22103 వార్తలు



నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల నేపథ్యం లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఒక రాజకీయ వివాదం ముగిసినట్లయింది. కానీ ఈ ఆందోళన వెనుక ఉన్న అసలు సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్దఎత్తున వీధుల్లోకి రావడం కేవలం పరీక్షల్లో జరిగిన అక్రమాలపై వ్యక్తమైన ఆగ్రహం మాత్రమే కాదు. ఏళ్ల తరబడి చదువుకున్నా, అభివృద్ధిపై ఎన్నో హామీలు విన్నా తమ భవిష్యత్తుపై భరోసా కనిపించడం లేదన్న ఒక తరం ఆవేదనకు ఈ ఉద్యమం అద్దం పట్టింది. యువత ఆగ్రహం నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్‌కే పరిమితం కాలేదని ఈ ఉద్యమం స్పష్టం చేసింది. నిరుద్యోగం, తగ్గిపోతున్న అవకాశాలు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆర్థిక భద్రత కల్పించడంలో ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న విశ్వాసం వంటి అనేక సమస్యలు యువతను వేధిస్తున్నాయి. ఏళ్లుగా ఉపాధి అవకాశాలు పెరగని అభివృద్ధి కారణంగా పేరుకుపోయిన అసంతృప్తికి నీట్ వివాదం ఒక నిప్పురవ్వలా మారింది. ప్రభుత్వానికి చెందిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) తాజా గణాంకాలు కూడ

నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 24 గంటల వ్యవధిలో 10 మంది అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొందరి మొబైల్ ఫోన్లు ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే స్విచ్ ఆఫ్ కావడంతో వారి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. కోలార్, అయోధ్యా నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో […] The post 24 గంటల్లో 10 మంది మిస్సింగ్ appeared first on Navatelangana.



నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. జంతర్‌మంతర్ వద్ద నిరసనలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ప్రశ్నోత్తరాల తర్వాత అన్ని అంశాలపై చర్చిద్దామని స్పీకర్ తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు నినదాలు ఆపకపోవడంతో అటు లోక్‌సభను, ఇటు రాజ్యసభను స్పీకర్లు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. The post లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా appeared first on Navatelangana.


మానవత్వం గురించి తెలుసుకోవాలంటే మానవసమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపట్ల కొంత అవగాహన అవసరం. మానవ జాతి పుట్టుకలో ఆదిమ జాతులు ముఖ్యమైనవి. ఆదివాసేతరులు తమ మూలాలు ఆదిమ సమాజాల్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ముందు మానవత్వం పరిమళించిన ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవి గురించి తెలుసుకోవాలి. మహాశ్వేతా దేవి ఆ ఆదిమ సమాజ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆదివాసులు గురించి తన జీవితమంతా రాశారు. వారి తరపున పోరాడారు. ఆదివాసుల జీవితాల గురించి, పోరాటాల గురించి తనవంటి ఆదివాసేతరులకు చెప్పడానికి రాశారు. చాలా మంది ఆదివాసేతరులలో సాహిత్యం ద్వారా తనవంటి సహానుభూతిని కలిగించారు. వారిని చైతన్యపరిచారు. అణగారిన వర్గాల గుండె చప్పుడుగా, అడవి బిడ్డల హక్కుల కోసం గొంతెంతిన సామాజిక ఉద్యమకారిణిగా తన కలాన్ని ఆయుధంగా మలుచుకొని, వారి జీవితాలకు తన రచనలతో నిలుపుటద్దం పట్టారు. మహాశ్వేతాదేవి దేశంలోనే అత్యుత్తమ రచయిత్రిగా ఎంత గుర్తింపు పొందారో, ఆదివాసీల హక్కుల కోసం నిలబడి పోరాడిన కార్యకర్తగా కూడా అంతే గుర్తింపు పొందారు. ఆదివాసేతరులు ఆమెను ప్రేమగా ‘దీదీ’ అని పిలుచుకుంటే, ఆదివాసులు కూడా ఆమెను ప్రేమగా ‘మారందాయి’ గా పలకరించేవారు. నాగరిక ప్రపంచం,


పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు భారత విద్యా వ్యవస్థను వెంటాడుతున్న అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా మారాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును క్షణాల్లో తలకిందులు చేసే ఈ దుర్వ్యవస్థకు కేవలం న్యాయపరమైన పరిష్కారాలు సరిపోవు. ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి నిందితులను వేగంగా శిక్షించడం అవసరమే అయినప్పటికీ, అది వ్యాధికి ఇచ్చే నొప్పి నివారణ మాత్ర మాత్రమే. అసలు వ్యాధి మాత్రం పరీక్షా వ్యవస్థలోని బలహీనతలు, జవాబుదారీతనం లోపించడం, లాభాపేక్షతో పెరిగిన అక్రమ నెట్‌వర్క్‌లు. వాటిని నిర్మూలించకపోతే సమస్య మళ్లీ మళ్లీ పునరావృతమవుతూనే ఉంటుంది. దేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా ప్రవేశాలకోసం వివిధ పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు వారి జీవితాలను నిర్ణయించే కీలక మలుపులు. అలాంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీక్ కావడం అంటే కేవలం ఒక పరీక్ష రద్దు కావడం కాదు; అది ప్రతిభపై విశ్వాసానికి తూట్లు పొడవడం. నిజాయితీగా శ్రమించిన విద్యార్థిని, అక్రమ మార్గంలో ప్రశ్నాపత్రం సంపాదించిన వ్యక్తితో ఒకే స్థాయిలో నిలబెట్టడం. అంతక






విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (ఎకె47) ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచ యం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను పరిచయం చేయగా, అనంతరం శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ చిట్టిబాబు పాత్రలో అలరించనున్నారు. కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే కుటుంబ పెద్ద గా ఆయన పాత్ర ఆకట్టుకోనుంది. విడుదలైన పాత్ర పరిచయ వీడియోలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కనిపి స్తూ, నవ్వులు, భావోద్వేగాలు, కు టుంబ అనుబంధాలతో నిండిన చిత్ర ప్రపంచాన్ని అం దంగా పరిచయం చేశారు. చిట్టిబాబు పాత్ర ఆయన కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన పాత్రగా నిలిచేలా కనిపిస్తోంది. ఆనం దం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపం గా ఈ పాత్ర ఉండబోతోంది. ప్రఖ్యాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధా

వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’తో బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తొలి పాట ’బొమ్మ బొమ్మ’ను మేకర్స్ విడుదల చేశారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మరోసారి మనసును హత్తుకునే మధురమైన మెలోడీని అందించారు. అనంత శ్రీరామ్ తన సాహిత్యంతో ప్రేమలో మునిగిపోయిన ఓ యువకుడి భావాలను కవితాత్మకంగా ఆవిష్కరిస్తూ, కథానాయిక అందం, ఆమె ప్రత్యేకతను ఎంతో అందంగా వర్ణించారు. ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ’శ్రీ శ్రీ’ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంద

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో విల్లుపురం సమీపంలోని ఫ్లైఓవర్‌పై మంగళవారం ఉదయం జరిగిన వాహనాల ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఒక ద్విచక్రవాహనం అదుపుతప్పి జారిపడి, ఎదురుగా వస్తున్న లగ్జరీ బస్సును ఢీకొట్టింది. వెనకనుంచి వేగంగా వస్తున్న ఓ కారు బస్సు వెనక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విల్లుపురం నివాసి అయిన భూపతి అక్కడికక్కడే మరణించగా, కారులో ప్రయాణిస్తున్న జాన్ అన్బళగన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. The post ఫ్లైఓవర్‌పై పలు వాహనాలు ఢీ..ఇద్దరు మృతి appeared first on Navatelangana.

గుడిహత్నూర్: అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులు...హాస్టల్ వార్డెన్ నుంచి వసూళ్లకు పాల్పడ్డ తండ్రీకొడుకుల అరెస్ట్

