24157 వార్తలు







ప్రతి ఆర్‌సిఒ వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలివిద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, కళల్లోనూ ప్రతిభను పెంపొందించాలి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో దిశా నిర్దేశం! హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని గురుకుల విద్యాసంస్థలను ఈ ఏడాది ఆగస్టు 30లోగా పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బిసి గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహిండం జరిగిందన్నారు. గురుకుల విద్యాసంస్థల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా అధికారులు పనిచేయాలని, ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం ఆరు గురుకుల విద్యాసంస్థలను సందర్శించాలని ఆదేశించ

నవతెలంగాణ – హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.700 పెరిగి రూ.1,32,200కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.760 పెరిగి రూ.1,44,220 పలుకుతోంది. వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 పెరగడంతో రూ.2,40,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి. The post పెరిగిన బంగారం, వెండి ధరలు appeared first on Navatelangana.

హైదరాబాద్: రౌడీ షీటర్ దారుణహత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సూరి అనే రౌడీషీటర్ గతంలో తన భార్య, బావమరిది సల్మాన్ ను హత్య చేశాడు. ఈ కేసులతో వరంగల్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్‌ల పరధిలో సూరిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడిపై నగర బహిష్కరణ కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. తన రెండో భార్య తమ్ముడు పుట్టిన రోజు సందర్భంగా సూరి నందనవనం వచ్చాడు. ఆ విషయం సల్మాన్ సోదరుడు అఫ్రోజ్‌కు తెలియడంతో అక్కడి చేరుకొని సూరి కళ్లలో కారం చల్లి పలుమార్లు కడుపులో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రౌడీషీటర్ మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మహాత్మా గాంధీ వేషధారణలో పాల్గొన్న ఓ వృద్ధుడు అందరి దృష్టిని ఆకర్షించారు. పోలీసుల లాఠీచార్జ్, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన అక్కడ కనిపించడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉద్యమాన్ని అహింసా మార్గంలో, శాంతియుతంగా కొనసాగించాలనే సందేశంతో ఆయన నిరసనలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆయన గుర్తింపు, నిరసనలో పాల్గొన్న ఉద్దేశంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. The post జంతర్ మంతర్ వద్ద నిరసన.. గాంధీజీ వేషధారణలో వృద్ధుడు appeared first on Navatelangana.




అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ’లెనిన్’. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లందరితో కలిసి సోమవారం నాడు బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌ను జరుపుకున్నారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా టీంకి షీలడ్స్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో.. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ‘ఈ సినిమా లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అందరూ ప్రేమించి ఈ మూవీని చేశారు. ఆ ప్రేమను ఆడియెన్స్, అభిమానులంతా తిరిగి చూపించారు.నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. ‘లెనిన్’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్” అని అన్నారు. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. “మా ‘లెనిన్’న




పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. “కమిటీ కుర్రోళ్లు చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది.‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది. యదు వంశీ ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది”అని అన్నారు. దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ .. “కమిటీ కుర్రోళ్లు’ నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెబుతూనే వచ్చాను. ఎవరెన్ని చెప్పినా కూడా నిహారిక సినిమాలో ఒక్





అమరావతి: ఎపికి చెందిన యువకుడు అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల మండల దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ(34) అనే యువకుడు 2019లో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లారు. చదువు పూర్తి చేసిన అనంతరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటున్నాడు. కీవ్‌లాండ్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసి అనంతరం తల్లిదండ్రులు అమెరికాకు తీసుకెళ్లి గృహ ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసిన అనంతరం రవితేజ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గృహ ప్రవేశం జరగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దైదగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కళ్ల ముందు కన్న కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీంటి పర్యంతమయ్యారు.