21618 వార్తలు




న్యూఢిల్లీ: ప్రశ్న పత్రాల లీకేజీ నిరోధానకి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026’ రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఏడు గంటలపాటు చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జితేంద్ర సంగ్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఏ మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. పిల్లల భవిష్యతును ప్రమాదంలో పడేయడాన్ని అనుమతించబోమన్నారు. దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంతో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. ఈ బిల్లును తీసుకురావడానక ప్రధాని ఏ మాత్రం ఆలస్యం చేయలేదని వెల్లడించారు.





చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. గడియారం స్తంభం సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు అతివేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, పాదచారులను ఢీకొడుతూ వెళ్లాడు. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.



హైదరాబాద్: విద్యలో నాణ్యత పెరగాలని, ప్రపంచంతో మనపిల్లలు పోటీ పడాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్య అందింది, ఆకలి తీరింది.. కానీ ప్రపంచంతో పోటీ పడటానికి ఇది సరిపోదని అన్నారు. ఫిన్లాండ్, జర్మనీ టీచర్ ఎక్సైంజ్ కార్యక్రమానికి సిఎం, ఉపాధ్యాయులు సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెసిడెన్సియల్ స్కూల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యయో అధ్యయనం చేయండని సూచించారు. ప్రభుత్వాలు సాధారణంగా ఓటుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాయని, ఏ ప్రభుత్వంలో నియామకాలు జరిగాయి? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కూడా రాజకీయాలు చేయద్దని తమ ఆలోచన అని కోరారు. వెనుకబాటు తనానికి ఆస్తికి సంబంధం లేదని, కానీ పిల్లలను చదివించుకోలేక కొంత ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం పెంచాలి, ప్రజలకు పంచాలి.. అదే తమ ఆలోచన అని బడ్జెట్ లో విద్యకు 9 శాతం ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. ఒక్కో విద్యార్థిపై రూ. లక్షా8 వేలు ఖర్చు చేస్తున్నామని, ఆస్తి ఉన్నా, చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్లు ఉన్నారని, యాదవ, కురుమ సోదరులకు ఆస్తి ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. మంచిగా పని చేసినందుకు తాను విద్యాశాఖ మంత్రిగా ర






తంజావూరు: తమిళనాడులోని తంజావూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఒక పూరింట్లో చెలరేగిన మంటలను స్థానికులు ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 ఏళ్ల బాలికతో సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరు తంజావూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటన లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రైతు మురుగయన్ నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో జరిగింది. తిరువోనం సమీపంలోని చిన్న అమ్మన్‌కుడి వద్ద ఉన్న పూరింట్లో అందరూ నిద్రిస్తుండగా మంటలు అంటుకున్నాయి. ఇంటిని మంటలు చుట్టుముట్టడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుటుంబాన్ని అప్రమత్తం చేసి, వారు సురక్షితంగా బయటపడేలా సహాయపడ్డారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వంటగదిలో ఉన్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.ఈ ఘటనలో మురుగయన్, అతని 15 ఏళ్ల కుమార్తె అభినయ తీవ్రంగా గాయపడ్డారు. మంటలను ఆర్పే ప్రయత్నించిన పలువురు స్థానికులు కూడా తీవ్ర


భారత చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డపై మాయాజాలం సృష్టిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపిస్తున్నడు. అక్కడ జరుగుతున్న వన్డే కప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన అతడు ఆరు వికెట్లు తీశాడు. టోర్నీలో తొలి మ్యాచ్‌లో గ్లామోర్గన్‌పై 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్‌లో సస్సెక్స్‌పై 6.5 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత వోర్సెస్టర్‌షైర్‌పై కేవలం 34 పరుగులు ఇచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. దీంతో కుల్దీప్ ప్రాతినిథ్యం వహిస్తున్న యార్క్‌షైర్ జట్టు విజయాలతో దూసుకుపోతుంది.


శ్రీరామ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 13714 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు 80.501 టీఎంసీల ఉండగా గురువారం మధ్యాహ్నం వరకు 1065.90 అడుగులు 17.243 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు ఏ.ఈ.ఈ రవి తెలిపారు. ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ కాకతీయ కాలువ కి 300 క్యూసెక్కులు, మంచి నీటి అవసరాలకు 231 క్యూసెక్కులు ,ఆవిరి రూపంలో 220 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. మొత్తo కలిపి 751 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి ఔట్ ఫ్లో ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1077.10 అడుగులు 37.632 టీఎంసీలుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టులోకి ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు 4.911 టీఎంసీల నీరు వచ్చి చేరిందని. ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు 4.287 టీఎంసీల నీరు విడుదల చేశామని అధికారులు అన్నారు.
