19545 వార్తలు


హైదరాబాద్: మోహన్‌లాల్ కూతురు విస్మయ మోహన్ లాల్ నటించి సినిమా తుడక్కం. ఈ సినిమాలో విస్మయకు తోడుగా ఆశిష్ జో ఆంటోనీ నటించారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న భావోద్వేగ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా ఆగస్టు 7న థీయేటర్లలో విడుదల కానుంది. మంచిగా చదువుకోమ్మని కూతురుకు తండ్రి చెబుతాడు. తుడక్కం సినిమా సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రియ రాసిని ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధిస్తుందని తండ్రీకూతుళ్ల సంభాషణ సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. జరిగిన విషయాలు మరిచిపోవాలని, మళ్లీ పొరపాటు రాకుండా చూస్తానని, నోరు అదుపులో పెట్టుకోకపోతే కష్టాలు తప్పవని హెచ్చరించాడు. ఈ సినిమాలో మనోజ్, అశ్విన్, సాయి కుమార్, బాబీ కురియన్, కెబి గణేష్ తదితరలు నటించారు.







టాలీవుడ్‌లో ఆగస్టు నెలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ నెలలోనే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్‌బాబు బర్త్‌డేలు ఉంటాయి. ఈ నెల అభిమానులకు నిజంగా పండుగలా మారుతుంది. అయితే ఈ సారి టాలీవుడ్ అగ్ర హీరోల పుట్టినరోజులు రావడం మాత్రమే కాకుండా అదే సమయంలో వారి ప్రతిష్టాత్మక సినిమాల నుంచి వచ్చే క్రేజీ అప్డేట్స్ ఇండస్ట్రీలో సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ వంటి దిగ్గజ హీరోల బర్త్ డేలు ఆగస్టు మాసంలో తెలిసిందే. సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలతో సరిపెట్టకుండా మేకర్స్ సైతం ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని వారు నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్‌ల నుంచి అదిరిపోయే అప్‌డేట్స్‌ను ప్లాన్ చేశారు. విభిన్న కథాంశాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రాల నుంచి వచ్చే టీజర్లు, పోస్టర్లు, గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆరోజు విశ్వంభర సినిమాకు సంబంధించిన కొత్త అప్ డేట్ ఉంటుంది. అలాగే సెట్‌లో ఉన్న బాబీ సినిమా విషయాలను కూడా చిరంజీవి లీక్ చేసే అవకాశం ఉంటుంద

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడి బర్మా కాలనీలో ఒక ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి రూ.4,39,743 విద్యుత్ బిల్లు రావడంతో నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఈ బిల్లు చెల్లించాలంటూ సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో వారు విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అధికారులు పరిశీలించగా, అది సాఫ్ట్‌వేర్ లోపం వల్ల జరిగిందని తేలింది. అనంతరం సాంకేతిక సమస్యను సరిచేసి, అసలు బిల్లు రూ.15,205 అని తేల్చడంతో ఆశ్రమ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. The post వృద్ధాశ్రమానికి రూ.4.3 లక్షల విద్యుత్ బిల్లు appeared first on Navatelangana.

ముంబై: త్వరలో జరిగే శ్రీలంక టెస్టు సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోందని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టుకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. కొన్నేళ్లుగా వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్ ఈ సిరీస్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడడం ఖాయమన్నాడు. లంకతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా చాలా బలంగా ఉందన్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్‌లు మెరుగైన ప్రదర్శనతో జట్టుకు అండగా నిలువడం తథ్యమన్నాడు. బౌలింగ్‌లో కూడా జట్టు బాగానే ఉందన్నాడు. సిరాజ్, కుల్దీప్, జడేజాలతో బౌలింగ్ బలంగా కనిపిస్తుందన్నాడు. ఆకిబ్ నబి చేరికతో జట్టు బౌలింగ్ మరింత బలోపేతంగా తయారైందన్నాడు. సమష్టిగా రాణిస్తే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం టీమిండియాకు కష్టమేమీ కాదని జాఫర్ అభిప్రాయపడ్డాడు.




టీమిండియాకు తప్పని ఇబ్బందులు మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తరచు గాయాల బారిన పడుతున్నాడు. దీని ప్రభావం జట్టుపై బాగానే పడుతోంది. తాజాగా శ్రీలంక గడ్డపై జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. కొన్నేళ్లుగా బుమ్రా గాయాలతో సహవాసం చేస్తున్నాడు. అతన్ని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కీలకమైన సిరీస్‌లకు, టోర్నమెంట్‌లకు దూరంగా ఉండక తప్పడం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ నిలకడైన ప్రదర్శనతో టీమిండియాకు ప్రధాన అస్త్రంగా మారాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతని ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. పిచ్ ఏదైనా తన స్వింగ్‌తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం అతనికి పరిపాటిగా మారింది. చాలా రోజుల నుంచి భారత జట్టు బౌలింగ్ భారాన్ని బుమ్రానే మోస్తున్నాడు. సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో జరిగే సిరీస్‌లలో, టోర్నీలలో మెరుగైన ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కానీ గత నాలుగైదేళ్లుగా బుమ్రా తరచు గాయాల బారిన పడుతున్నాడు. వరుస గాయాలతో జట్టుకు అందుబాటులో లేకుండా పోతున్నాడు. దీని ప్రభ

నవతెలంగాణ – హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు లీగల్ నోటీసులు పంపారు. హరీశ్‌రావు క్షుద్ర పూజలు నిర్వహించారని మహేశ్ చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేరొంటూ తన న్యాయవాది ద్వారా నోటీసులిచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠకు నష్టం కలిగించే ఉద్దేశంతో చేసినవేనని పేరొన్నారు. ఆధారాల్లేని ఆరోపణలు కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమని హరీశ్ […] The post టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు హరీష్‌రావు లీగల్ నోటీసులు appeared first on Navatelangana.






