21510 వార్తలు







నారాయణపూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నారాయణపూర్ జిల్లా ఆబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలోని బాలేవాడ సిఆర్‌పిఎఫ్ క్యాంపును వరద నీరు ముంచెత్తింది. ఒక్కసారిగా వరదపొటెత్తడంతో జవాన్లు చెట్లు, రేకుల షెడ్ల పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. క్యాంపు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. అధికారులు వెంటనే స్పందించి జవాన్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

హైదరాబాద్: చట్టం పాలన మాత్రమే కొనసాగాలని..వ్యక్తుల పాలన కాదని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సూచించింది. శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బయటకొచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ కాపీలో కీలక అంశాలు వెలువడ్డాయి. వ్యక్తి ఆధిపత్యం కొనసాగిందనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని తెలిపింది. హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది స్పష్టమైందని, వివాదస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం చట్టవిరుద్ధం అని హెచ్చరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సిఎస్ కు సూచనలిచ్చింది. హైడ్రా కమిషనర్ ను తప్పించాలని ఈ నెల 27 న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు టాటా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన హైకోర్టు శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్ట ఔన్నత్యం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.




టీం ఇండియా అభిమానులకు బిసిసిఐ శుభవార్త అందించింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం తిరగబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మూడో వన్డేకి అతడు బెంచ్‌కి పరిమితమయ్యాడు. దీంతో అప్పటి నుంచి అతడు జట్టుకు దూరం కావడంతో.. అతడు లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. అయితే త్వరలో జరగబోయే శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు ఉంది. కానీ, అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటేనే ఆడుతాడని అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తీపి కబురు అందించింది. బుమ్రా ఫుల్ ఫిట్‌గా ఉన్నాడని తెలిపింది. దీంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో అతడు ఆడటం ఖాయమే. ‘‘జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఫిట్‌నెస్ టెస్టులను క్లియర్ చేశాడు. ఇప్పటికే స్క్వాడ్‌లో ఉన్న అతడు.. రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడు’’ అని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడటం భారత్‌కు అత్యంత కీలకం. ఇద్దరు ప్రధాన పేసర్లు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. బుమ్రా ఉంటే ప్రత్యర్థి లంక బ్యాటర్లు హడలెత్తడం ఖాయం.







అమరావతి: ఆంధ్రరాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా పిల్లాపేరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ పడిపోయింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి వంతెనపై వెళ్తుండగా వాగులో పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



