22092 వార్తలు




హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలనే హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎంఎల్ఎ కెపి వివేకానంద తెలిపారు. పేదల ఇళ్లను కూల్చి పెద్దల చేతిలో పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతోందని విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో పాటు బడా లీడర్స్ లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు చేశారు. కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. హైడ్రా అనేదే పెద్ద డ్రామా అని, చెరువులను, ప్రభుత్వ భూములను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ, పేద ప్రజలను మోసం చేస్తున్నారని వివేకానంద ధ్వజమెత్తారు. హైకోర్టులో ఎంతమంది హైడ్రాను వ్యతిరేకిస్తే, ఈ రోజు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఉన్నత న్యాయస్థానం అని చురకలంటించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందే చెప్పారని, హైడ్రా అనేది పేదలకు పెద్ద శాపం అని, బి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా ను బొంద పెడతామన్నారు.కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ టిఎల్, ప్రభుత్వ భూమి అని ఇష్టం వచ్చినట్లు పేదల ఇల్లు కూల్చివేశారని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తుందని, అసెంబ్లీ సాక్షిగా క

హైదరాబాద్: దేశంలోనే ఎంతో ఆదరణ పొందిన నాయకుడు దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, పదునైన ప్రసంగాలతో గళమెత్తిన మేధావి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. 15 వ లోక్ సభ లో తో పార్లమెంట్ సభ్యుడిగా తాము కొత్తగా పార్లమెంట్ లో అడుగుపెట్టినపుడు ఆయన మాకు ఎంతో స్ఫూర్తి కలిగించారని ప్రశంసించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియలో, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. జైపాల్ రెడ్డి తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ సిద్ధాంతాలు, నైతిక విలువలు, మచ్చలేని నిబద్ధతతో పనిచేశారని, ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

కారణాలేమైనా సరే దేశాన్ని నడిపించాల్సిన యువతేజం ఎక్కడ ఏ ఆకాశం కొసన అస్తమించినా అది దేశానికి నష్టం, అరిష్టం అని విజ్ఞులు చెబుతుంటారు. అలాగే విద్యార్థులు నవ సమాజ నిర్మాతలని కవులు కీర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో చదువుల్లో ఉత్తీర్ణులు కాలేక ఓడిపోయామని కుంగుబాటుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయా కుటుంబాల్లో రగులుకున్న క్షోభ ఎవరూ ఆర్పలేనిది, తీర్చలేనిది. ప్రవేశ పరీక్షలు (ఎంట్రన్స్ ఎగ్జామ్స్) ఒక ద్వారపాలకుడిలా పనిచేస్తాయి. భారతీయ యువతలో ఎవరికి భద్రమైన, అధికారిక ఉద్యోగాన్ని పొందే అవకాశం దక్కుతుందో నిర్ణయిస్తాయి. అయితే అనేక పరీక్షల్లో ప్రశ్నపత్రాలు వరుసగా లీక్ కావడం వల్ల ప్రతిభను పరీక్షించే వ్యవస్థ విస్తృతమైన అవినీతికూపంగా మారిపోవడం మొత్తం విద్యార్థి లోకాన్ని దారి తెన్నూ లేని చీకటి ప్రపంచం లోకి నెట్టుతోంది. నీట్ పరీక్ష ప్రశ్నావళి లీక్ కావడం, రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ఈలోగా దాదాపు 20 మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడడం దేశాన్ని ప్రస్తుతం తీరని విషాదంలో ముంచెత్తుతోంది. నీట్ పరీక్షలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి విద్యావ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితులపై కదంతొక్కిన కాక్రోచ్ జ




శ్రీనగర్: యాత్రికులు అమర్‌నాథ్ నుంచి తిరిగొస్తుండగా బస్సులో ఇంటిపై పడిన సంఘటన జమ్ము కశ్మీర్ రాష్ట్రం గాందర్ బల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కంగన్ శివారులో బస్సు అదుపుతప్పి ఓ ఇంటిపై పడింది. బస్సులో పడినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇల్లు లేకపోయి ఉంటే బస్సు సింధు నదిలో పడేదని సమాచారం. 39 మంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున అమర్‌నాథ్ యాద్రకు 3029 మంది యాత్రకులు బయలుదేరారు. జులై 3 నుంచి ఆగస్టు 28 వరకు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. సోమవారం అమర్‌నాథ్‌ను 4.2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 2024లో 5.2 లక్షలు, 2025లో 4.14 లక్షలు, 2011లో 6.3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.


నవతెలంగాణ – హైదరాబాద్ : మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను మరింత విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం 20 జట్లతో జరుగుతున్న ఈ టోర్నీలో జట్ల సంఖ్యను 24కు పెంచే ఆలోచనలో ఐసీసీ ఉంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. 2032 ఎడిషన్ నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది. అసోసియేట్ దేశాలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, టోర్నమెంట్ షెడ్యూల్, మ్యాచుల సంఖ్య, ప్రసార […] The post టీ20 ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య పెంపు appeared first on Navatelangana.




నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల నేపథ్యం లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఒక రాజకీయ వివాదం ముగిసినట్లయింది. కానీ ఈ ఆందోళన వెనుక ఉన్న అసలు సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్దఎత్తున వీధుల్లోకి రావడం కేవలం పరీక్షల్లో జరిగిన అక్రమాలపై వ్యక్తమైన ఆగ్రహం మాత్రమే కాదు. ఏళ్ల తరబడి చదువుకున్నా, అభివృద్ధిపై ఎన్నో హామీలు విన్నా తమ భవిష్యత్తుపై భరోసా కనిపించడం లేదన్న ఒక తరం ఆవేదనకు ఈ ఉద్యమం అద్దం పట్టింది. యువత ఆగ్రహం నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్‌కే పరిమితం కాలేదని ఈ ఉద్యమం స్పష్టం చేసింది. నిరుద్యోగం, తగ్గిపోతున్న అవకాశాలు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆర్థిక భద్రత కల్పించడంలో ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న విశ్వాసం వంటి అనేక సమస్యలు యువతను వేధిస్తున్నాయి. ఏళ్లుగా ఉపాధి అవకాశాలు పెరగని అభివృద్ధి కారణంగా పేరుకుపోయిన అసంతృప్తికి నీట్ వివాదం ఒక నిప్పురవ్వలా మారింది. ప్రభుత్వానికి చెందిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) తాజా గణాంకాలు కూడ

నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 24 గంటల వ్యవధిలో 10 మంది అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొందరి మొబైల్ ఫోన్లు ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే స్విచ్ ఆఫ్ కావడంతో వారి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. కోలార్, అయోధ్యా నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో […] The post 24 గంటల్లో 10 మంది మిస్సింగ్ appeared first on Navatelangana.



నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. జంతర్‌మంతర్ వద్ద నిరసనలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ప్రశ్నోత్తరాల తర్వాత అన్ని అంశాలపై చర్చిద్దామని స్పీకర్ తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు నినదాలు ఆపకపోవడంతో అటు లోక్‌సభను, ఇటు రాజ్యసభను స్పీకర్లు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. The post లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా appeared first on Navatelangana.


మానవత్వం గురించి తెలుసుకోవాలంటే మానవసమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపట్ల కొంత అవగాహన అవసరం. మానవ జాతి పుట్టుకలో ఆదిమ జాతులు ముఖ్యమైనవి. ఆదివాసేతరులు తమ మూలాలు ఆదిమ సమాజాల్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ముందు మానవత్వం పరిమళించిన ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవి గురించి తెలుసుకోవాలి. మహాశ్వేతా దేవి ఆ ఆదిమ సమాజ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆదివాసులు గురించి తన జీవితమంతా రాశారు. వారి తరపున పోరాడారు. ఆదివాసుల జీవితాల గురించి, పోరాటాల గురించి తనవంటి ఆదివాసేతరులకు చెప్పడానికి రాశారు. చాలా మంది ఆదివాసేతరులలో సాహిత్యం ద్వారా తనవంటి సహానుభూతిని కలిగించారు. వారిని చైతన్యపరిచారు. అణగారిన వర్గాల గుండె చప్పుడుగా, అడవి బిడ్డల హక్కుల కోసం గొంతెంతిన సామాజిక ఉద్యమకారిణిగా తన కలాన్ని ఆయుధంగా మలుచుకొని, వారి జీవితాలకు తన రచనలతో నిలుపుటద్దం పట్టారు. మహాశ్వేతాదేవి దేశంలోనే అత్యుత్తమ రచయిత్రిగా ఎంత గుర్తింపు పొందారో, ఆదివాసీల హక్కుల కోసం నిలబడి పోరాడిన కార్యకర్తగా కూడా అంతే గుర్తింపు పొందారు. ఆదివాసేతరులు ఆమెను ప్రేమగా ‘దీదీ’ అని పిలుచుకుంటే, ఆదివాసులు కూడా ఆమెను ప్రేమగా ‘మారందాయి’ గా పలకరించేవారు. నాగరిక ప్రపంచం,