21613 వార్తలు

గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు అర్హత సాధించారు. నీరజ్ చోప్రా 79.61 మీటర్లు, రోహిత్ యాదవ్ 78.37 మీటర్లు, యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరారు. ఫైనల్ శుక్రవారం రాత్రి 10.15 గంటలకు ప్రారంభం అవుతుంది. డైరెక్ట్ క్వాలిఫికేషన్ మార్క్(84 మీటర్లు)ను ఎవరూ అందుకోలేకపోయారు. గ్లాస్గోలో బలమైన గాలులతో కూడిన వాతావరణం అథ్లెట్లకు ప్రతికూలంగా మారింది. అత్యుత్తమంగా శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగె 82.84 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచారు. అండర్సన్ పీటర్స్ (81.29 మీ, గ్రెనెడా), డౌ స్మిత్ (80.64 మీ, సౌతాఫ్రికా), బెన్ ఈస్ట్ (80.38 మీ, ఇంగ్లండ్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. నీరజ్ ఐదో స్థానంలో నిలవగా.. రోహిత్ యాదవ్ తొమ్మిది, యశ్ వీర్ సింగ్ పదోస్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ (78.63 మీ) ఏడో స్థానంలో నిలిచాడు.







న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసణ జరిగినప్పటి నుంచి ప్రధాని మోడీ పేరిట పలు నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఇప్పటికే కేంద్రం ఖండిస్తూ వస్తోంది. అయినప్పటికీ ఏదో ఒక రకంగా ఈ నకిలీ వార్తలు వస్తున్నాయి. తాజాగా మోడీ సంతకం చేసిన లేఖ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రధాని రాజీనామా చేశారంటూ పలువురు నెటిజన్లు దీనిని షేర్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఆధ్వర్యంలోని పిఐబి ఫ్యాక్ట్‌చెక్ స్పష్టత ఇచ్చింది. ‘‘ప్రధాని మోడీ సంతకం చేసినట్టుగా ఉన్న లేఖ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదొక నకిలీ లేఖ. ప్రధాని సంతకం చేసిన అలాంటి లెటర్ ఏదీ జారీ కాలేదు. ఏదైనా ప్రచారాన్ని నమ్మే ముందు.. అధికారికంగా ధృవీకరించుకోండి. ఏదైనా సమాచారం అనుమానస్పదంగా అనిపించినప్పుడు సమాచారం ఇవ్వండి’’ అని పిఐబి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారంపై సంప్రదించేందుకు (91 8799711259, factcheck@pib.gov.in) ఫోన్ నంబర్, మొయిల్ ఐడిని షేర్ చేసింది.सोशल मीडिया पर प्रधानमंत्री नरेंद्र मोदी के हस्ताक्षर वाला एक पत्र प्रसारित किया जा रहा है।#PIBFactCheck❌ यह पत्र #फर्जी है।✅ प्रधानमंत्री द्वारा ऐसा कोई पत्र न




అమరావతి: శ్రీకాకుళంలో మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శిస్తున్నారో, ఎవరిని కాపాడుతున్నారో అందరికీ తెలుసు అని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బంధువులను పరామర్శించాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తరోడ్డు జంక్షన్ కు జగన్ చేరుకున్నారు. కాన్వాయ్ కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర భారీ బందోబస్తు, అంపోలు జంక్షన్ వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశారని, జగన్ వెళ్లే దారిలోనే ప్రధాని మోడీ పర్యటన ఉందని తెలియజేశారు. ప్రధానికి భద్రత కల్పించే దారిలో ఆందోళనలు చేయకూడదని, జగన్ పర్యటనలో ధర్నాలు, ర్యాలీలు, సభకు అనుమతి లేదని పార్థసారధి సూచించారు. పోలీసులపై దాడి చేసే స్థాయికి వైసిపి నేతలు వెళ్లారని, వైసిపి వెంట వెళ్లే యువకుల తల్లిదండ్రులు భయపడుతున్నారని విమర్శించారు. కానిస్టేబుళ్లను దూరం జరిపి మరీ మహిళా ఎస్ఐపై దాడికి దిగారని, భయపెట్టి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని పార్థసారధి హెచ్చరించారు.

న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. వందేమాతర గేయాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971లో సవరణలు చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.





ఢిల్లీ: పేపర్ లీకేజీ వల్ల నష్టమేపోయేది విద్యార్థులు అని ఎఐసిసి మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. విద్యార్థుల ఆవేదనను అందరం అర్థం చేసుకోవాలని అన్నారు. రాజ్యసభలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాంటీ పేపర్ లీకేజీ విషయంపై ఖర్గే ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, పేపర్ లీక్ కాకుండా ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదని ఖర్గే విమర్శించారు. 2024 లోనే ఈ ప్రభుత్వం బిల్లు ఎందుకు తీసుకురాలేదని, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? అని పేపర్ లీక్ వల్ల విద్యార్థులు నష్టపోవాలా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ అనేది తలదించుకోవాల్సిన అంశం అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని నరేంద్ర మోడీ కుర్చీ కాపాడారని ఖర్గే మండిపడ్డారు. ఢిల్లీలో నిరసన చేసిన విద్యార్థులపై లాఠీఛార్జి చేశారని, విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించారని ఆవేదనవ్యక్తం చేశారు. పోలీసుల చర్యలపై ఇంతవరకు హోమంత్రి అమిత్ షా ఎలాంటి ప్రకటన లేదని, పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. ఇంతటి దారుణానికి కారణం ఎవరో తేలాల్సి ఉందని, ఈ దారుణమైన ఘటనకు అమ





న్యూఢిల్లీ: ప్రశ్న పత్రాల లీకేజీ నిరోధానకి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026’ రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఏడు గంటలపాటు చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జితేంద్ర సంగ్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఏ మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. పిల్లల భవిష్యతును ప్రమాదంలో పడేయడాన్ని అనుమతించబోమన్నారు. దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంతో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. ఈ బిల్లును తీసుకురావడానక ప్రధాని ఏ మాత్రం ఆలస్యం చేయలేదని వెల్లడించారు.