24437 వార్తలు



రూ.15 లక్షల బడ్జెట్‌లో కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే వారికి నిస్సాన్ టెక్టన్, హ్యుందాయ్ క్రెటా రెండు బలమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన నిస్సాన్ టెక్టన్ ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతతో దృష్టిని ఆకర్షిస్తుండగా..హ్యుందాయ్ క్రెటా మాత్రం ఎన్నో ఏళ్లుగా విశ్వసనీయ పనితీరు, బలమైన సర్వీస్ నెట్‌వర్క్‌తో వినియోగదారుల ఆదరణ పొందుతోంది. మరి ఈ రెండింటిలో ఏ ఎస్‌యూవీ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుందో చూద్దాం. ధర, డిజైన్ నిస్సాన్ టెక్టన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.18.59 లక్షల వరకు ఉంది. హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ.10.91 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.20.11 లక్షల వరకు అందుబాటులో ఉంది. డిజైన్ పరంగా టెక్టన్ బోల్డ్, మస్క్యులర్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో పెద్ద ఫ్రంట్ గ్రిల్, LED DRLs, కనెక్టెడ్ టెయిల్‌లైట్స్, 18 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా మాత్రం ప్రీమియం, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ డిజైన్‌తో కనిపిస్తుంది. క్యాబిన్, ఫీచర్లు నిస్సాన్ టెక్టన్ ఇంటీరియర్ ట్రై-టోన్ థీమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, 48 కలర

లండన్: లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. టీం ఇండియా మ్యాచ్ ఓడినప్పటికీ.. రోహిత్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. అయితే రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై వస్తున్న వార్తలపై కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ స్పష్టత ఇచ్చాడు. ఇప్పటివరకు జట్టులో అలాంటి చర్చే జరగలేదని గిల్ అన్నాడు. ‘‘ఇదే తన చివరి మ్యాచ్ అని రోహిత్ మాతో అనలేదు. ఇదంతా సోషల్‌మీడియాలో మొదలైన చర్చే. గత కొన్నేళ్లుగా రోహిత్ - విరాట్ అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు సేవలు అందించారు. ఈ మ్యాచ్‌లోనూ చక్కని భాగస్వామ్యం నిర్మించారు. ఇక రోహిత్ భాయ్ బ్యాటింగ్ అదిరిపోయింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ మందకొడిగా మారింది. ఇక్కడ పరుగులు చేయడం చాలా కష్టం. కానీ, అతడి ఆట మాత్రం అద్భుతంగా ఉంది’’ అని గిల్ వివరించాడు.


హైదరాబాద్: ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం మోతీ నగర్ లోని బంధువు ఇంట్లో శానిటైజర్ లో విషం కలుపుకొని ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్నాయత్నం చేసుకున్నాడు. బంధువులు గమనించి ఉదయ్ ను ఆసుపత్రికి తరలించారు. ఎస్ ఆర్ నగర్ లోని ఆస్పత్రి ఐసియూలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళ ఐపిఎస్ ను ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో అతడిపై కేసు నమోదైంది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తవమని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని తెలిపారు.




తక్కువ ధరలో ఒక ప్రీమియం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్! ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ S25 FE పై ఏకంగా రూ.14,000 పైగా డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదనంగా, వినియోగదారులు ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌లో గెలాక్సీ AI, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ అమెజాన్‌లో ఎంత ధరకు లభిస్తుందో, ఆఫర్లు ఏమిటో, దాని ఫీచర్లు ఎంత శక్తివంతమైనవో తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ S25 FE పై డిస్కౌంట్, ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ S25 FE భారతదేశంలో రూ.59,999 ప్రారంభ ధరతో విడుదల అయింది. అయితే, ప్రస్తుతం దీనిని అమెజాన్‌లో రూ.45,499 కే కొనుగోలు చేయవచ్చు. అంటే ప్రారంభ ధరతో పోలిస్తే వినియోగదారులు రూ.14,500 ప్రత్యక్ష తగ్గింపును పొందవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ S25 FE పై అమెజాన్ అనేక అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. వినియోగదారులు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే రూ.1,364 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ కార్డ్‌పై నో-కాస్ట్ EMI కూడా అందుబా



మన భారతీయ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక పోషకాలు, ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రతిరోజూ పరిమిత మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఎముకలు, గుండె, చర్మం ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి రోజు పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పెరుగులోని మంచి బ్యాక్టీరియా శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి: కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండే పెరుగు ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలు, వృద్ధులు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. బరువు నియంత్రణకు సహకారం: ప్రోటీన్ అధికంగా ఉండే పెరుగు ఎక్క

ఢిల్లీ: నెల రోజులుగా భారత్ అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రాష్ట్రీయ, జాతీయ, అంతరిక్ష రంగాల్లో భారత్ గర్వించదగిన క్షణాలు అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడుతూ.. కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, నెల రోజులుగా అనేక పరిణామాలు జరిగాయని తెలియజేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని, రెండ్రోజుల క్రితం ప్రయోగం ద్వారా ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన నిలిచామని అన్నారు. భారత యువత అంతరిక్షంలో తమదైన ముద్ర వేశారని మోడీ కొనియాడారు. ఈ వర్షాకాల సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాలని అందరం ప్రార్థిద్దామని, గతేడాది ఇదే సమాయానికి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నామని, ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ ను రోదసీలో విజయవంతంగా ప్రవేశపెట్టారని మోడీ పేర్కొన్నారు.



హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో కిలో బంగారం మాయమైంది. 1028.59 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 7 నెక్లెస్లు, 7 జతల చెవిపోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్‌లో భద్రపరిచిన ఆభరణాలు మాయమయ్యాయి. వాష్‌రూమ్ కిటికీ ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన వ్యాపారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట ‘ఇంత ఇష్టమా’ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ లవ్ మెలోడీ హీరో చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతకు హీరోయిన్ మైమరచిపోయి అతనిపై ప్రేమను పెంచుకునే భావోద్వేగాలను అందంగా చూపించారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ఈ లవ్ సాంగ్ మరింత అందాన్ని తీసుకురాగా, రామ్ మిర్యాల, లిప్సిక గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ల మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే విజువల్స్ ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తు తం ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ వచ్చేసింది. ఈ పాట ను ఆదివారం నాడు అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్ అదిరిపోయింది.ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపూర్‌లోనే జరిగింది. అందుకే ఈ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలని అనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నా రు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’లో మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అనంతపూర్ బ్యాక్ గ్రౌండ్‌లోనే సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.


