
4100 వార్తలు

అమెరికాలో కాల్పుల.. హింసకు తావు లేదు: మోదీ వాషింగ్టన్: అమెరికాలోని వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌పై జరిగిన కాల్పుల ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. కాల్పుల ఘటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, వైస్ ప్రెసిడెంట్‌కు ఎలాంటి హాని జరగలేదని తెలియడంతో తనకు ఎంతో ఊరట కలిగించిందన్నారు. వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ ఘటనను సందేహం లేకుండా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అమెరికా శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్‌లో డిన్నర్ లో కోలో టామోస్ అలెన్ అనే దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. అలెన్ టీచర్ గా పని చేస్తున్నట్టు సమాచారం.

వాషింగ్టన్: ఎప్పుడు అమెరికా వచ్చినా ఈ హోటల్ లోనే ఉంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎపాల్ తెలిపారు. కాల్పులు జరిగినప్పుడు హోటల్ లోనే ఉన్నానని అన్నారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ లో జరిగిన కాల్పులకు కెఎపాల్ స్పందించారు. ప్రపంచంలో శాంతి కరువైందని యుద్దాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీని తప్పించుకొని షూటర్ ఎలా హోటల్ లోకి వచ్చాడు? అని ప్రశ్నించారు. యుద్ధాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా యుద్ధాలు ఆపి శాంతికి కృషి చేయాలని కెఎపాల్ అమెరికాను కోరారు.

తిరుపతి: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 80,350 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,597 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.
నవతెలంగాణ హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కొడవలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. శివ, లక్ష్మి భార్య భర్తలు. కొంత కాలంగా కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో లక్ష్మి తన భర్తపై కొడవలితో దాడి చేసి హతమార్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […] The post భర్తను కొడవలితో నరికి చంపిన భార్య appeared first on Navatelangana.

మన తెలంగాణ/బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలోని లిఫ్టులో శనివారం ఓ వింత జంతువు ప్రత్యక్షం కావడంలో సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘట స్థలానికి చేరుకున్న అధికారులు పిల్లి జాతికి చెందిన జంతువుగా నిర్ధారించారు. బకెట్ సహాయంతో తీసి బయటకు పంపించారు. ఈ జంతువు పునుగుపిల్లి మాదిరిగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బిసి మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. టైలరింగ్ తో ఉత్పాదకతను పెంచడంతో వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా పొన్నం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్ర

మన తెలంగాణ/మోత్కూర్: మాజీ సిఎం కెసిర్, బిఆర్‌ఎస్ నేతలపై కవిత విమర్శలు మానుకోవాలని మోత్కూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్నది అప్పటి కవిత కాదని, ఇప్పటి కవిత రేవంత్ రెడ్డి చేతిలోకీలుబొమ్మ అన్నారు. కవితకు ఎన్నో అవకాశాలు ఇస్తే అడ్డమైన పనులు చేసి కోట్లకు పడగలెత్తి ఇప్పుడు పార్టీని, కేసీఆర్‌పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఆంధ్రలో అధికారం కోసం చంద్రబాబు జగన్ చెల్లెను పావుగా వాడుకున్నట్లు ఇక్కడ కూడా చంద్రబాబు కనుసన్నుల్లో పనిచేస్తున్న రేవంత్ కూడా కవిత రాజకీయంగా పావుగా వాడుకుంటున్నారన్నారు. వాళ్ళుఆడుతున్న డ్రామాలో నువ్వొక పావులాగా మిగిలిపోతావని అన్నారు. యావత్ తెలంగాణ ఇప్పుడు మాజీ సిఎం కెసిఆర్‌ను మాత్రమే కోరుకుంటుందని, కెసిఆర్‌పై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పాలడుగు, పనకబండ, రాగిబాయి గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ కావాలనే అడ్డుకుంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు గూదే మధుసూదన్ యాదవ్ విమర్శించారు. శనివారం మోత్కూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలడుగు సర్పంచ్ రెబల్ అభ్యర్థి కావడంతో వ్యక్తిగత అక్కసుతో అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తున్నారన్నారు. రాజకీయ ద్వేషాలతో గ్రామాల అభివృద్ధిని బలిచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరం అన్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిలిచిపోయిన ఉపాధి హామీ పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తూ, అభివృద్ధి పనులను అడ్డుకోవడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమ
నవతెలంగాణ హైద్రాబాద్ : విశాఖ నగరంలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి బీచ్ రోడ్డులో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు టెక్కీలు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్ మహీంద్రాలో పనిచేస్తున్న గంగిరి కుశాల్ కుమార్ (32), షేక్ తౌసీఫ్ (27) స్నేహితులు. కుశాల్ కుమార్ టీమ్ మేనేజర్‌గా, తౌసీఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం రాత్రి బీచ్ రోడ్డులోని ఒక రిసార్ట్‌లో బస చేసి, శనివారం ఉదయం రాయల్ […] The post ఇద్దరు టెక్కీలను బలిగొన్న రోడ్డు ప్రమాదం appeared first on Navatelangana.

మహబూబ్ నగర్: గద్వాల్ జిల్లా ఇటిక్యాల సమీపంలోని జాతీయ రహదారిపై కోదండాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వోల్వో బస్సు ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆరుగురికి తీవ్రంగా గాయపడగా ఒకరికి కాలు విరిగింది. మరికొంతమంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని బస్సులో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ సృష్టించింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా కేరళలో 15 రోజుల బ్రూటల్ యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. కేచా ఖంపక్దీ మాస్టర్ హై వోల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మిక తో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్ గా ఉండబోతుంది. ’మైసా’లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్ తో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరం. ఇందుకోసం రష్మిక అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకున్నారు.

అమరావతి: టిడిపి ఎంఎల్‌ఎ అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ సిబ్బందిపై దాడి చేయడంతో మహిళ ఉద్యోగి జట్టు పట్టుకొని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె- తిరుపతి జాతీయ రహదారిలోని గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టిడిపి ఎంఎల్‌ఎ అమిలినేని సురేంద్రబాబు తన అనుచరులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తిరుగుపయనమయ్యారు. గండబోయినపల్లె టోల్‌గేటు వద్దకు రాగానే టోల్ ఫీజు చెల్లించాలని ఎంఎల్‌ఎ అనుచరుల వాహనాలకు అడిగారు, వెంటనే కారులో నుంచి ఎంఎల్‌ఎ అనుచరులు, గన్‌మెన్ బయటకు దిగి టోల్ సిబ్బందిపై దాడి చేశారు. మహిళా సిబ్బంది జట్టు పట్టుకొని తీవ్రంగా కొట్టారు. మేనేజర్ రవిపై కూడా దాడి చేశారు. ఈ ఘటన సిసికెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టోల్ సిబ్బంది కారులో ఎక్కించుకొని వాల్సీకిపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎంఎల్‌ఎ అనుచరుల ఫిర్యాదు మేరకు సిఐ రాఘవ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ సమక్షంలో ఎంఎల్‌ఎ, అనుచరులు టోల్ ప్లాజా సిబ్బంది క్షమాపణలు చెప్పించుకున్నారు. ప్రభుత్వం ఏదైనా స్థాని

న్యూయార్క్: అమెరికా శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో దుండగులు కాల్పులు జరపడంతో వందలాది మంది అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు. కాల్పుల్లో ఓ అధికారికి గాయపడ్డారు. సీక్రెట్లు ఎజెంట్లు వెంటనే కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మొదటి మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా పలువురు కీలక నేతలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. భద్రతా సిబ్బంది అద్భుతంగా పని చేశారని కొనియాడారు. కాల్పుల సమయంలో అందరూ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. నిందితుడి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారని, నిందితుడు కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారన్నారు. ఇది అమెరికా రాజ్యాంగంపై దాడిగా భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అన్న కల సాకారం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ రాజకీయ శక్తులను బలహీనపరచడానికి, అంతం చేయడానికి ప్రయత్నిస్తుంటే శనివారంనాడు తెలంగాణలో ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ శక్తి అవతరించింది. అది కూడా ఒక మహిళ నాయకత్వంలో అవతరించడం విశేషం. పశ్చిమ బెంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన మహిళా నాయకురాలు మమతా బెనర్జీని రాజకీయంగా మట్టి కరిపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బెంగాల్ ఎన్నికలవేళ మహిళా బిల్లు ప్రహసనం పార్లమెంట్ ముందుకు తెచ్చింది కానీ బిజెపి రాజకీయాల్లో మహిళలకు నాయకత్వం ఇవ్వడాన్ని ఎప్పుడూ విశ్వసించదు. ఆ విధంగా కూడా ప్రస్తుతం తెలంగాణలో శనివారంనాడు ఏర్పాటైన కొత్త రాజకీయ పార్టీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి విడత ఉద్యమాన్ని ముందుకు ఉరికించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్‌ఎస్)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో 1969లో తొలి ఉద్యమంకోసం ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితినుండి శనివారంనాడు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేనను

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను భారీ ఎత్తున బదిలీ చేసింది. ఇందులో పలువురు కీలక శాఖలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ కుమార్‌ను డిల్లీలోని తెలంగాణ భవన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా బదిలీ చేసింది. అలాగే ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న దాన కిశోర్‌ను సంజయ్ కుమార్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్లూఎస్ శాఖలకు నియమించింది. హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న హరిచందనను దాన కిషోర్ నిర్వహిస్తున్న ఆర్ధిక శాఖకు కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇంటర్‌మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ ఆదిత్యను ఇండస్ట్రీస్, కామర్స్ శాఖల స్పెషల్ సెక్రటరీగా నియమించింది.రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల ఇంచార్జ్ కమిషనర్‌గా ఉన్న బి. విజేయంద్రను ఆదే శాఖకు కమీషనర్‌గా నియమించి పూర్తి బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న హనుమతు కొండిబా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిఇఓగా నియమించిం

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం ఐపిఎల్‌లో చోటు చేసుకున్న ‘చెంప దెబ్బ’ సంఘటనపై శ్రీశాంత్ నోరు విప్పాడు. హర్భజన్ సింగ్ ఈ సంఘటనను వ్యాపార లావాదేవిల కోసం వాడుకుంటున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. భజ్జీ తనపై చేసిన దాడిని సాకుగా చూపుతూ కోటి రూపాయల వరకు ఆదాయం గడించాడని విమర్శించాడు. ఓ టివి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘హర్భజన్ ఆనాటి చేదు ఘటనను మార్కెట్ చేసుకుంటున్నాడని, ఇటీవల భజ్జీ ఓ యాడ్ చేశాడని, ఆ యాడ్ ద్వారా రూ. కోటి సంపాదించాడన్నాడు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి, ప్రమోట్ చేయమని ఫోన్ చేశాడని, ఆ విషయం తనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందన్నాడు. నేను భజ్జీని క్షమించాను. కానీ, ఆ ఘటన నాకు ఎప్పటికి గుర్తుకొస్తూనే ఉందని తెలిపాడు శ్రీశాంత్.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలపడంతో వారిరువురికీ భారీ ఊరట లభించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి పంపించిన ఫైలుపై శనివారం గవర్నర్ శుక్లా సంతకం చేశారు. ఇక అధికారికంగా గెజిట్ విడుదల కావాల్సి ఉంది. గవర్నర్ కోటాలో మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే వీరిరువురిలో ప్రొఫెసర్ కోదండరామ్ కంటే కూడా అజహరుద్దీన్ అభ్యర్థిత్వంపైనే ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. అందుకు కారణం చట్ట సభలకు (ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ) ఎన్నిక కాకుండానే అజర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఆరు నెలల్లోగా ఆ చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలల్లోగా ఎన్నిక కాని పక్షంలో రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం ఆరు నెలల గడువు ముగియగానే సదరు మంత్రి ‘మాజీ’గా మారిపోతారు. అయితే అజర్ విషయంలో ఉత్కంఠ నెలకొనడానికి అదే ప్రధాన కారణం

మన తెలంగాణ/హైదరాబాద్: విక్రమ్-1 రాకెట్‌ను హైదరాబాద్‌లో డెవలప్ చేశారని, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్‌ను స్కైరూ ట్ హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని సిఎం రే వంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సంస్థ 2022లో తన తొ లి రాకెట్‌ను ప్రయోగించిందని, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవ డం హర్షణీయమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరా బాద్‌లోనే రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శ్రీహరికోటకు సిఎం రేవంత్ రె డ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తో కలిపి జెండా ఊపి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు తెలంగాణలో ఇ ప్పటికే ఉన్నాయన్నారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్నది తెలంగాణ లక్ష్యమని సిఎం రేవంత్ తెలిపారు. ఏరోస్పేస్ రంగాన్ని

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రా జకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’(టిఆర్‌ఎస్)గా నామకరణం చేశారు. ఈ మేరకు శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో వేదికగా ఉదయం 10 గంటలకు అభిమానుల కో లాహలం మధ్య పార్టీ కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్‌ఎస్) పార్టీని, పసుపు, నీలం రంగులో ఉన్న పార్టీ జెండాను ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని చెప్పారు. ఉద్యమకాలంలో ప్రజల కోసం పరితపించిన కెసిఆర్ ఇప్పుడు గుం టనక్కలు, తోడేళ్ల చేతిలో బంది అయ్యారని.. ఆయ న ఇప్పుడు మన కెసిఆర్ కాదు.. మరబొమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణాకు ఏదైనా జరిగితే ప్రా ణం పెట్టి పని చేసే పార్టీ కావాలని అందుకోసమే తాను టిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న

మన తెలంగాణ/సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తం గా జనాభా లెక్కల షెడ్యూల్‌ను సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హొళికేరి ప్రకటించా రు. తెలంగాణలో తొలిసారి, దేశంలో పదహారేండ్ల తర్వాత జనగణన జరుగుతున్నదని ఆమె వెల్లడించారు. జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు, డిజిటల్‌గా చేయడం చరిత్రాత్మకమని ఆమె పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ 26 నుంచి మే 11వ తేదీ వరకు స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను అమల్లోకి తీసుకువస్తున్నట్టు, అందులో 33 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, కులాల సమాచారానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబు తెలపాలని భారతి హొళికేరి తెలిపారు. ప్రతి ఒ క్కరూ తమ బాధ్యతగా జనగణనకు వివరా లు అందజేసి సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఒక రిజిష్టర్ మొబైల్ ద్వారా ఒకే కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని, ఒక కుటుంబ యజమాని పేరు ఒక్కసారే నమోదు చేయాలనీ, తప్పుడుగా నమోదు చేస్తే మార్చడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు అవసరం లేదు.. కుటుంబాల వివరాలు నమోదు చేసేటప్పుడు లేదా వివరాలను ఎన్యూమరేటర్‌కు తెలియజేసేటప్పుడు ఆ వివర
– గతేడాది తగ్గిన సిబ్బంది ఏఐ ప్రభావం..బెంగళూరు : భారత ఐటీ పరిశ్రమలో నియామకాలు అమాంతం పడిపోతున్నాయి. గడిచిన సంవత్సరం 2025-26లో దేశంలోని ఐదు ప్రధాన ఐటి కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను దాదాపు 7,000 మేర తగ్గించుకున్నాయి. గతంలో కేవలం ఉద్యోగుల సంఖ్య పెంచుకుంటూ పోయే స్కేల్ డ్రివెన్ వృద్ధి స్థానంలో ఇప్పుడు కంపెనీలు ఏఐ వినియోగం, పని సామర్థ్యాన్ని పెంచే ఎఫిషియెన్సీ ఫస్ట్ నమూనాకు ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీల వారీగా పరిశీలిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ […] The post ఐటీలో 7వేల ఉద్యోగాల కోత appeared first on Navatelangana.
చెన్నయ్ : మురుగప్ప గ్రూప్‌నకు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త ఎలక్ట్రిక్ ట్రక్ వాహనాలు ఏవియేటర్ 350, ఏవియేటర్ 350 ఎల్ప్లస్ను ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధరను రూ.14.58 లక్షలుగా నిర్ణయించింది. 65 లక్షల కిలోమీటర్ల ఫ్లీట్ డేటా ఆధారంగా రూపొందించిన ఈ వాహనాలు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తూ, వ్యాపారాల్లో కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయని ఎండీ జలజ్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. The post మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త ఎవియేటర్ ట్రక్కులు appeared first on Navatelangana.
ఆర్టీసీ సమ్మె విరమణపై కార్మికుల్లో చర్చోపచర్చలుముచ్చటగా మూడింటికి గ్రీన్‌సిగల్‌పెండింగ్ సమస్యలపై సోమవారం నుంచీ చర్చలు ?నెలరోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు శనివారం మళ్లీ రోడ్డెక్కాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కొంత సానుకూల వాతావరణం కనిపించడంతో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఈనెల 22న ప్రారంభమైన సమ్మె మూడు రోజుల్లోనే ముగియడంతో సాధారణ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లోని సుమారు 10 వేల బస్సులు సమ్మెలోకి వెళ్లాయి. […] The post మోదం…ఖేదం appeared first on Navatelangana.