23923 వార్తలు

నవతెలంగాణ-హైదరాబాద్: షిండే వర్గంలో ఆరుగురు లోక్‌సభ ఎంపీల విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టును ఉద్ధవ్ వర్గం ఆశ్రయించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ను ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసింది. ఉద్ధవ్ వర్గం పిటిషన్‌ను విచారించేందుకు సమ్మతిని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది.ఈ విలీనాన్ని ఆమోదిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉద్ధవ్ వర్గం విజ్ఞప్తి చేసింది. లోక్‌సభ వర్షాకాల […] The post ఆరుగురు ఎంపీల విలీనం..’సుప్రీం’ను ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే appeared first on Navatelangana.

హైదరాబాద్: దేవాదులకు వెళ్లి కాంగ్రెస్ మంత్రులు తాము కట్టిన ప్రాజెక్టు అని చెప్పుకుంటున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేవాదులలో మోటార్లు నడపకుండా నీళ్లెలా ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువని, ఆయకట్టుకు సరిపడా నీళ్లున్నా ఇవ్వడం లేదని విమర్శించారు. 10 పంపులు నడుపుతున్నామన్నారని, నిన్న కూడా 5 పంపులే నడుస్తున్నాయని మండిపడ్డారు. బోర్లు ఎండిపోతే పంటలు కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడతారని, మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతుల పరిస్థితి ఏంటి? అని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రుల మాట, వరంగల్ కలెక్టర్ ది మరో మాట ఉంటుందా? అని ప్రశ్నించారు. రామప్ప కింద తూములు మూసివేశారని, నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏంటి? అని గోదావరిలో నీళ్లు ఉండగా తూములు ఎందుకు మూసివేశారు? అని నిలదీశారు. సకాలంలో మోటార్లు మరమ్మత్తు చేయకపోవడం, ట్యాంకర్లు, బిందెలు, సీసాలతో పంటలకు చుక్క చుక్క నీళ్లు వేసే ఈ పరిస్థితి ఏర్పడిందని, ధ్వజమెత్తారు. 10 మోటార్లు నడపలేకపోతున్నామని రైతులకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

బెంగళూరు: ఓ యువతిని కారులో తీసుకెళ్లి అనంతరం హోటల్ రూమ్‌లో ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం చామ్ రాజ్‌నగర్ జిల్లాలోని టి నర్సిపూర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఓ యువతిని కారులో రిహాన్, కిరణ్, కిషోర్ అనే వ్యక్తులు హోటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం సదరు యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన అనంతరం డబ్బులు ఇవ్వాలని యువతిని బెదిరించారు. ముగ్గురు బెదిరింపులకు భయపడిన యువతి డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటికి వచ్చిన తరువాత స్థానికులకు జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వివరించారు. యువతి ఫోన్‌లో తమతో ఉన్నప్పుడు అశ్లీల ఫోటోలు ఉండడంతో వాటిని తొలగించామని నిందితులు ఆరోపణలు చేశారు. అనంతరం ఆమె నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం.

నవతెలంగాణ-హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పలువురు ఎంపీలతో కలిసి మంగళవారం స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన ప్రశ్నలు లెవనెత్తారని, అందుకు విద్యార్థులపై అన్యాయంగా లాఠీచార్జీ చేశారని తెలియజేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చ పెట్టాలని కోరారు. విద్యార్థుల డిమాండ్ లపై ఉభయ సభల్లో సమగ్ర చర్చ కొనసాగించాలని స్పీకర్ […] The post స్పీకర్ ఓం బిర్లాను కలిసిన రాహుల్ గాంధీ appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ర్యాలీ చేపట్టేందుకు వెళుతున్న రైతులను పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. దేశ్ బచావో మోర్చా (డిబిఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులను హర్యానా -పంజాబ్ సరిహద్దులైన శంభు-అంబాలా, ఖనౌరి-జింద్ వద్ద పోలీసులు మంగళవారం నిలిపివేశారు. శంభు-అంబాలా రహదారిపై హర్యానా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రం భారీగా భద్రతా దళాలను మోహరించింది. రైతులు శాంతియుతంగా ఢిల్లీ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతున్నారని, బిజెపి నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం బారికేడ్లతో […] The post ఢిల్లీకి రాకుండా రైతులను అడ్డుకున్న పోలీసులు appeared first on Navatelangana.



హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా భవానీనగర్ లో దారుణం జరిగింది. భర్తను భార్య, కుమారుడు కర్రతో కొట్టి చంపారు. భర్త చంద్రయ్య (50), భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారి, కుమార్తె కలిసి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా చంద్రయ్య మద్యానికి బానిసయ్యాడు. ఒక రోజు అర్థరాత్రి మద్యం మత్తులో తల్లిని కొడుతుండగా కుమారుడు అడ్డుకున్నాడు. భార్య, కుమారుడు తిరిగి కర్రతో కొట్టడంతో చంద్రయ్య మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ చేయడం మనేది ఘోరమైన పాపమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తొలి సారి నీట్ పేపర్ లీకేజీపై మోడీ ప్రసంగించారు. ఇలాంటి లీక్‌లు నివారించడం అనేది జాతీయ బాధ్యత అని తెలియజేశారు. మంగళ్ మిలన్ పేరిట మంగళవారం ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పిఎం మోడీ మాట్లాడారు. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చని, దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా అందరూ సహకరించాలని నరేంద్ర మోడీ కోరారు. పిల్లలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తప్పుడు మార్గంలోకి వెళ్లడం చాలా సులభం అని పేర్కొన్నారు. తిరిగి సరైన మార్గంలో రావడంతో చాలా కష్టంగా ఉంటుందని మోడీ వివరించారు .








‘ఏక్ దిన్’ (తెలుగు డబ్ పేరు: ‘ఒక్క రోజు’) సాయి పల్లవి, జునైద్ ఖాన్ (అమీర్ ఖాన్ కుమారుడు) ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది థాయ్ చిత్రం వన్ డేకి రీమేక్.కథ : దినేష్ (జునైద్ ఖాన్) ఒక సిగ్గరి యువకుడు. తనతో పనిచేసే మీరా (సాయి పల్లవి)ను మౌనంగా ప్రేమిస్తుంటాడు. వీరిద్దరూ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. మీరా ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ నకుల్ ను ప్రేమిస్తూ ఉంటుంది. నకుల్ కు ఆల్రెడీ పెళ్లయింది కానీ ఆమెకు అబద్ధం చెబుతూ ఉంటాడు పెళ్ళానికి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెబుతూ ఉంటాడు.కంపెనీ ఎంప్లాయిస్ అంతా జపాన్ ట్రిప్ కి వెళ్తారు.. అక్కడ ఓ ప్రమాదంలో మీరా గతం మరిచిపోతుంది ఒక్కరోజు మాత్రమే ఆమ్నిషియా ఉంటుంది. ఈ ప్రమాదం తర్వాత మీరాకు టాన్సిట్ గ్లోబల్ అమ్నేషియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆమెకు ఒక రోజు జరిగిన విషయాలు గుర్తుండవు. ఆ ఒక్క రోజులో వారిద్దరి జీవితాల్లో జరిగే సంఘటనలే సినిమా ప్రధాన కథ. ప్రేమ, జ్ఞాపకాలు, భావోద్వేగాలకు ఈ చిత్రం ప్రాధాన్యం ఇస్తుంది. ఆమెకు ఆ ఒక్కరోజు తర్వాత గత




