22060 వార్తలు



హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’ టైటిల్ సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ తీరం చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోందన్నారు. నిర్మాత ఉపేందర్ గంగావెల్లి మాట్లాడుతూ సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుందని, విడుదల తేదీతో పాటు ఇతర విశేషాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభు, హీరోయిన్ హరిప్రియా, రమణ, విజయ్ శెట్టి పాల్గొన్నారు.





హైదరాబాద్: తప్పుడు కేసులపై న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారమని, ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరని అన్నారు. హైడ్రా కమిషనర్ అంశంలో హైకోర్టు తీర్పుపై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని విమర్శించారు. హైడ్రా..ప్రభుత్వం తీసుకువచ్చిన అతిపెద్ద సంస్కరణ అని హైడ్రా బాగుందంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని, హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని రేవంత్ తెలియజేశారు. పార్కులు, చెరువుల్లో కబ్జాలు పెడితే కూలగొడతారని, చెరువులు, కుంటలు నాలాలనే కాపాడడమే హైడ్రా విధి అని సూచించారు. కబ్జాకోరులు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని, బతుకమ్మ కుంటను కబ్జా పెడితే పునరుద్ధరించారని..దానిపై కోర్టుకు ఎక్కారని మండిపడ్డారు. బతుకమ్మకుంటలో బిఆర్ఎస్ నేత 10 ఎకరాలు కబ్జా పెట్టారని, మాజీ సిఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా ఆ నేత పూలవర్షం కురిపించాడని, పదెకరాలు కబ్జా పెడితే కనకవర్షం కూడా కురిపించవచ్చునని రేవంత్ ఎద్దే

ఢిల్లీ: అనేక లీకేజీ కేసుల్లో నిందితులను ఈ ప్రభుత్వం బెయిలిచ్చిందని పార్లమెంట్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. లీకేజీ కేసుల విచారణలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగాయి. నీట్ పేపర్ లీకేజీ విషయంపై లోక్ సభలో ఆయన మాట్లాడారు. 2024 నీట్ లీకేజీ నిందితుల్లో 44 మందికి బెయిల్ ఇచ్చారని, నీట్ లీకేజీతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రధాని నరేంద్ర మోడీ కనీసం స్పందించలేదని, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వేశామని ప్రధాని ఇన్ స్టా రీల్ ద్వారా చెప్పారని విమర్శించారు. రెండేళ్ల క్రితం కూడా నిపుణుల కమిటీ వేశారు కదా! దానిపై ఏం చేశారు? అని గౌరవ్ గంగోయ్ ప్రశ్నించారు. పదేపదే లీకేజీలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోయిందని, పదే పదే లీకేజీలు జరుగుతున్నా ఎన్డిఎ ఛైర్మన్ ను ఎందుకు తొలగించలేదు? అని ప్రశ్నించారు. ఎన్డిఎ ఛైర్మన్ గతంలో మధ్యప్రదేశ్ పిఎస్సి ఛైర్మన్ గా కూడా ఉన్నారని, ఎన్డిఎ ఛైర్మన్ గా ఉన్నప్పుడూ ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారినే ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో నియమిస్తున్నారని, లీకేజీలకు బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ ను లోక్ స











హైదరాబాద్: హైడ్రా పేద ప్రజలతో ఆటలాడుకుందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న బుల్డోజర్ పాలనపై హైకోర్టు చేసిన స్ట్రైక్ ఇది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అతితక్కువ సార్లు ఇలాంటి తీర్పులు వచ్చాయని, హైకోర్టు తీర్పు చెంప చెల్లమనేలా ఉందని చురకలంటించారు. మూడున్నర లక్షల నిరుపేద కుటుంబాలకు మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అధికారంలోకి వచ్చాక బంగాళాఖాతంలో పడేస్తామని కెసిఆర్ చెప్పారని అన్నారు. హైకోర్టు కూడా హైడ్రాను బంగాళాఖాతంలో వేసినట్లు తీర్పు ఇచ్చిందని, జగిత్యాలలో కెసిఆర్ చెప్పిందే నిజమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి ఇల్లు, సోదరుల ఇండ్లు హైడ్రాకు కనబడడం లేదా? అని కెటిఆర్ ప్రశ్నించారని దాసోజ్ అన్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా రంగనాథ్ కు బుద్ధి రావడం లేదని, రంగనాథ్ మళ్లీ కోర్టుధిక్కరణకు పాల్పడుతున్నారని విమర్శించారు. రంగనాథ్ ను పలికిస్తున్నది రేవంత్ రెడ్డేనని భావిస్తున్నామని, రంగనాథ్ తోలు బొమ్మ అని ఎద్దేవా చేశారు. రంగనాథ్ ను ఆడిస్తున్నది అసలు నిందితుడు రేవంత్ రెడ్డ

న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి దుర్మరణం చెందారు. న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద కారును మరో కారు ఢీకొట్టడంతో ఓ మహిళా చనిపోయింది. మృతురాలు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపలోలి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డిగా గుర్తించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.... మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతులకు దీపారెడ్డి కూతురు. 20 సంవత్సరాల క్రితం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డితో దాపారెడ్డి పెళ్లి జరిగింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావడంతో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యూజెర్సీలో దీపారెడ్డి కారులో ప్రయాణిస్తుండగా ఆమె కారును మరో కారు ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది.

