామ్ జి’ చట్టం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (విబిజిరామ్ జి చట్టం)ను అమల్లోకి తీసుకురానుంది. కొత్త చట్టం వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం సోమవాంరనాడు ప్రకటించింది. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ లభిస్తుంది. ప్రస్తుతం ఎంజీనరేగా ద్వారా 100 రోజుల ఉపాధి మాత్రమే లభిస్తోంది. గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 2005 నుంచి అమల్లో ఉన్న ఎంజీనరేగా పథకాన్ని అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంజీనరేగా నుంచి కొత్త చట్టంలోకి మార్పు సజావుగా జరుగుతుందని, కార్మికులకు ఎలాంటి అంతరాయమూ కలగదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యేంత వరకు, ప్రస్తుతం ఉన్న ఇకెవైసి జాబ్ కార్డులే చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఆ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారికి ఉపాధి లభిస్తుందని, జాబ్ కార్డులు

బండి భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్ట్ చేయాలి: SFI
Older
బాటసారులకు మజ్జిగ పంపిణీ
Older
’పెద్ది’ ట్రైలర్ వచ్చేది అప్పుడే
Older
Telangana

’పెద్ది’ ట్రైలర్ వచ్చేది అప్పుడే

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్- స్పోర్ట్ డ్రామా ’పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్-లుక్ పోసర్లు, రెండు చార్ట్ బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ’పెద్ది’ జూన్ 4న పాన్- ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న జరగనున్నాయి. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ పాత్రలోని రెండు షేడ్స్ చూపించిన టీమ్, ట్రైలర్‌లో సినిమా అసలు కథ, ప్రధాన పాత్రలను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంచనాలను మరింత పెంచుతూ విడుదలైన కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ పూర్తి స్థాయి 1960ల గ్రామీణ యువకుడి లుక్‌లో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ కనిపిస్తున్నారు. ఈ కొత్త గెటప్‌లో రామ్ చరణ్ అద్భుతంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ పూర్తి స్థాయిలో రగ్గడ్ మేకోవర్‌తో కనిపించనున్నారు. జాన్వీ కపూర్, శివ రా

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు
Older
Telangana

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు

నవతెలంగాణ-వర్ధన్నపేటతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి పోశయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో బలోపేతం చేసుకోవాలని, పూర్వ విద్యార్థులు, ఒక వ్యక్తి ఐదుగురు చొప్పున డిగ్రీ కళాశాలలో చేరే విధంగా కృషి చేయడంతో పాటు […] The post ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు appeared first on Navatelangana.

స్టాలిన్ నివాసానికి సిఎం విజయ్
Older
Telangana

స్టాలిన్ నివాసానికి సిఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారంనాడు అనూహ్యంగా మాజీ సిఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. సోమవారంనాడు ఇక్కడి అళ్వారుపేటలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్ది నిమిషాల పాటు స్టాలిన్‌తో విజయ్ భేటీ కావడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సిఎం విజయ్‌ను స్టాలిన్ తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా అక్కడే ఉన్నారు. వీరిద్దరూ ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు రాలేదు.గత ఐదేళ్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన స్టాలిన్ తాజా ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో టివికె అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం టివికెకు దక్కలేదు. దీంతో డిఎంకె మిత్ర పక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, విసికె, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించడంతో విజయ్ సిఎం అయ్యారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ను విజయ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని టివికె ప్రతినిధులు వెల్లడించారు. అనంతరం విజయ్ ఎండిఎంకె నేత వైగోను కూడా కలిశారు.

ఏన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి
Older
Telangana

ఏన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి

నవతెలంగాణ-ఆలేరు టౌనుఎన్యూమారేటర్లకి, సూపర్వైజర్లకి జనగణలో ప్రజలు సహకరించాలని, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాసరెడ్డి కోరారు. ఆలేరు మున్సిపాలిటీలో సోమవారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు వారికి కేటాయించిన బ్లాకులలో తిరిగి ప్రతి ఇంటింటికి నెంబరు కేటాయించడం, రఫ్ మ్యాప్ తయారు చేయడం వంటి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజర్ జగన్ మోహన్, మాస్టర్ ట్రైనర్ దూడల వెంకటేష్, సూపర్వైజర్ పోరెడ్డి రంగయ్య, ఇతర సూపర్వైజర్లు, ఎన్యూమారేటర్లు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. The post ఏన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి appeared first on Navatelangana.

ఏ శక్తికీ భారత్ తలవంచదు..అణచివేతకు గురికాదు: పిఎం మోడీ
Older
Telangana

ఏ శక్తికీ భారత్ తలవంచదు..అణచివేతకు గురికాదు: పిఎం మోడీ

ప్రపంచంలో ఏ శక్తీ భారత్‌ను తలవంచేలా చేయలేదని, అణిచివేయాలని కూడా చూడబోదని ప్రధాని మోడీ అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారంనాడు పాల్గొన్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత దక్కుతుందని, ఎలాంటి ఒత్తిళ్లు కూడా ఈ దేశాన్ని నీరుగార్చలేవని అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను కూడా లెక్కచేయలేదని, జాతీయ ప్రయోజనాలకే ఎప్పుడూ తొలి ప్రాధ్యానం ఉంటుందని చాటిచెప్పిందన్నారు. సోమనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదని, దేశ దృఢ సంకల్పానికి ప్రతీక అని అభివర్ణించారు. ధ్వంసం నుంచి నవనిర్మాణం వరకూ సోమనాథ్ ప్రయాణం చెక్కుచెదరని నాగరికతను ప్రతిబింబిస్తుందని, సర్దార్ పటేల్ విజన్‌కు ఇది మచ్చ

ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిబిరం ప్రారంభం
Older
Telangana

ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిబిరం ప్రారంభం

నవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరు పట్టణంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11 నుండి 25 వరకు, పిఎం శ్రీ పాఠశాలల్లో ప్రభుత్వం ఉచిత వేసవి శిబిరాన్ని అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మీ అన్నారు. పిఎంసి పాఠశాల ఆవరణలో సోమవారం ఎర్ర లక్ష్మీ ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వేసవి శిబిరాన్ని 6వ తరగతి నుండి 9వ తరగతి చదివే విద్యార్థులు అందరు ఉపయోగించుకుని పాఠశాలలో గేమ్స్, క్రాఫ్ట్, ఆర్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రావీణ్యం పొందాలని […] The post ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిబిరం ప్రారంభం appeared first on Navatelangana.

స్కూళ్ల పేరుతో ప్రభుత్వం రూ.500 కోట్ల అవినీతి: హరీశ్‌రావు
Older
Telangana

స్కూళ్ల పేరుతో ప్రభుత్వం రూ.500 కోట్ల అవినీతి: హరీశ్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో రూ.500 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడినట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ధ్వంసమైన మట్టికోట శివాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 76 స్కూళ్లు మంజూరుచేసి ఎక్సెస్ టెండర్లతో రూ.500 కోట్ల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడిండన్నారు. టెండర్లు పిలిస్తే అన్నీ 4.86 శాతం, 4.96 శాతం, 4.99 శాతానికి ఎక్సెస్‌కే ఇచ్చారు. ఒక్క టెండర్ కూడా మైనస్ పోకుండా అన్ని ఎక్సెస్‌కే ఎలా పోయాయని, ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా రూ.494.01 కోట్ల ఎక్సెస్ అమౌంట్ ద్వారా ప్రజా ధనం లూఠీ అయిందన్నారు. నర్సంపేట ప్యాకేజీ 8 కింద రూ.136 కోట్లకు టెండర్ ఉంటే అది రూ.142 కోట్లతో 4.86 శాతం ఎక్సెస్ ఇచ్చారన్నారు. తనకనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజినీర్‌గా పెట్టుకొని ఈ రూ.500 కోట్ల దోపిడీకి తెర తీశారన్నారు. హ్యామ్ రోడ్లలో టెండర్లు దక్కించుకున్నవారు నా మనుషులని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారని వారు నా మనుషులై

యూసుఫ్‌గూడ ఎస్‌బిఐలో డబ్బులు మాయం
Older
Telangana

యూసుఫ్‌గూడ ఎస్‌బిఐలో డబ్బులు మాయం

ఎస్పిర్ మిషన్‌లోని డబ్బులు మాయం అయిన సంఘటన యూసుఫ్‌గూడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్‌గూడ ఎస్‌బిఐలో క్యాష్ ఇన్‌చార్జిగా అబ్బిరెడ్డి యాదగిరి రెడ్డి పనిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన బ్రాంచిలోని ఎటిఎం స్థానంలో ఎస్‌పిఆర్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మిషన్‌ను బ్యాంక్‌లో ఏర్పాటు చేశారు. బ్యాంక్ ఎటిఎం నుంచి డబ్బులు తీయకుండానే తీసినట్లు ఎంట్రీ, బోగస్ ఎంట్రీలు సృష్టించారు. తర్వాత యాదగిరి రెడ్డి, సిబ్బంది కలిసి ఎటిఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంక్ స్ట్రాంగ్ రూంకు తరలించారు. బ్యాంక్ అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించగా తేడా వచ్చింది. రూ. అందులో 23లక్షలు మాయం అయినట్లు గుర్తించారు. సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. బ్యాంక్ ఛీఫ్ మేనేజర్ కిరణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పైపులైన్ తొలగించేందుకు లంచం..ఏసీబీకి చిక్కిన కొమురవెళ్లి పంచాయతీ సెక్రటరీ
Older
ప్రధాని ప్రసంగం ‘మన్ కీ బాత్’లా ఉంది : కోదండరాం
Older
Telangana

ప్రధాని ప్రసంగం ‘మన్ కీ బాత్’లా ఉంది : కోదండరాం

బిజెపి బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగం ‘మన్ కీ బాత్’ తరహాలో ఉందని తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు, ఎంఎల్‌సి ప్రొ. కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై స్పష్టత ఇవ్వలేదని ఆచప విమర్శించారు. సోమవారం మీడియా సమావేశంలో ప్రొ. కోదండరాం మాట్లాడుతూ జనగణనలో కులగణన, బిసిల 42 శాతం రిజర్వేషన్లపై ప్రధాని ప్రకటన చేస్తారని ఆశించామని, కాని బంగారం కొనొద్దు, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని సుభాషితాలు చెప్పిపోయారని అన్నారు. ఈ సుభాషితాలు దూరదర్శన్‌లో కూర్చుని కూడా చెప్పవచ్చని ఎద్దేవా చేశారు. జల విహార్‌లో తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ నిర్వహిస్తున్నామని కోదండరాం తెలిపారు. గత ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బిఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేశామని వివరించారు. ప్లీనరీలో గత పోరాటాలు, విజయాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేసినా తమ అస్తిత్వాన్ని కోల్పోమని కోదండరాం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ప్లీనరీకి వస్తున్నారని తెలిపారు. ఈ విలేకరు

తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‎గా గద్వాల విజయ లక్ష్మీ.. సభ్యులుగా శ్రీకాంత్ చారి తల్లి, చాకలి ఐలమ్మ మనవరాలు
Older
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA