21291 వార్తలు



గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం, యశ్వీర్ కాంస్య పతకం సాధించారు. వీరిద్దరిని అభినందిస్తూ.. ప్రధాని మోడీ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. ‘‘గ్లాస్గో వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. రజత పతకం అందుకొన్నాడు. నిలకడ, సంయమనం, స్పూర్తిని ప్రదర్శించాడు. అతడి విజయం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. మున్ముందూ ఇదే ఉత్సాహంతో సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. కంగ్రాట్స్ యశ్వీర్. అద్భుతంగా పతకం సాధించావు. క్రీడపై నీకున్న ఆసక్తి, నిబద్ధతకు ఇదే తార్కాణం. యువ అథ్లెట్లకు స్పూర్తిగా నిలిచావు’’ అని మోడీ పోస్టు చేశారు. ‘‘జూడో 57 కేజీల విభాగంలో రజతం గెలిచిన యామిని మౌర్య, డెకథ్లాన్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన తేజశ్విన్ శంకర్‌కు శుభాకాంక్షలు. జూడో పట్ల యామిని అభిరుచి అద్వితీయం. ఎక్కువ మంది యువత జూడో వైపు వచ్చేందుకు ఆమె విజయం బాటలు వేస్తుంది. ఇక పది ఈవెంట్లలో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన తేజశ్విన్ కష్టానికి తగిన ప్రతిఫలం అందింది. మున్ముందూ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని మోడీ పేర్కొన్నారు.







అమరావతి: భోగాపురం విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు ను జాతికి అంకితం చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని వెంట ఉండి పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఎయిర్ పోర్ట్ పనులను చంద్రబాబు, పవన్ తో కలిసి మోడీ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. రికార్డు స్థాయిలో 13 వేల మందితో థింసా నృత్యం జరిగింది. థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ కారులో థింసా నృత్యాన్ని మోడీ తిలకించారు. బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోడీ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు మోడీకి బొబ్బిలి వీణను బహుకరించారు.









నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశంలో ఎలాంటి తీవ్ర పరిణామాలను సృష్టించిందో తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ ఈ అక్రమాలపై సాగించిన ఉద్యమం కార్చిచ్చులా దేశం లోనే కాదు, విదేశాల్లో కూడా వ్యాపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి లోపాలను సరిదిద్దే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూకోర్టు కాంప్లెక్సులో పేపర్ లీకేజీ కేసులను ప్రత్యేకంగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఢిల్లీ హైకోర్టు ఆగమేఘాలపై ఏర్పాటు చేసింది. దీంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సామర్థంపై సమీక్ష తెరపైకి వచ్చింది. అయితే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారే కానీ కేసులకు తగినట్టు కొత్తగా న్యాయమూర్తులను నియమించడం కానీ, న్యాయవ్యవస్థలో అదనపు సామర్థాన్ని సమకూర్చక పోవడంతో ఒకవంక న్యాయవాదులు, సిబ్బంది, వనరుల కొరత, మరోవంక పెండింగ్ కేసుల భారంతో అవి సతమతమవుతున్నాయి. ఈ కోర్టులు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన సంస్కరణలు అమలులో ఉన్నాయా లేదా ఆలోచించాల్సిందే. సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసే ప్రక్రియ నిర

నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం ఎంతో మంది విద్యార్థులను బాధించింది. అయితే నీట్ పరీక్ష పేపర్ లీక్‌కి తాను బాధితురాలినే అని ప్రముఖ బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ పేర్కొన్నారు. 2015లో నీట్ పేపర్ లీక్ కావడం వల్ల తాను మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చిందని తెలిపారు. తనకు కూచిపూడి, పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె.. వాటిని ఏడది పాటు పక్కన పెట్టి పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యానని అన్నారు. డాక్టర్ కావాలని తాను ఎన్నో కలలు కన్నానని.. కష్టపడి చదివి, పరీక్ష రాసినప్పటికీ.. పేపర్ లీక్ కావడంతో అప్పట్లో చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ విద్యార్థులు అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం బాధాకరమని మానుషి అన్నారు. పరీక్ష కోసం మళ్లీ మళ్లీ చదవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.


