19579 వార్తలు




హైదరాబాద్: డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు ఉదయనిధికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధికి హైకోర్టు తెలిపింది. ఆయనను కస్టడీలో ఉంచే ఉద్దేశం తమకు లేదని కోర్టుకు ఎజి తెలిపారు. త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతో ఉదయనిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం చెన్నైలోని నివాసంలో ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


నవతెలంగాణ – జుక్కల్ తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షులు దుంపటి రాజు ఆదేశాల మేరకు..నియోజకవర్గ అధ్యక్షుల బొమ్మల నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం జుక్కల్ మండల ఉప సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రసిడెంట్ చింతలా దుర్గ నరేష్, జుక్కల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూజారి గణేష్, జిల్లా కోశాధికారి బర్ల అనిత-సాయిలు, కామారెడ్డి జిల్లా కోశకాధికారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ […] The post రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం, మండల కమిటీ ఏర్పాటు appeared first on Navatelangana.


రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..నవతెలంగాణ-రుద్రంగిగ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. మంగళవారం రోజున రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, స్టేషన్ పరిసరాలు, విధుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు […] The post సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం పెంచాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ మండల పరిధిలోని కత్తల్వాడీ గ్రామంలోకి ప్రయివేటు బస్సులు రాకుండా సోమవారం గ్రామస్తులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే విషయం తెలుసుకున్న ఎంఈఓ తిరుపతయ్య మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో సర్పంచ్ గోపాల్ రావుతో పాటు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని పేద విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేసి, తమ పిల్లలను ప్రయివేటు బడులకు పంపొద్దని సూచించారు. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్యాభోదన అందుతుందని, అర్హత గల ఉపాధ్యాయులను […] The post కత్తల్వాడి గ్రామస్తులతో ఎంఈఓ సమావేశం appeared first on Navatelangana.

హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ హత్య చోటుచేసుకుంది. హమేర్ (35) అనే వ్యక్తిపై స్థానిక యువకుడు కొబ్బరికాయలు నరికే కత్తితో అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హమేర్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు హమేర్‌పై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు చేపడుతున్నారు. మృతుడు, నిందితుడు ఇద్దరూ గంజాయి సేవించేవారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


నవతెలంగాణ – న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ మందిర విరాళాల కుంభకోణం, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల దురాగతాలకు నిరసనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఛందా చోర్, గడ్డి చోర్’, ‘అమిత్ షా జవాబ్ దో’ వంటి నినాదాలు చేశారు. రామ మందిరంలో విరాళాల దొంగతనం జరిగిందన్న ఆరోపణలకు ప్రతీకగా ఎంపీలు ఆ ప్రదేశంలో […] The post పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష ఎంపీల నిరసన appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పలు చోట్ల హెచ్-ఫాస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టి 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. మంగళవారం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ …. 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించి, 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 3 క్రిమినల్ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. మసాలాల్లో సింథటిక్ రంగులు, […] The post 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్ appeared first on Navatelangana.

చెన్నై: తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగింది. త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో డిఎంకె నేత ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. కావేరి నీళ్లు చేరాల్సిన చోటికి చేరుతున్నాయని సిఎం విజయ్, సినీ నటి త్రిషపై అసభ్యకర కామెంట్లు చేశారని ప్రతిపక్ష నేత ఉదయనిధిపై టివికె కార్యకర్త తంజావూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఉదయనిధి సభలో మాట్లాడుతుండగా త్రిష..త్రిష.. అని డిఎంకె కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమిళనాడులో ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తోందని, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టు ఒక జోక్ లా ఉందని, తాను ఏమైనా తప్పుగా మట్లాడితే కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన అరెస్టుపై చట్టపరంగా పోరాడుతానని ఉదయనిధి సవాల్ విసిరారు.


నవతెలంగాణ-నవాబుపేటమండల పరిధిలోని కాకర్ల పహాడ్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా అదనపు, స్థానిక సంస్థల కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులతో తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి మౌళిక సదుపాయాలు లేకున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాల ఆవరణలో నిర్మాణం జరుగుతున్న భవనాన్ని పరిశీలించి వేంటనే పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. The post కాకర్ల పహాడ్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – సిద్దిపేట విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హైమావతి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ మధ్యనే ఆమె పట్టణంలోని మల్టీపర్పస్ హై స్కూల్ ను సందర్శించారు. ఆ సమయంలో కొంతమంది ఉపాధ్యాయులు భోజనానికి ఇంటికి వెళ్లడం, మరికొందరు ఉపాధ్యాయులు టీచింగ్ డైరీ రాయకపోవడం, ఎఫ్ ఆర్ ఎస్ సరిగా వేయకపోవడం వంటి అంశాలు ఆమె దృష్టికి వచ్చాయి. వెంటనే కలెక్టర్ డిఈఓకు ఫోన్ చేసి సమగ్రమైన విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ అనంతరం […] The post ఆరుగురు ఉపాధ్యాయులు సస్పెండ్ appeared first on Navatelangana.



నవతెలంగాణ-రుద్రంగిరుద్రంగి మండల కేంద్రంలో రూ.46 కోట్లతో నిర్మించనున్న ఆధునిక సాంకేతిక కేంద్రం పనులకు తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, కర్మగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా రాబోయే యువ తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. […] The post ఏటీసీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి వివేక్ appeared first on Navatelangana.

హైదరాబాద్: మాజీ గవర్నర్ డీవై పాటిల్(90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో మంగళవారం ఉదయం కోల్లాపూర్ లో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన పూర్తిపేరు జ్ఞానదేవ్ యశ్వంతరావ్ పాటిల్. విద్యావేత్త, వితరణశీలిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన 1957లో కొల్హాపూర్ పురపాలక ఎన్నికలలో కౌన్సిలర్ గా విజయం సాధించారు. 1960, 1970లలో పన్హాలా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారు. 1983లో ఆయన డి. వై. పాటిల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ ను స్థాపించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నాలుగు దశాబ్దాలలో నవీ ముంబై, పూణే, కొల్హాపూర్‌లలో 180కి పైగా విద్యాసంస్థలు, అనేక డీమ్డ్ విశ్వవిద్యాలయాలను నెలకొల్పారు. వైద్యం, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం, బయోటెక్నాలజీ, మేనేజ్‌మెంట్ రంగాలలో కాలేజీలు స్థాపించారు. భారతదేశంలో కొద్దిమంది ప్రైవేట్ విద్యావేత్తలు మాత్రమే ఆ స్థాయిలో సంస్థలను నిర్మించారు, రాజ్యాంగ పదవిలో ఉంటూనే అలా చేసిన వారు ఇంకా తక్కువ.పాటిల్ 2009 నుండి 2013 వరకు త్రిపుర గవర్నర్‌గా పనిచేశారు, 2013లో బీహార్‌కు మారారు. 2014 మధ్యలో కొద్దికాలం పాటు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. భ
