21516 వార్తలు

అమరావతి: ఆంధ్రరాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా పిల్లాపేరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ పడిపోయింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి వంతెనపై వెళ్తుండగా వాగులో పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







మహేశ్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచియమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా గురువారం(జులై 30) విడుదలైంది. ఈ సినిమా ఫ్యాన్స్‌లో కొందరికి నచ్చింది.. కానీ, చాలామందికి మాత్రం సినిమా నచ్చలేదని అని అంటున్నారు. రవీనా టండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైన ఈ సినిమాకి ‘ఆర్ఎక్స్100’, ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అయితే తొలి సినిమా కావడంతో జయకృష్ణ యాక్టింగ్‌లో ఫర్వాలేదు అనిపించాడు. సినిమా చూసిన అభిమానులు జయకృష్ణ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందని అంటున్నారు. ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. తొలి రోజు ఈ సినిమా రూ.1.25 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయని సమాచారం. కొత్త హీరోకి ఈ వసూళ్లు తక్కువే కావొచ్చు కానీ, ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లేదు. ఉన్నంతలో ఘట్టమనేని అభిమానులు సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఇది ఈ సినిమాకి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.






త్వరలో జరగబోయే హాకీ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళ జట్ల కోసం హాకీ ఇండియా రూపొందించిన కొత్త జెర్సీ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ కాషాయ రంగులో ఉండటంతో రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది. సుదీర్ఘ కాలంగా నీలం రంగు జెర్సీలోనే భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. ఈసారి మాత్రం జెర్సీని పూర్తిగా కాషాయ రంగులోకి మార్చేశారు. అయితే ఒడిశాలోని బిజెపి ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఇది జరిగిందని ఆ రాష్ట్ర మాజీ సిఎం నవీన్ పట్నాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఈ జెర్సీ రంగు మార్పు వెనుక రాజకీయ కోణం ఉందన్నారు. ఈ క్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్లకు రాసిన లేఖ సంచలనంగా మారింది. ‘‘భారత జాతీయ హాకీ జట్టు జెర్సీ రంగులో మార్పు గురించి చర్చించాటీం ఇండియా కాషాయ రంగు జెర్సీ వివాదంలో కొత్త ట్విస్ట్లనుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు ప్రతిపాదన లేకుండానే.. నా దృష్టికి రాకుండా ఈ నిర్ణయం జరిగిపోయింది అని అనిపిస్తోంది. జెర్సీని కాషాయ రంగులోకి మార్చడం ఒకటే నా లేఖకు కారణం కాదు. ఇది దేశానికి ప్రాతినిథ్యం వహించే జాతీయ జట్టు గుర్



హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని రేగా పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ నెల 26న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రేగా కాంతారావుపై యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ ఛానెల్ పేరుతో ఫ్లాట్‌కు పిలిపించి వేధించారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపణలు చేసింది.

హైదరాబాద్: ఎగువన భారీ వర్షాలు కురవడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీలో 38 మంది చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్థానిక జాలర్లు పడవల్లో అక్కడికి చేరుకున్నారు. స్థానిక సిఐ, ఎస్ఐ తన సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వీరాపురంలో ఇసుక పాయల్లోకి వరద నీరు చేరుకోగానే లారీ డ్రైవర్లు, కూలీలు భయటకు వచ్చేశారు. ఇప్పుడు చిక్కుకున్న వారిలో 30 మంది డ్రైవర్లు, కూలీలు ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్రాలో భారీ వర్షాలు కురవడంతో కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన భారీ వర్షాల కురవడంతో గోదావరి, ప్రాణహిత నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం దగ్గర 11 మీటర్ల ఎత్తుకు ప్రవాహం చేరుకోగా 12.210 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరదం ప్రవాహం ముంచెత్తగా ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 5 లక్షల 66 వేల క్యూసెక్కులుగా ఉంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.




