21032 వార్తలు




షాహిద్ కపూర్ హీరోగా, రష్మిక, కృతి సనన్ హీరోయన్లుగా నటించిన చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. హోమీ అదజానియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ జూన్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2026లో విడుదలై తొలి వీకెండ్‌లో రూ.50 కోట్లు దాటిన హిందీ సినిమాల్లో ‘కాక్‌టెయిల్ 2’ ఒకటిగా నిలిచింది.


హైదరాబాద్: మధురానగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచ్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బాలుడు కారుతో ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందింది. మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


బాలానగర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మా నగర్ లోని ఫేస్1 లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లారీ టైర్ కింద పడి బాలిక మృతి చెందారు. బైక్ పై తన మామ తో వెళ్తున్న వేద శ్రీ(4) లారీ టైర్ కింద పడటంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాపిక్ కు అంతరాయం లేకుండా వాహనాన్ని అక్కడి నుంచి స్టేషన్ కు తరలించారు. పగటి సమయంలో భారీ వాహనాలు హైదరాబాద్ లోకి రావడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


హైదరాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది. విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతయ్యారు. యువతి, యువకుడు అలల తాకిడికి కొట్టుకపోయారు. నీతూ, రాము అనే యువతి, యువకుడు స్నేహితులతో కలిసి విశాఖ పట్నం బీచ్ కు వచ్చారు. ఫోటోలు తీస్తుండగా నీతు నీళ్లలో పడిపోతుంగా రాము కాపాడాబోయారు. ఇద్దరు నీళ్లలో పడిపోవడంతో అలల తాకిడికి కొట్టుకపోయారు. ఇద్దరి కోసం గాలింపు పోలీసులు, రెస్క్యూసిబ్బంది గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు విశాఖ పట్నం జిల్లా పెదజాలరిపేట చెందిన వారిగా గుర్తించారు.

గాజువాక: స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలోని పాత గంగవరం బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫొటోషూట్ కోసం బీచ్‌కు వెళ్లిన స్నేహితుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా పెందుర్తికి చెందిన ఆటో డ్రైవర్ దామోదర్, జాలరిపేటకు చెందిన నీతూతో పాటు మరో ఐదుగురు స్నేహితులు ఆదివారం పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నీతూ, దామోదర్ సముద్రంలో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై న్యూ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్: కులాలకు అతీతంగా జరిపే అద్భుతమైన పండుగ బోనాలు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కెటిఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కెటిఆర్ కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కెటిఆర్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో బోనాలను పట్టించుకోలేదని, బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించలేదని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక మాజీ సిఎం కెసిఆర్ బోనాలకు రాష్ట్ర పండుగ హోదా ఇచ్చారని, తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతోనని కెసిఆర్ చెప్పారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గుడికి రూ. 25 కోట్లు విడుదల చేశామని, ఆలయ కమిటీలకు డబ్బులిచ్చి పండుగలను ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని తల్లికి మొక్కుకున్నామని, రాష్ట్రం పచ్చగా ఉండాలని, రైతు బాగుండాలని అమ్మను వేడుకున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.




అమరావతి: పోగాకు అంశాన్ని రాజకీయం చేసేందుకు వైసిపి యత్నిస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. పోగాకు రైతులకు వడ్డీ లేకుండా రూ. 50 వేల రుణం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన పొగాకు కొనుగోలు చేస్తామని ఎగుమతి దారులు రోజుకు 2 మిలియన్ కిలోల పొగాకు కొనేందుకు హామీ ఇచ్చారని తెలియజేశారు.వడ్డీలేని రుణాల వల్ల సుమారు 40 వేల మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరుతుందని పెమ్మపాని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాలని 2015 లో సిఎం చంద్రబాబు ఆలోచించారని, 2,700 ఎకరాల్లో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించేందుకు జిఎంఆర్ అంగీకరించిందని అన్నారు. 2019 నాటికే సిఎం చంద్రబాబు 2,200 ఎకరాలు భూసేకరణ చేశారని, వైసిపి నేతలు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల మిగతా 500 ఎకరాలు సేకరించలేదని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి కొన్ని కేసులు విత్ డ్రా చేసుకుందని, వైసిపి సేకరించింది కేవలం 300 ఎకరాలు మాత్రమేనని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టులో అవినీతి జరిగిందని జగన్ రీటెండర్ చేశారని, జగన్ రీటెండర్ చేయడంవల్ల భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం





ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్థిక్ పాండ్యాను ఆ జట్టు వదలుకుంటుందని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సంప్రదింపులు జరిపిందనే వార్తలు బయటకు వచ్చాయి. శివమ్ దూబెతో పాటు.. మరొకరిని తమ జట్టులోకి తీసుకొని ముంబై హార్థిక్‌ను చెన్నైకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని పేర్కొంది. ‘‘మేం ఇప్పుడు పోస్ట్ సీజన్ రివ్యూ నిర్వహిస్తున్నాం. అన్ని కోణాల్లో సమీక్షించి నివేదికను సిద్ధం చేసుకుంటాం. ఇప్పటి వరకైతే ఆటగాళ్ల ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదు. రివ్యూ పూర్తైన తర్వాతనే ట్రేడింగ్ గురించి ఆలోచిస్తాం. అందుకు ఇంకా సమయం పడుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం’’ అని ముంబై ఇండియన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు.

