19750 వార్తలు


హైదరాబాద్: ‘తొలివలపు’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన నటుడు గోపిచంద్. విలక్షణమైన సినిమాలు చేయడంతో ఆయన ఎప్పుడు ముందుంటారు. అయితే గత రెండేళ్లలో గోపిచంద్ సినిమాలు రాలేదు. 2024లో ఆయన ‘విశ్వం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించినంత సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం గోపిచంద్ ‘భరతవర్ష’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా గోపిచంద్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘భరతవర్ష’ టీమ్ ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గోపిచంద్‌కు అభినందనలు తెలిపింది.25 Years. Countless Memories. One Remarkable Journey. ❤️Congratulations to Our Dear @YoursGopichand garu on completing 25 glorious years in Telugu cinema. Your dedication and consistency continue to inspire, he's ready to redefine greatness with #BharataVarsha 🔥… pic.twitter.com/lbvtpOxJng— Srinivasaa Silver Screen (@SS_S


అమరావతి: కామన్వెల్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించారని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రికార్డులు సృష్టిస్తూ క్రీడారంగాన్ని కొత్తదిశ వైపు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 39 పథకాలు సాధించడం దేశానికి ఎంతో గర్వకారణమని, ఈ విజయం మన పారా అథ్లెట్ల పట్టుదల, పోరాట పటిమకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ప్రతి పతకం వెనుక దేశం కోసం ఆడాలనే బలమైన కోరిక ఉందని, రాత్రింబవళ్లు శ్రమించిన కోచ్ లు, సహాయక సిబ్బంది కృషికి అభినందనలు తెలియజేశారు. పోటీల ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుత క్రీడాస్ఫూర్తి చూపారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

హైదరాబాద్: ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి లీలలు వెలుగులోకి వచ్చాయి. గదిలో ప్రేమ లేఖలు దొరకడంతో వివాహితతో సంబంధం పెట్టుకున్నట్టు తెలిసింది. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధించిడంతో ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను డిసిపి లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షిస్తున్నారు. అశోక్‌నగర్‌లోని ఉదయ్ గదిని పోలీసులు తనిఖీ చేశారు. గది నుంచి ల్యాప్‌ట్యాప్, స్మార్ట్ ఫోన్, లవ్ లెటర్స్ (ప్రేమ లేఖలు), ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. లేఖల్లోని పేర్ల గురించి ఆరా తీయగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మహిళతోనూ అతడికి సంబంధమున్నట్లు తేలింది. ఆమెకు 2014లోనే పెళ్లవగా, ఒక కుమారుడు కూడా ఉన్నట్లు తెలిసింది.ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. ఆయనను మరింత విచారించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కస్టడీ పిటిషన్ పై విచారణ చేయనున్నారు. ఉదయ్ ల్యాప్ టాప్, ఐ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపించారు. మరో యువతిక






హైదరాబాద్: సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై ఎక్స్ (ట్విట్టర్)లో అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపిఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో గుర్తుతెలియని వ్యక్తి దూషించాడు. అభ్యంతరకర పోస్టును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తీవ్రంగా పరిగణించారు. సదరు నెటిజన్‌పై ఐటి చట్టం, ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరించారు.


హైదరాబాద్: తెలంగాణ లో యువత నిర్వేదంలో ఉన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి యువతను వాడుకుంటోందని, రెండున్నరేళ్లుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని విమర్శించారు. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయని, 7 వేల ఉద్యోగాలకే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఖమ్మంలో ఓ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడని, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మ హత్యాయత్నం చేస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టించుకోరా? అని ఆయన ఎందుకు హైదరాబాద్ రావడం లేదని ప్రశ్నించారు. ఆ విద్యార్థి రాసింది సూసైడ్ నోట్ కాదు..కాంగ్రెస్ ప్రభుత్వంపై రాసిన ఛార్జ్ షీట్ అని తెలియజేశారు. అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువలేదని, పిల్లల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఆయనకు లేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నా..రాహుల్ గాంధీ పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్


కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లోని బౌరంపేటలోని బాలుర మైనారిటీ స్కూల్లో దారుణం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఐదవ తరగతి విద్యార్థిపై ముగ్గురు విద్యార్థుల లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలుడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో దుండిగల్ పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ ఈ విషయాన్ని గొప్యంగా ఉంచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వార్డెన్ లు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.






హైదరాబాద్: ఒక ప్రమాదకరమైన అపోహ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు ఉన్నాయి. ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది వెంటనే ఇసిజి చేయించుకుంటారు. ఇసిజి నార్మల్‌గా వచ్చిందంటే “గుండెపోటు లేదు” అని భావించి ఇంటికి వెళ్లిపోతారు. అయితే ఈ అభిప్రాయం చాలాసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. నార్మల్ ఇసిజి వచ్చినంత మాత్రాన గుండెపోటు లేదని ఖచ్చితంగా చెప్పలేము.ఇసిజి అనేది గుండె విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసే అత్యంత ముఖ్యమైన పరీక్ష. గుండెపోటును గుర్తించడంలో ఇది కీలక పాత్ర పోషించినప్పటికీ, ప్రతి గుండెపోటును మొదటి ఇసిజిలోనే గుర్తించలేము. ముఖ్యంగా స్టెమీ గుండెపోటు ప్రారంభ దశలో ఇసిజిలో ఎలాంటి మార్పులు కనిపించకపోవచ్చు. కొంతమంది రోగుల్లో కనిపించే నాన్ ఎస్ టి ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారక్షన్ అనే గుండెపోటు రకంలో మొదటి ఇసిజి పూర్తిగా సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గుండె వెనుక భాగం లేదా సర్ కమ్ ప్లెక్స్ కరోనరీ ఆర్టరీ ప్రభావితమైన కొన్ని గుండెపోటులలో కూడా సాధారణ ఇసిజితో నిర్ధారణ కష్టమవుతుంది.ఎప్పుడు మరింత జాగ్రత్త అవసరం? ఈ లక్షణాలు ఉంటే ఇసిజి నార్మల్ వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు.ఛాతిలో బిగుతుగా లేదా నొక్కినట్ల
