21747 వార్తలు


నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో యువత చేపట్టిన ఆందోళన రక్తసిక్తంకావడం, ఆ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి వారి ప్రధాన డిమాండ్ల మేరకు విద్యా మంత్రి రాజీనామా చేయడం.. అంతా దేశంలో ఎవరూ ఊహించని పరిణామంగా జరిగిపోయింది. ముందెన్నడూ లేనంత గొప్ప పాలనను పన్నెండేళ్లుగా అందజేస్తున్నామంటున్న ఎన్‌డిఎకి కాక్రోచ్ పార్టీ షాక్ నిచ్చిందని చెప్పవచ్చు. బిజెపికి ఇది మయసభలో దుర్యోధనుడికి ఎదురైనా పరాభవం లాంటిదే. ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయులు ‘మోడీ.. మోడీ’ అంటూ పిడికిలెత్తి హోరెత్తుతుంటే రొమ్ము విరుచుకొని చిరుదరహాస మందగమన గంభీర వదనంతో దర్శనమిచ్చే మన ప్రధాని మోడీకి కాక్రోచ్ దెబ్బ జీర్ణించుకోలేనిదే. తన సాటి, తనను మించిన ప్రధాని దేశచరిత్రలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో మోడీ నిర్మించుకుంటున్న కీర్తి శిఖరానికి ఇదో పిడుగు దెబ్బగా చెప్పవచ్చు. ఇంతకాలం తన చాణక్య వ్యూహం, భాషణా చాతుర్యంతో దేన్నైనా కనికట్టు చేసే మోడీ కాక్రోచ్ ముందు మాంత్రికుని మంత్రం దండం పని చేయనట్లు మిన్నకుండిపోయారు. అన్నింటికీ మోడీ ఉన్నారులే అని ధీమాగా ఉండే బిజెపి, హిందూ వర్గాలకు కూడా ఇది మింగుడు పడనిదే. మోడీ కూడా ఫ







దేశంలో ద్రవ్యోల్బణం మరోసారి సామాన్యుడి జీవితాన్ని కుదిపేస్తోంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఒ) విడుదల చేసిన తాజా వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరికగా నిలిచాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుదల బాట పట్టడం ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన అధిక ద్రవ్యోల్బణం ప్రజల జీవనవ్యయాన్ని మరింత భారంగా మార్చుతోంది. అయితే, ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో ఆందోళన కలిగించే అంశం కేవలం ధరల పెరుగుదల కాదు.. ప్రజల స్పందనలో వచ్చిన మౌన మార్పు. ఒకప్పుడు ఉల్లిపాయ, టమాటా ధరలు పెరిగినా ప్రభుత్వాలు వణికిపోయేవి. రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు, మార్కెట్ బంద్‌లు సాధారణ దృశ్యాలుగా కనిపించేవి. ధరల పెరుగుదల రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీసేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బంగారం రికార్డు స్థాయికి చేరినా, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ప్రజల్లో పెద్దగా నిరసన కనిపించడం లేదు. ఈ మౌనం అంగీకారమా? లేక అసహాయతా అనే ప్రశ్న ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో 6.36 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడం దేశంలోనే

మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో రజతం లభించింది. 69 కిలోల విభాగంలో స్టార్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా 227 కిలోల బరువును ఎత్తిన హర్జిందర్ కౌర్ వరుసగా రెండో కామన్వెల్త్ పతకాన్ని సొంతం చేసుకుంది. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోటీల్లో హర్జిందర్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. ఈసారిమరింత మెరుగైన ప్రతిభతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఈ విభాగంలో కెనడాకు చెందిన షార్లెట్ సిమోనో 235 కిలోల బరువును ఎత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. కాగా, రజతం సాధించిన తర్వాత హర్జిందర్ భావోద్వేగానికి గురైంది. దేశానికి వరుసగా రెండోసారి పతకం అందించడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ పతకాన్ని తన కుటుంబానికి అంకితం ఇస్తున్నట్టు పేర్కొంది. ఇదిలావుంటే కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన హర్జిందర్, గుల్వీర్ సింగ్‌లను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు అభినందించారు.

గ్లాస్గో: స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ రజతం గెలిచి నయా చరిత్ర సృష్టించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఈ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. ప్రతికూల వాతావరణంలోనూ గుల్వీర్ సింగ్ అసాధారణ పోరాట పటిమతో రేసును పూర్తి చేశాడు. సుదీర్ఘ దూరాన్ని గుల్వీర్ 27 నిమిషాలు 49.78 సెకన్లలో పూర్తి చేశాడు. ఒకవైపు జోరుగా వర్షం పడుతున్నా గుల్వీర్ తన పోరాటాన్ని కొనసాగించాడు. చివరి వరకు పోరాడుతూ రజతం సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా అథ్లెట్ రాబిన్సన్ స్వర్ణం సాధించగా, డేవిడ్ కాంస్యం గెలుచుకున్నాడు. కాగా, గుల్వీర్ సింగ్ కెనడా, ఉగాండా, జమైకా అథ్లెట్లను వెనక్కి నెట్టి ప్రతిష్ఠాత్మకమైన రజతం దక్కించు కోవడం విశేషం.




చార్మింగ్ స్టార్ శర్వా హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ భారీగా రూపొందించిన 22 రోజుల క్లైమాక్స్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ క్లైమాక్స్‌కు ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ యాక్షన్‌ను డిజైన్ చేశారు. థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చే స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది. సినిమాలో ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న శర్వా తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 1960 నేపథ్యంలో తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్ లో సాగుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ’భోగి’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,








గువహతి: అస్సాంలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా వరదల కారణంగా మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 78కి చేరింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 3 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో ఉరుములతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీనివల్ల ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అస్సాం జిల్లాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉండటలంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తంగా ఉండాలని.. లోతపట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.అస్సాంలోని ఏడు జిల్లాలు.. శివసాగర్, చరైడియో, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, బిశ్వనాథ్, కామరూప్ (మెట్రోపాలిటన్)లో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలు ఇంకా వరద ఉధృతిని ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు. వరదల కారణంగా నిరాశ్రయులైన సుమారు 16,500 మందికి పైగా ప్రజల