22604 వార్తలు



ప్రముఖ నటుడు సుమంత్ నటించిన చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కార్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కె.హరీశ్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ హీరో అడవి శేష్ విడుద చేశారు. ఓ విభిన్నమైన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ చూపించిన కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. Good luck to you and the team on this one brother @iSumanth #Newtons3rdLaw releases on July 31st ❤️💥Check out the trailer 👇🏼https://t.co/lOSVp06B0u pic.twitter.com/qNNwoUjEhR— Adivi Sesh (@AdiviSesh) July 26, 2026

మెదక్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం తొనిగండ్ల గ్రామ శివారులో జరిగింది. రోడ్డు దాటుతుండగా చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వాహనదారుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను రామాంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటర్నరీ వైద్యుడు పోస్టుమార్టం చేసిన అనంతరం చిరుత కళేబరానికి దహన సంస్కారాలు నిర్వహిస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ: జీవితంలో కొన్ని తేదీలను గుర్తించుకోవడానికి క్యాలెండర్ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్..ఈ రోజు మనల్ని గర్వంతో నింపుతుందని అన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. మోడీ 136వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. వీర సైనికుల అసాధారణ ధైర్యాన్ని మనకు గుర్తు చేస్తోందని, మాతృభూమిని రక్షించడానికి సైనికులు సర్వస్వం త్యాగం చేశారని కొనియాడారు. ఈ ఏడాది ఒక ప్రత్యేక ‘శౌర్య విజయ్ యాత్ర’ ను, ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి బైక్ యాత్ర నిర్వహించారని అన్నారు. బైక్ యాత్ర కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నానికి చేరుకుంటుందని, బైకు యాత్ర సందేశం ‘ఒక ప్రమాణం, ఒక దేశం, ఒక సెట్యూట్ చేశారు. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని యాత్ర గుర్తుచేస్తుందని మోడీ పేర్కొన్నారు.కొద్ది రోజుల క్రితం ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ నావికాదళంలో చేరిందని, ఆధునిక యుద్ధ నౌకను దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారని మోడీ ప్రశంసించారు. యుద్ధ నౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారని, ‘ఆత్మ నిర్భర్ భారత్’ శక్తికి ప్రతీక అని డిఆర్ వో ‘పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్’ ను










హైదరాబాద్: విద్యా వ్యవస్థలో పారదర్శకత వచ్చేవరకు తాము పోరాటం చేస్తామని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇది ముగింపు కాదు అని కేవలం ప్రారంభమేనని, ఇంకా చాలా పెద్ద ప్రయాణం ఉందని ప్రభుత్వాలకు హెచ్చరకలు పంపారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో 37 రోజుల నుంచి జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, మేధావులు, సిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో నిరసన విరమించారు. ఈ సందర్భంగా తన ఎక్స్‌లో అభిజీత్ దీప్కే వీడియోను విడుదల చేశారు. దేశం కోసం మీరు చేసి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనని స్పష్టం చేశారు. మీ అందరి మద్దతుతోనే ఈ ఉద్యమం సక్సెస్ అయ్యిందని ప్రశంసించారు. తమను విమర్శించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని, విమర్శకుల వల్లే తాము ఇంకా మెరుగ్గా పని చేశామని పేర్కొన్నారు. గత 37 రోజుల నుంచి కంటి మీద నిద్ర లేకుండా ధర్నాలు చేస్తున్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉండేదని, గత రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృద

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి బస్సును ఓవర్ టేక్ చేయడంతో బస్సు టైర్ వెనుక కూర్చున్న యువతి కిందపడి మృతి చెందింది. హైదరాబాద్ నుంచి జెపి దర్గాకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్: నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారని రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డా సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ మీడియాతో మాట్లడారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఇంట్లో గుండెపోటుతో కిందపడిపోయారని, వెంటనే అతడిని రోహిణి ఆస్పత్రి తీసుకొచ్చారని పేర్కొన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి తరలిస్తామని వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని కోరారు.



జింబాబ్వేతో జరిగిన రెండో టి-20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే యువ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మైదానం బయట విమర్శల నుంచి వైభవ్‌ను ఎలా కాపాడుకోవాలో టీం ఇండియా వద్ద స్పష్టమైన ప్లాన్ ఉందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. నిన్నటి మ్యాచ్ అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ చాలా స్మార్ట్. ఏం చేస్తున్నాడు, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ఉండాలి అన్న విషయం అతడికి స్పష్టంగా తెలుసు. అతడికి బయట మిత్ర బృందంలో ఆట మీది నుంచి దృష్టి మళ్లించే చాలా అంశాలు ఉండొచ్చు. నేను అటువంటి నేపథ్యం నుంచే వచ్చాను. క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఏ సమయంలో వేటిపై దృష్టి ఉంచాలో తెలియాలి. ఈ విషయంలో నేను వైభవ్‌కు సాయపడతాను. అంతేకాదు.. జట్టులో అభిషేక్, అక్షర్, చాలా మంది ఇతర ఆటగాళ్లు కూడా అతడికి అండగా ఉంటారు. అతడు వీలైనంత క్రికెట్ గురించే ఆలోచించేలా చేస్తాం. సోషల్‌మీడియా, బయట నుంచి వచ్చే విమర్శలు వంటి వాటి ప్రభావానికి లోను కాకుండా తక్కువ స్కోర్ చేసినప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ మారకుండా చూసుకొంటాము. అతడిలాంటి బ్యాటర్ పవర్ ప్లేలోని తొలి ఆర



లద్దాఖ్: భారత్ యుద్ధనౌకలను రూపకల్పన చేస్తోంది: రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ మాత్రం చొరబాటుకు కొత్త మార్గాలను వెతుకుతోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తోందని అన్నారు. కార్గిల్ అమరవీరులకు సైన్యం ఘననివాళి అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా ద్రాస్ సెక్టార్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ యుద్ధనౌకలను రూపకల్పన చేస్తోందని, పాకిస్థాన్ ఉగ్రవాదానికి రూపకల్పన చేయడంలో నిమగ్నమై ఉందని తెలియజేశారు. భారత్ స్టార్టప్ వ్యవస్థను సృష్టిస్తుంటే, పాకిస్థాన్ ఉగ్రవాద వ్యవస్థను సృష్టిస్తోందని, భారత్ సెమీకండక్టర్లను తయారు చేస్తోందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆత్మాహుతి దళాలను ఉత్పత్తి చేస్తోందని, భారత్ అంతరిక్ష యాత్రలకు ప్రసిద్ధి చెందితే.. పాకిస్థాన్ ప్రాక్సీ మిషన్లను నిర్వహిస్తోందని అన్నారు. భారత్ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తోందని, పాకిస్థాన్ సరిహద్దు అవతలకు ఉగ్రవాదులను పంపడంలోనే నిమగ్నమైందని చెప్పారు. భారత్ డేటా సెంటర్ లను నిర్మిస్తుంటే..పాకిస్థాన్ రాడికలైజేషన్ కేంద్రాలు నిర్మిస్తోందని, భారత్ యూపిఐ ద్వారా ప్రపంచాన్ని అనుసంధానిస్తోందన