21337 వార్తలు

స్నేహితునికి సహాయం చేసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు రహదారిలో ముష్టికుంట సమీపంలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఆంద్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కొలికపోగు లక్ష్మణ్ (28) బైక్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు చేకూరి తిరుపతి రావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ లోని పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు. తిరుపతి రావు డ్యూటి అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు ఆటోలు, బస్సులు లేకపోవడంతో లక్ష్మణ్ కు ఫోన్ చేశాడు. దీంతో లక్ష్మణ్ తిరుపతి రావు ని తీసుకొని రావడానికి మరో స్నేహితుడు రాయల సైదులును ఎక్కించుకొని నాగులవంచకు వచ్చారు. ముగ్గురూ బైక్ పై వెళ్తుండగా ముష్టికుంట్ల బోనకల్లు మధ్య రోడ్డు మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి గాయపడ్డవారిని 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు లక్ష్మణ్ మృతిచెందినట్లు తెలిపారు. తిరుపతి రావు కోమాలో ఉండగా, సై




తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ మలివిడత ఉద్యమం కెసిఆర్ ఆధ్వర్యంలో ఆరంభమైన తరువాత ఓరుగల్లు తెలంగాణ భావజాల వ్యాప్తికి క్రియాశీలకంగా మారింది. ఓరుగల్లు ఉద్యమ పిడికిలి ఎత్తి గర్జిస్తే ఆనాటి తెలంగాణ పదిజిల్లాలో చైతన్యం నిండుకున్నది. తెలంగాణ మలివిడత ఉద్యమంలో కెసిఆర్‌తో నడిచిన ఉద్యమకారులలో ఓరుగల్లు స్థానం గొప్పది. అనేక ఉద్యమాలకు వరంగల్ వేదికగా నిలిచింది. అటువంటి వేదికలను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ మలివిడత ఉద్యమంలో వరంగల్‌లో గొప్ప గర్జనగా నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి నిలిచారు. కెసిఆర్ ప్రారంభించిన ఉద్యమంలో మడమ తిప్పకుండా విశేష కృషి చేశారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో వరంగల్ వేదిక అనేక సభలకు వేదిక అయింది. అటువంటి వేదికల గర్జన వెనుక పెద్ది సుదర్శన్‌రెడ్డి విశేష కృషి ఉంది. తెలంగాణ ప్రాంతం ఏర్పాటు ఆకాంక్షనే ధ్యేయంగా కృషి చేసిన నాయకుడు. ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నేడు తెలంగాణ అంతా తల్లడిల్లుతూ ఆయనపై అభిమానాన్ని చాటుకుంది. తెలంగాణ ఉద్యమంలో మడమతిప్పని నాయకుడు.. ఓ దశలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరే వరకూ వ్యక్తిగత జీవితానికి పెళ్లి చేసుకోకుండా నిబద







హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిసిపి వి. అరవింద్ బాబును విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని నీట్ పేపర్ లీక్ ఆందోళన సందర్భంగా పిఎం మోడీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై మెటా ఇండియా అధిపతితో పాటు పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.





రిటైరయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయులకు త్వరితగతిన న్యాయం చేయాల్సిన కనీస ధర్మం, నైతిక బాధ్యత అధికారులపైనే ఉంది. పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో రిటైర్డ్ ఉద్యోగికి అందాలంటే పెన్షన్ మంజూరు అధికారులు నాన్చుడు ధోరణికి వెంటనే స్వస్తి పలకాలి. రిటైరయ్యే రోజే పెన్షన్ మంజూరు పత్రాలు ఉద్యోగి చేతికి అందాలని ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయాలి. ఉద్యోగి రిటైర్ అవడానికి ఆరు నెలల ముందే పెన్షన్ పేపర్లను ప్రిపేర్ చేసి ఎజి ఆఫీస్‌కు పంపించవల్సిన పూర్తి బాధ్యత మంజూరు అధికారులదే. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. దశాబ్దాలపాటు ప్రభుత్వ సేవలోనే గడిపి, విశ్రాంతి తీసుకునే వయసులో వచ్చే పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు వారాలు, నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత విచారకరం! ముప్పై నలభై ఏళ్లపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ భుజాలపై మోసి, వ్యవస్థల పురోగతికి రక్తాన్ని చెమటగా మార్చిన విశ్రాంత ఉద్యోగులకు.. గౌరవంగా, సకాలంలో దక్కాల్సిన పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి రావడం వ్యవస్థకే అవమానకరం! కలం చేత పట్టి వేలాది మంది

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో గిరిజన విద్యార్థినులు, మహిళలు చారిత్రాత్మక ఘనత సాధించారు. 13 వేల మంది గిరిజన బాలికలు, మహిళలు ఒకేసారి సాంప్రదాయ 'ధింసా' నృత్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శన విభాగంలో ఇది అధికారికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో ఈ అద్భుత ప్రదర్శన జరిగింది. పిఎం మోడీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న తరుణంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని తలపెట్టింది. గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థినులు, గిరిజన మహిళలు ఈ రికార్డులో భాగస్వాములయ్యారు.

గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. వెయిట్ లిఫ్టింగ్‌లో స్టార్ ఆటగాడు లవ్‌ప్రీత్ సింగ్ రజతం సొంతం చేసుకున్నాడు. మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్యం దక్కించుకుంది. మహిళల బాక్సింగ్‌లో జస్మయిన్ లంబోరియా, అరుంధతి చౌదరి ఫైనల్‌కు చేరి రజతాలు ఖాయం చేసుకున్నారు. పురుషుల 110 ప్లస్ కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత ఆటగాడు లవ్‌ప్రీత్ సింగ్ రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా 388 కిలోల బరువును ఎత్తిన లవ్‌ప్రీత్ తృటిలో స్వర్ణం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్ వెయిట్‌లిఫ్టర్ డేవిడ్ ఆండ్రూ 389 కిలోల బరువును ఎత్తి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. లవ్‌ప్రీత్ కేవలం ఒక కిలో బరువు తక్కువగా ఎత్తడంతో స్వర్ణం చేజారింది. 38 ఏళ్ల లవ్‌ప్రీత్ అసాధారణ ఆటతో అలరించాడు. స్నాచ్‌లో 176 కిలోల బరువును ఎత్తాడు. ఇక క్లీన్ అండ్ జర్క్‌లో 212 కేజీల బరువును మోసాడు. ఇంగ్లండ్ వెయిట్‌లిఫ్టర్ గ్రిఫిత్ కాంస్యం దక్కించుకున్నాడు.

విశ్రాంత ఐపిఎస్ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.వరుడు ఆస్ట్రేలియాలో ఎం ఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారంటూ నమ్మబలికి భారీగా కట్నం, బంగారం తీసుకున్నాడు.2024 అక్టోబర్ లో విశ్రాంత ఐపిఎస్ వివాహం జరిగింది.పెళ్లై రోజులు గడుస్తున్న వరుడు ఆస్ట్రేలియా కు వెళ్ళడం లేదు. ఈక్రమంలో ఎంఎస్ పూర్తి చేయలేదని తెలుసుకొని యువతి నిలదీసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా నిరమ్. ఈ చిత్రాన్ని కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్ పై కె. బిందుమాధవి నిర్మిస్తున్నారు. సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు బలరామ్ కృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం ‘నిరమ్’ సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ముగెన్ రావ్ మాట్లాడుతూ “ట్రైలర్ లాగే సినిమా కూడా అందరినీ అలరిస్తుంది. ఒక డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిరమ్ మూవీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది” అని తెలిపారు. హీరోయిన్ తాన్యా హోప్ మాట్లాడుతూ - ఒక సాధారణ యువతి తనకు తెలియకుండా ఒక పెద్ద సమస్యలో చిక్కుకుపోతే ఎలా ఇబ్బంది పడుతుంది, ఆ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది అనేది తన పాత్ర లో చూస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఇమ్మాన్, బలరామ్ కృష్ణ, పి. రాజేష్, నితిన్ సత్యా, సురేఖా వాణి, ప్రవస్తి, సంటానియో టెర్జియో, భారతీబాబు పాల్గొన్నారు.

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తు న్న కొత్త సినిమా ‘సుధీర్స్ జోకర్‘. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నా రు. ఆనంద మీడియా బ్యానర్ పై ప్రొ డ్యూసర్స్ శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో ప్రముఖ నటి అభిరామి నటిస్తున్నట్లు శుక్రవారం మేకర్స్ ప్రకటించారు. ‘సుధీర్స్ జోకర్‘ సినిమాలో అభిరామి... గాయత్రీ దేవి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అభిరామి పోషిస్తున్న గాయత్రీ దేవి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

రాష్ట్ర రోడ్లు భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య లను శుక్రవారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వాటర్స్ లో మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్త మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి, విప్ లకు పుష్ప గుచ్చాలను అందజేశారు.