21741 వార్తలు

కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ‘ఛలో పార్లమెంట్ ’ నిరసనపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీ ఛార్జి చేయడం, పెల్లెట్ గన్‌లను పేల్చడం వంటి కఠిన చర్యలకు పాల్పడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ వివాదం వాడివేడిగా సాగుతోంది. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని విపక్షనేత రాహుల్ గాంధీ ప్రశ్నించడమే కాక, కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ఇది జరిగిందని, అందుకే సభకు రావడానికి అమిత్ షాకు ధైర్యం చాలడం లేదని కూడా గట్టిగా నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ల చర్య పౌరహక్కులు, శాంతి భద్రతల మధ్య ఉన్న సన్నని గీతను, పోలీస్ అధికారుల పరిమితులను మరోసారి చర్చకు తెచ్చింది. ఇది భావప్రకటన స్వేచ్ఛను అణగదొక్కడమేనన్న విమర్శలు వస్తున్నాయి. పోలీస్ మార్గదర్శకాల ప్రకారం గుంపును చెదరగొట్టడానికి ముందుగా హెచ్చరికలు, ఆ తరువాత జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగం చేయాలి. అప్పటికీ గుంపు అదుపులోకి రాకుంటే లాఠీఛార్జి చేయాలి. శరీరాన్ని తీవ్రంగా గాయపరిచేలా ఉండరాదు. పెల్లెట్ గన్స్ అత్యంత ప్రమాదకరమైనవి. ఆందోళనల వల్ల ప్రజలకు ప్రాణాపాయం తప్పదన్న పరిస్థితుల్లో మాత్రమే అది కూడా చివరి

పాట్నా: బీహార్ రాజధాని పాట్నా సమీపంలోని బక్తియార్‌పూర్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం ముందు ఉన్న రహదారిపై, బక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు కేవలం 50 మీటర్ల దూరంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం బక్తియార్‌పూర్‌లోని దేదార్ గ్రామానికి చెందిన విశాల్ కుమార్, అభిషేక్ కుమార్ 'స్టెయిర్ ఘాట్' వద్ద గంగా హారతిలో పాల్గొని తిరిగి మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులు ఆ ఇద్దరి కోసం కాపు కాశారని పోలీసులు తెలిపారు. వారు అక్కడికి చేరుకోగానే, దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి, ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది.దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 6 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నరు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టు లోకి 42761 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 6 వరద గేట్లు 8 ఫీట్లు గేట్లు ఎత్తి అవుట్ ప్లోగా 45.768 క్యూసెక్కుల నీటిని దిగవనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 3.495 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటి మట్టం 693.200 అడుగులు 2.104 టీఎంసీలలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ సూచిస్తున్నారు.కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు కోరారు.









న్యూఢిల్లీ: భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ 38 ఏళ్ల రహానే తన రిటైర్మెంట్ ను అధికారికంగా వెల్లడించారు. భారత జట్టుతో గడిపిన సమయాన్ని, దేశం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన విధానాన్ని వివరిస్తూ రహానే భావోద్వేగానికి లోనయ్యారు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించిన రహానే.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయంతో భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తన కెరీర్‌లో ముందుకు సాగడానికి ఇదే సరైన సమయమని రహానే పేర్కొన్నారు. ఆటగాడిగా కెరీర్‌కు ముగింపు పలుకుతున్నప్పటికీ, ఈ క్రీడతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.వీడియో సందేశంలో.. "ప్రతిదానికీ ఒక ఆరంభం, ఒక ముగింపు ఉండటం జీవిత వాస్తవం. సరైన సమయం వచ్చినప్పుడు, దానిని గౌరవించి ముందుకు సాగాల్సిందే. నా బ్యాటింగ్‌లో నేను ఎప్పుడూ 'టైమింగ్' (సరైన సమయం) పైనే ఆధారపడ్డాను. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్, అన్ని ఫార్మాట్ల నుం


చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలనే వాదన మళ్లీ బలం పుంజుకుంటోంది. లోక్‌సభ, అసెంబ్లీ వంటి ఉన్నత చట్టసభల ప్రాతినిధ్యానికి కనీస వయోపరిమితి 25 యేళ్ల నుంచి 21కి తగ్గించాలనే చర్చను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేవనెత్తారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పరచి, ఆ మేర తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతామనీ ఆయన ప్రకటించారు. ఈ అంశంపై ఇది కొత్త చర్చేం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే! కానీ, 25 యేళ్ల వర్తింపు వైపే ఇప్పటివరకు మొగ్గు కొనసాగుతోంది. ఓటు హక్కు 18 యేళ్లకు లభిస్తున్నపుడు ప్రాతినిధ్యం వయసు 21 యేళ్లకు తగ్గించాలనే డిమాండ్ తప్పేం కాకపోయినా, ‘హేతుబ ద్ధత’ అంశమే వివిధ స్థాయిల్లో తరచూ వివాదాస్పదమవుతోంది. ‘21కి తగ్గించడం మంచిదే, యువత అవకాశాలు మెరుగవుతాయి, పెరుగుతున్న యువజనాభా దామాషాను బట్టి వారికి ప్రాతినిధ్యం లభించాల్సిందే’ అనేది ఒక వాదన. ‘సరికాదు, చట్టాలు చేసే స్థాయి పరిపక్వత 25 యేళ్లు నిండితే కాని రాదు, దాన్ని మార్చకుండా ఉండటమే మంచిద’నే వాదన మరొకటి. తగ్గింపు చిత్తశుద్ధితో చేస్తున్న తాజా ప్రతిపాదనా? లేక జెన్‌జీ ని ఆకట్టుకునే రాజకీయ ఎత్తుగడా? అన్నది నిలకడపై తేలాల్సిందే!‘నీట్’ ప్రశ్నపత్రాల లీక్,



ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండటంతో హింస చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ భద్రతా దళాలు.. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 30 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడినట్లు కూడా సమాచారం. ఈ అణచివేత తర్వాత అనేక మృతదేహాలు గల్లంతయ్యారు. పిఓకె అంతటా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. కాగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అనేక సామాజిక, రాజకీయ సంస్థల కూటమి అయిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. జెఎఎసి ప్రకారం.. ఈ ప్రాంతంలోని 12 వివాదాస్పద స్థానాల చుట్టూ ఈ ఆందోళన నెలకొంది. పాకిస్తాన్ తనకు నచ్చిన ప్రధానమంత్రిని నియమించుకోవడానికి ఈ స్థానాలను తారుమారు చేస్తోందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. రాజకీయ వివాదంతో పాటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పరిపాలనా నిర్లక్ష్యం, రాజకీయ వివక్ష, మైనారిటీలపై జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా నిరసనలు చెస్తున్నారు.



నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో యువత చేపట్టిన ఆందోళన రక్తసిక్తంకావడం, ఆ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి వారి ప్రధాన డిమాండ్ల మేరకు విద్యా మంత్రి రాజీనామా చేయడం.. అంతా దేశంలో ఎవరూ ఊహించని పరిణామంగా జరిగిపోయింది. ముందెన్నడూ లేనంత గొప్ప పాలనను పన్నెండేళ్లుగా అందజేస్తున్నామంటున్న ఎన్‌డిఎకి కాక్రోచ్ పార్టీ షాక్ నిచ్చిందని చెప్పవచ్చు. బిజెపికి ఇది మయసభలో దుర్యోధనుడికి ఎదురైనా పరాభవం లాంటిదే. ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయులు ‘మోడీ.. మోడీ’ అంటూ పిడికిలెత్తి హోరెత్తుతుంటే రొమ్ము విరుచుకొని చిరుదరహాస మందగమన గంభీర వదనంతో దర్శనమిచ్చే మన ప్రధాని మోడీకి కాక్రోచ్ దెబ్బ జీర్ణించుకోలేనిదే. తన సాటి, తనను మించిన ప్రధాని దేశచరిత్రలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో మోడీ నిర్మించుకుంటున్న కీర్తి శిఖరానికి ఇదో పిడుగు దెబ్బగా చెప్పవచ్చు. ఇంతకాలం తన చాణక్య వ్యూహం, భాషణా చాతుర్యంతో దేన్నైనా కనికట్టు చేసే మోడీ కాక్రోచ్ ముందు మాంత్రికుని మంత్రం దండం పని చేయనట్లు మిన్నకుండిపోయారు. అన్నింటికీ మోడీ ఉన్నారులే అని ధీమాగా ఉండే బిజెపి, హిందూ వర్గాలకు కూడా ఇది మింగుడు పడనిదే. మోడీ కూడా ఫ


