5401 articles

తన సినిమాల్లో హీరో అక్కర్లేదని అంటోంది స్టార్ హీరోయిన్ సమంత. దీనికి ఆమె చెప్పే లాజిక్ కూడా సహేతుకంగా ఉంది. నేను ఎంచుకున్న సినిమాల్లో కథే హీరో. నా దృష్టిలో మొదటి స్థానం కథకే. ఆ తర్వాతే నటీనటులు. కాబట్టి నా సినిమాల్లో కథ హీరో‘ అని తన వర్షన్ వినిపించింది సమంత. అయితే అంతర్లీనంగా చూసుకుంటే, స్టార్ హీరోల సినిమాల్లో తను నటించనని, హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తానని ఆమె చెప్పకనే చెప్పింది. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విశేషాలు వెల్లడించింది సమంత. ప్రస్తుతం ఈమె 25 వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తోందట. తన రోజువారీ కార్యక్రమాలు, బిజినెస్ పనులు అన్నీ వాట్సాప్‌లోనే చూసుకొని, అందరి కంటే ముందే స్పందిస్తానని చెబుతోంది. ఇలా బిజీ లేకుండా గడిపే సమంత, ప్రతి 3 నెలలకు ఒక్కసారి కచ్చితంగా బ్రేక్ తీసుకుంటానంటోంది. ఇషా ఫౌండేషన్‌కు వెళ్లి వారం రోజులు ఏకాంతంగా గడుపుతుందంట. ఈ వారం రోజులు ఆమె ఫోన్ అస్సలు చూడదంట.




గోషామహల్: హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్లిన కుటుంబాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి భారీగా బంగారం, వెండి, నగదును అపహరించారు. జైన్ స్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు తన బంధువుల పెళ్లికి ఆదివారం ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టబడినట్లు గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా సుమారు 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు దొంగిలించినట్లు తెలిసింది. వెంటనే గోషామహల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోశామహల్ పోలీసులు ఇంటికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సిసిటివి ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో బొంగులూరు గేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల విడుదలైన టాలెంట్ సినిమాలో భరత్ కాంత్ హీరోగా నటించడంతో పాటు పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో నటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హీరో భరత్ కాంత్, త్రిలోక్ గా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 850కిపైగా పాయింట్ల నష్టంతో మొదలైంది. నిఫ్టీ కూడా 232 పాయింట్లు పతనమైంది. ప్రధాని మోడీ బంగారంపై చేసిన వ్యాఖ్యలతో పాటు ఇరాన్‌తో అమెరికా శాంతి ప్రతిపాదనలు తిరస్కరించడం వంటి అంశాలు ప్రభావం చూపించాయి. ఈ రోజు ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 908 పాయింట్లను నష్టపోయి 76,414 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 266 పాయింట్లను కోల్పోయి 23,909 పాయింట్ల వద్ద […] The post భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు appeared first on Navatelangana.

సుక్కపొద్దున్న మా అమ్మ సక్కంగ పొయ్యికాడ ఇంటిల్లిపాదికి ఊపిరులూదేది బతుకు పోరుకు మా అయ్య మెత్తంగ కొడవలి గొడ్డలి నూరెటోడు కడవలో అంబలి కడుపులోసుకొని గుడ్డలో సంకటి మూటకట్టుకొని బయలుదేరేది పల్లె బతుకుదెరువుకు చెట్టు పుట్టలను మదిలో మొక్కుకుంటూ సల్లని వెన్నెల వెలుతురే దారిన పరిచిన తెల్లని తివాచీ వడివడిగా వేసిన అడుగులే మా సంకటి ముద్దలకు దిక్సూచి ఆకాసం ఎర్రబడక ముందే మా అమ్మయ్య చేతులు ఎరుపెక్కేవి తునికాకు సంచులు నిండితే వాళ్ల కడుపు నిండిన ఆనందం ఇసుక దిబ్బల మీద బంతి భోజనం చెలిమె నీళ్లతో దోసిళ్ళ స్నేహం అంబటాల్లకు తిరుగు పయనం మా అందరికీ ఎనలేనిసంబురం అలిసిసొలిసినతనువులకు తుంకాకు సంచులే దూదిపాన్పులు - గుంటి.తిరుపతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ గొంతు కోసి హత్య చేశారు. గాంధీనగర్ సమీపంలో అర్ధరాత్రి దుండగులు ఎపిఎస్ పి కానిస్టేబుల్ నాగేశ్వరరావు(46)పై దాడి చేశారు. అనంతరం కానిస్టేబుల్ గొంతు కోసి చంపేశారు. మద్యం మత్తులో పలువురు యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కవిత్వమొక తీరని దాహం.. కొందరి ఆలోచనల తాలూకు అక్షరాలు శతాబ్దాలుగా భవిష్యత్ తరాలకు జ్ఞాన ధార లై, స్ఫూర్తి తారలై, ప్రకాశిస్తూ, ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాంటి కోవలోని ఓ కవితే ‘ఏక్లా చలో రే’. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1905లో బెం గాల్ విభజన సమయంలో జాతీయోధ్యమానికి ఎవ్వరూ రాకపోయినా, ఒంటరిగానే లక్ష్యం వైపు ప్రయాణించమని 30కోట్ల మంది భారతీయుల్ని ప్రేరేపించడానికి రాసిన ప్రసిద్ధ దేశభక్తి గీతం ఇది. ‘ఏక్లా చలో రే’ కవిత జీవితాంతం గాంధీకే కాక, దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది. స త్యం, అహింసా మార్గంలో ప్రయాణించేటప్పుడు ఎ వరూ తోడు రాకపోయినా ధృడసంకల్పంతో ఒంటరిగా ముందుకు సాగాలనే ఈ కవితను గాంధీజీ ప్రార్థన సమావేశాల్లో తప్పక పాడేవారు.ఈ కవిత 1905లో మొదటిసారిగా ‘భండార్’ అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత బాఉల్ (Baul) సంకలనంలో కూడా చూడవచ్చు. ఠాగూర్ సంగీత సంపుటి, గీతా బితన్‌లోని స్వదేశీ విభాగంలో ఇది చేర్చబడింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నా జీవన గమనం లో, ఎన్నో క్లిష్ట సందర్భాల్లో.. కొన్ని వందలసార్లు నేను ఈ కవితను మననం చేసుకుంటూ నే ఉన్నాను. ఇప్పుడు నా కూతుళ్లకు సైతం ఈ గేయాన్ని నేర్పించాను. సార

ప్రపంచ సాహిత్యం రచయితలు: మెహఫిల్ పాఠకుల కోసం మరో కొత్త శీర్షిక ప్రారంభం అవుతున్నది. భిన్నసంస్కృతులను, జీవన విధానాలను, ప్రాంతాలను, మానవుల సంఘర్షణలను, ఆశ నిరాశల వెతుకులాటలను, స్వప్నాలను అర్ధం చేసుకునేందుకు ప్రపంచ సాహిత్యం చదవడం ఎంతో అవసరం. ఆ సాహిత్యం మన చూపును మరింత విశాలం చేస్తుంది. నూతన భావాలను పరిచయం చేస్తుంది. పాఠకుల్ని సంస్కారవంతులైన మానవులుగా నిలబెడుతుంది. సుప్రసిద్ధ రచయిత ఎడ్వర్డ్ మోర్గాన్ ఫాస్టర్ గురించి, ఆయన 115ఏళ్ల క్రితం స్వలింగ సంపర్కంపై రాసిన మోరిస్ నవల గురించి ఎంతో ఆసక్తికరమైన అంశాలను ఈ వ్యాసం ప్రస్తావిస్తుంది. ఎడిటర్, మెహఫిల్.ఇదొక అపురూపమైన ప్రేమ కథ. ఒక డ్రాయర్ సొరుగులో దాచిపెట్టిన కథ. అర్ధ శతాబ్దం పాటు రహస్యంగా ఉండిపోయిన కథ. ఐరోపా దేశాలు1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగిపోయాయి. సరిగ్గా ఆ సంవత్సరంలోనే 35ఏళ్ల ఇంగ్లీష్ రచయిత ఎడ్వర్డ్ మోర్గాన్ ఫాస్టర్ ఓ నవల రాయడం ముగించాడు. ఆయన్ని సర్వ నాశనం చేయగల శక్తి ఆ కథకి ఉంది. ఒక యువకుడికి మరో యువకుడితో ఉన్న ప్రేమని ఫాస్టర్ అతి సున్నితంగా, మృదువుగా వివరించాడు. తనేంటో తెలుసుకున్నాక ధైర్యంగా సంతోషాన్ని వెతుకున్న యువకుడి కథ ఇది. 1914లో ఇ
నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడ గాంధీనగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఎపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు.. పాత కక్షల కారణంగానే హత్య జరిగిందా? లేక ఇతర వ్యక్తిగత కారణాలున్నాయా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. The post గొంతు కోసి ఎపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య appeared first on Navatelangana.

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో పాలకొండ జంక్షన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును రేసింగ్ బైక్ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొండ జంక్షన్ దగ్గర కారు యూ టర్న్ తీసుకుంటుండగా రేసింగ్ బైక్ 140 కిలో మీటర్ల వేగంతో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అర్షియా బేగం(30), ఉజేప(7), అమర్(2)లు మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన యాకుబ్ అఫ్జల్ (25) తన స్నేహితుడితో కలిసి బైక్ రేసింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం. బైక్ రేసింగ్ ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది.

ఒట్టావా: బైక్ ను కారు ఢీకొట్టింది. అనంతరం పది మీటర్లు ఎత్తులో గాల్లోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్ ఫోల్ కు బైక్ చిక్కుకుంది. ఈ సంఘటన కెనడాలోని సర్రే-డెల్టా రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిఎండబ్ల్యు కారు అతి వేగంతో బైక్ ఢీకొట్టింది. అనంతరం బైక్ గాల్లోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్ పోల్ కు చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాల్లో బైక్ వేలాడుతుండడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 48 గంటల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో వర్షాలు కురిసే ఆస్కారముందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా […] The post రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు… appeared first on Navatelangana.

హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు రైల్వే ట్రాక్ సమీపంలో ఎగిసిపడటంతో సికింద్రాబాద్ నుండి భద్రాచలంలో వెళ్లే కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు 30 నిమిషాల పాటు నిలిపివేశారు. స్థానికుల సహాయంతో రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకరావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను లోకో పైలట్ గుర్తించి రైలును ఆపి వేయడంతో ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పొలానికి ఎవరు మంటలు అంటించారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పుల నేపథ్యంలో డీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. శాసనసభ్యుల ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. ఉపనేతగా సీనియర్ నేత కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలును నియమించారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ లభించలేదు. 108 స్థానాలతో […] The post డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ appeared first on Navatelangana.

ధర్మశాల: వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్‌కు సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే సవాల్‌గా మారింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఇలాంటి స్థితిలో ఢిల్లీతో పోరు పరీక్షగా తయారైంది. ఆరంభంలో వరుస విజయాలు సాధించిన పంజాబ్ ఆ తర్వాత పరాజయాల బాట పట్టింది. హ్యాట్రిక్ ఓటములతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతం పంజాబ్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంటోంది. అంతేగాక ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ఢిల్లీకి కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని భావిస్తోంది.

రాయ్‌పూర్: ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఎంఐపై ఆర్‌సిబి రెండు వికెట్లు తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి బ్యాటింగ్ చేసి 167 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ ముందు ఉంచింది. ఆర్‌సిబి 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయం సాధించింది. చివరలో కృనాల్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పాండ్యా 46 బంతుల్లో 73 పరుగులు చేసి విజయం కీలక పాత్ర పోషించాడు. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆర్‌సిబి విజయం సాధించింది. భువీ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి 23 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో భువీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంలో పాయింట్లో ఆర్‌సిబి తొలి స్థానానికి చేరుకుంది.
నవతెలంగాణ – హైదరాబాద్ : వేగంగా వెళ్తున్న కారు బైక్ ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని పాలకొండ చౌరస్తాలో చోటు చేసుకుంది. కారు యూటర్న్ తీసుకుంటుండగా స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post స్పోర్ట్స్ బైక్ – కారు ఢీకొని.. ఐదుగురు మృతి appeared first on Navatelangana.

సిద్దిపేట: ప్రేమ పెళ్లి చేసుకొని ఇద్దరు మనస్పర్థలు రావడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......కొమురవెళ్లి గ్రామానికి చెందిన దేశెట్టి వినయ్(23) అనే యువకుడు గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొండపాక గ్రామానికి చెందిన దండ్ల అంజలి(21) అనే యువతి దర్జా పని చేస్తూ తల్లిదండ్రులకు చేదోవాదోడుగా ఉంటుంది. గత సంవత్సరం అంజలి, వినయ్ గాఢంగా ప్రేమించుకున్నారు. ఇరువైపుల కుటుంబ సభ్యులను ఒప్పించి నెల రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వినయ్ పలుమార్లు ఫోన్ చేసినప్పుడు అంజలి ఎంగేజ్ రావడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఫోన్ ఆలస్యంగా మాట్లాడడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. వినయ్ ఫోన్ చేయడంతో ఆలస్యంగా లిఫ్ట్ చేయడంతో ఆమెపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్థాపం చెందిన అంజలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఈ విషయం ప్రియుడికి తెలియడంతో రాయవరం గ్రామ శివారులో చెట్టుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకు
నవతెలంగాణ – హైదరాబాద్ : చికెన్ ధరలు ప్రియం అవుతున్నాయి. వారం రోజుల నుంచి పరిశీలిస్తే ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 6న స్కిన్‌తో కిలో రూ.260 ఉండగా, ప్రస్తుతం రూ.310 నుంచి రూ.320కి చేరింది. అదే విధంగా స్కిన్లెస్ చికెన్ కిలోకు రూ.280 ఉండగా, ప్రస్తుతం రూ.350 నుంచి రూ.360కి చేరింది. దీంతో మాంసం ప్రియులు కోడి మాంసం కొనాలంటే భయపడుతున్నారు. The post భారీగా పెరిగిన చికెన్ ధరలు.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ధర్మశాల వేదికగా సోమవారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుతుంది. ఢిల్లీ ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. 11 మ్యాచ్‌ల్లో నాలుగే గెలిచిన DC మిగిలిన మూడు మ్యాచ్‌లను తప్పక గెలవాలి. ఇరు జట్లు ఇప్పటివరకు 36 సార్లు తలపడగా, DC 17, పంజాబ్ కింగ్స్ 18 విజయాలు సాధించాయి. The post IPL-2026: నేడు పంజాబ్, ఢిల్లీ మధ్య కీలక మ్యాచ్ appeared first on Navatelangana.