21329 వార్తలు









నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశంలో ఎలాంటి తీవ్ర పరిణామాలను సృష్టించిందో తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ ఈ అక్రమాలపై సాగించిన ఉద్యమం కార్చిచ్చులా దేశం లోనే కాదు, విదేశాల్లో కూడా వ్యాపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి లోపాలను సరిదిద్దే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూకోర్టు కాంప్లెక్సులో పేపర్ లీకేజీ కేసులను ప్రత్యేకంగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఢిల్లీ హైకోర్టు ఆగమేఘాలపై ఏర్పాటు చేసింది. దీంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సామర్థంపై సమీక్ష తెరపైకి వచ్చింది. అయితే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారే కానీ కేసులకు తగినట్టు కొత్తగా న్యాయమూర్తులను నియమించడం కానీ, న్యాయవ్యవస్థలో అదనపు సామర్థాన్ని సమకూర్చక పోవడంతో ఒకవంక న్యాయవాదులు, సిబ్బంది, వనరుల కొరత, మరోవంక పెండింగ్ కేసుల భారంతో అవి సతమతమవుతున్నాయి. ఈ కోర్టులు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన సంస్కరణలు అమలులో ఉన్నాయా లేదా ఆలోచించాల్సిందే. సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసే ప్రక్రియ నిర

నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం ఎంతో మంది విద్యార్థులను బాధించింది. అయితే నీట్ పరీక్ష పేపర్ లీక్‌కి తాను బాధితురాలినే అని ప్రముఖ బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ పేర్కొన్నారు. 2015లో నీట్ పేపర్ లీక్ కావడం వల్ల తాను మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చిందని తెలిపారు. తనకు కూచిపూడి, పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె.. వాటిని ఏడది పాటు పక్కన పెట్టి పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యానని అన్నారు. డాక్టర్ కావాలని తాను ఎన్నో కలలు కన్నానని.. కష్టపడి చదివి, పరీక్ష రాసినప్పటికీ.. పేపర్ లీక్ కావడంతో అప్పట్లో చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ విద్యార్థులు అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం బాధాకరమని మానుషి అన్నారు. పరీక్ష కోసం మళ్లీ మళ్లీ చదవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.




పద్దెనిమిదవ శతాబ్దంలో సైన్స్ పాఠాలు చెప్పిన జంతర్ మంతర్ ఇపుడు సామాజిక పాఠాలు చెప్తున్నది. అధికారపక్షానికి, ప్రతిపక్షాలకు రాజకీయ పాఠాలు కూడా. జంతర్ మంతర్ ఆందోళన ప్రస్తుత దశ ముగియవచ్చు. అయినా పాఠాలు కొనసాగుతున్నాయి. ఇది పరిశీలకులకు తోస్తున్న మాట మాత్రమే కాదు. కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సరికొత్త చైతన్యాలు చూపిన యువతరం, తమ ఉద్యమం ఇంతటితో ముగియలేదని, భవిష్యత్తులోకి చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నదని, ప్రయాణించగలమని, ప్రస్తుతానికి ఇది ఒక మజిలీ మాత్రమేనని స్వయంగా పదే పదే ప్రకటిస్తున్నారు. ప్రధానంగా విద్యారంగ సమస్యలతో ఆరంభించిన కాక్రోచ్ యువతరం, అందుకు మాత్రమే పరిమితం కాకుండా అనేక ఇతర సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తుండటం గమనార్హమైన విషయం. ఇటువంటి ధోరణి కొంతవరకు వామపక్ష విద్యార్థి సంఘాలలో ఉండటం తెలిసిందే కాగా, అటువంటి మొగ్గు ఏమీ ప్రకటిత రూపంలో లేని ఒక సరికొత్త వేదిక నాయకత్వాన కనిపించటం ఒకటైతే, అసలు మొత్తం విద్వార్థి లోకానికి, యువజన లోకానికి వ్యాపించి కనిపించటం గమనించదగ విశేషం. వారు ఒకవైపు విద్యా వ్యవస్థను, మరొక వైపు రాజకీయ వ్యవస్థను కూడా ప్రశ్నించటం గమనించదగ్గది. కాక్రోచ్ తక్షణ ఆందోళనకు ప్రే



స్నేహితునికి సహాయం చేసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు రహదారిలో ముష్టికుంట సమీపంలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఆంద్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కొలికపోగు లక్ష్మణ్ (28) బైక్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు చేకూరి తిరుపతి రావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ లోని పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు. తిరుపతి రావు డ్యూటి అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు ఆటోలు, బస్సులు లేకపోవడంతో లక్ష్మణ్ కు ఫోన్ చేశాడు. దీంతో లక్ష్మణ్ తిరుపతి రావు ని తీసుకొని రావడానికి మరో స్నేహితుడు రాయల సైదులును ఎక్కించుకొని నాగులవంచకు వచ్చారు. ముగ్గురూ బైక్ పై వెళ్తుండగా ముష్టికుంట్ల బోనకల్లు మధ్య రోడ్డు మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి గాయపడ్డవారిని 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు లక్ష్మణ్ మృతిచెందినట్లు తెలిపారు. తిరుపతి రావు కోమాలో ఉండగా, సై




తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ మలివిడత ఉద్యమం కెసిఆర్ ఆధ్వర్యంలో ఆరంభమైన తరువాత ఓరుగల్లు తెలంగాణ భావజాల వ్యాప్తికి క్రియాశీలకంగా మారింది. ఓరుగల్లు ఉద్యమ పిడికిలి ఎత్తి గర్జిస్తే ఆనాటి తెలంగాణ పదిజిల్లాలో చైతన్యం నిండుకున్నది. తెలంగాణ మలివిడత ఉద్యమంలో కెసిఆర్‌తో నడిచిన ఉద్యమకారులలో ఓరుగల్లు స్థానం గొప్పది. అనేక ఉద్యమాలకు వరంగల్ వేదికగా నిలిచింది. అటువంటి వేదికలను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ మలివిడత ఉద్యమంలో వరంగల్‌లో గొప్ప గర్జనగా నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి నిలిచారు. కెసిఆర్ ప్రారంభించిన ఉద్యమంలో మడమ తిప్పకుండా విశేష కృషి చేశారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో వరంగల్ వేదిక అనేక సభలకు వేదిక అయింది. అటువంటి వేదికల గర్జన వెనుక పెద్ది సుదర్శన్‌రెడ్డి విశేష కృషి ఉంది. తెలంగాణ ప్రాంతం ఏర్పాటు ఆకాంక్షనే ధ్యేయంగా కృషి చేసిన నాయకుడు. ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నేడు తెలంగాణ అంతా తల్లడిల్లుతూ ఆయనపై అభిమానాన్ని చాటుకుంది. తెలంగాణ ఉద్యమంలో మడమతిప్పని నాయకుడు.. ఓ దశలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరే వరకూ వ్యక్తిగత జీవితానికి పెళ్లి చేసుకోకుండా నిబద

