22297 వార్తలు


హైదరాబాద్: డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించిన సంఘటన హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... అబిడ్స్‌లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో ఉన్న సైఫ్ అనే వ్యక్తి మరో వ్యక్తి డ్రగ్స్ ప్యాకెట్ ఇస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న సైఫ్‌ను బయటకు దిగాలని పోలీసులు తెలిపారు. అతడు కారు దిగకుండా ముందుకు పోనివ్వడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సిఐ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. సిఐ శ్రీకాంత్‌తో పాటు కానిస్టేబుల్ మహేందర్ కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అఫ్జల్‌గంజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.




జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో ’ఆర్‌ఆర్ స్టూడియోస్’, ’వండర్‌బార్ ఫిలిమ్స్’ సంయుక్తంగా ’డి55’ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాయి.. ’అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడు తూ ‘ధనుష్ , శ్రేయస్, ఇందులో నటిస్తున్న ఇతర నటీనటులంద రూ ఎంతో అంకితభావంతో పని చేస్తున్నారు. ముఖ్యంగా మమ్ము ట్టి , సాయి పల్లవి, శ్రీలీల, ఇంద్రన్, అనేకమంది ప్రతిభావంతులై న నటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. అందరి కృషి ఫలితంగా ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది‘ అని అన్నారు. అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ఈసారి ప్రేక్షకులను కట్టిపడేసే వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో ఒక భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.



హైదరాబాద్: జింబాబ్వేతో జరిగిన మూడో టి20లో గెలిచి టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ 196 స్ట్రైక్‌రేటుతో 151 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. మూడు మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ టూర్‌లో వైభవ్ ఐదు రికార్డులు బద్దలు కొట్టాడు. 16 ఏళ్ల వయసు రాకముందే రెండు హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. మూడు మ్యాచ్‌లలో 196 స్ట్రైక్ రేటుతో 151 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ఆటగాడిగా చరిత్రలోకెక్కాడు. భారత జట్టు తరపున అత్యంత తక్కువ వయసులో హాఫ్ సెంచరీ చేయడంతో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. 15 ఏళ్ల 118 రోజు వయసులోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. గతంలో నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా పేరిట ఉండేది.



హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి వినమ్ర నివాళులర్పించారు. భారత అంతరిక్ష, క్షిపణి సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశేష కృషి చేసి, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో డాక్టర్ అబ్దుల్ కలాం పాత్ర చిరస్మరణీయమని స్మరించుకున్నారు. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా వారు చూపిన నిబద్ధత, నిరాడంబర జీవనం, అసాధారణ ప్రతిభకు, అచంచలమైన దేశభక్తికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని సిఎం పేర్కొన్నారు.










సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ ‘ న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ చాలా నచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. సుమంత్ నా ఫేవరెట్ బ్రో. జగపతి బాబు చాలా స్టైలిష్‌గా కనిపించారు ‘అని అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ‘రాజేష్ ఈ కథ చెప్పిన వెంటనే ఓకే చేశాను. ఈ సినిమాలో హీరో స్క్రీన్‌ప్లే. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంది. ప్రతి పాత్రకు కథను మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది‘అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, కంటెంట్ హెడ్ భరణ్, నిర్మాత హరీష్, దర్శకుడు రాజేష్ కర్ణ, సింజిత్ తదితరులు పాల్గొన్నారు.

నిశ్శబ్దపు నిశీధిలో నీ జ్ఞాపకం వెలిగిన వేళ నా గుండెలో ప్రవహించిన జీవనదులు ప్రతి పలకరింపునూ ఒక ప్రేమలేఖగా మలుస్తూ ఉదయపు చూపులా దోబూచులాడిన నీ చిరునవ్వు అమలిన మన స్నేహపు అనుభూతులను భాషగా మార్చి మాటలకన్నా ముందుగా పలకరించుకున్న మన మనసులు ఇక నువ్వూ నేనూ ఈ కవిత్వపు జలపాతంలో తనివితీరా తడుస్తూ కాలపు అంచులదాకా -విల్సన్ రావు కొమ్మవరపు