21534 వార్తలు



అమరావతి: ఎపి విద్యాశాఖ మంత్రి అక్రమాలకు పాల్పడ్డారని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్ సి పరీక్షలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. జనరల్ గా స్పోర్ట్స్ కోటా 2 శాతం ఉండాలి, కానీ ఎపి మంత్రి లోకేష్ 3 శాతానికి పెంచారని స్పోర్ట్స్ కోటా వాళ్లు ఎగ్జామ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని జివో మార్చి ఇచ్చారని మండిపడ్డారు. జివోలు రద్దు చేయడం, మళ్లీ పాత జివోను పునరుదరుద్దరించడంపై సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. డిఎస్ సి ఎగ్జామ్ నిర్వాహణలో పాల్గొన్న వ్యక్తికి ర్యాంక్ వచ్చిందని మరి ఆయనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అంబటి ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ అయితే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అంబటి రాంబాబు చురకలంటించారు.







అమరావతి: నెల్లూరు జిల్లా సూరాయిపాలెం మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి బీభత్సం సృషించాడు. మద్యం దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నం చేశాడు. పొదలకూరు మండలం సూరాయిపాలెం మద్యం దుకాణం వద్ద రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిగరెట్ కాల్చుకునేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఆగ్రహం చెంది మద్యం దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సిద్ధపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిసిబ్బంది మంటలు ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరుతో డబ్బులు కూడా తీసుకున్నారని ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే వీడియోలు తీశాడని ఫిర్యాదులో పేర్కొంది. రేగా కాంతారావుపై పోలీసులు బిఎన్ఎస్ 69తో పాటు 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముంబయి: నాలుగంతస్తుల భవనం కూలిపోవడంతో 9 మంది చనిపోయిన సంఘటన మహారాష్ట్రలోని భివండీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరా లప్రకారం.... బాలాజీ నగర్ లోని కోహినూర్ నాలుగంతస్తుల భవనంలో 48 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోవడంతో 9 మంది చనిపోయారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. పది సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భవనాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు మున్సిపల్ అధికారులు అదేశాలు జారీ చేసినప్పటికి నివాసితులు పట్టించుకోలేదన్నారు. ఖాళీ చేయకుండానే అనధికారికంగా మరమ్మతులు చేపట్టారని వివరించారు. మృతులు ఎక్కువగా మరమ్మతులు చేపట్టేవారని పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.







కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో: కన్న తండ్రే రక్షణ ఇవ్వకపోతే ఇక ఈ సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడ దో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. కట్టుబాట్లను, మానవత్వ విలువలను కాలరాస్తూ సొంత ఇంట్లోనే ఇలాంటి అమానుషాలకు ఒడిగడుతుండటంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేసిన సం ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కేం ద్రంలో మైనర్ కూతురిపై పలుమార్లు లైంగికదాడి పాల్పడిన ఓ తండ్రిని గురువారం వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భా ర్యకు ముగ్గురు పిల్లలు. రెండో భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో చిన్న కూతురిపై కన్న తండ్రే కామాంధుడిగా మారి మైనర్ కూతురు అని చూడకుండా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డా డు. సదరు బాలిక హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నది. తండ్రి లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. తండ్రి మాటలకు భయపడిన బాల

అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని వైసిపి నేతలు కలుషితం చేయాలని చూస్తున్నారని టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డిది ఉదార్పు యాత్ర కాదు.. అరాచక యాత్ర చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు అరాచకం రాజ్యమేలిందని విమర్శించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మాధవ్ మంచి ఆలోచనలతో ముందుకెళ్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. సీదిరి కుమారుడిని తప్పించడానికి వేరేవారిని బలిచేస్తారా? అని ప్రమాదం తమరు చేసి.. ప్రభుత్వంపై నెట్టాలని చూస్తారా? అని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వంలో గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చారని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, కఠిన శిక్షలు ఉంటాయని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సమయంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని, రౌడీరాజకీయాలు చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.

టీం ఇండియా తరఫున ఎన్నో మరపురాని ప్రదర్శనలు చేసిన అజింక్యా రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు భవిష్యత్తులో మరింత ఆనందంగా ఉండాలని పలువురు క్రికెటర్లు.. అభిమానులు కోరుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీం ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సందర్భంగా రహానేపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘మేమిద్దరం చాలా ఏళ్లు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాం. రహానే ఎంత శ్రమిస్తాడో నాకు తెలుసు. నువ్వు సాధించిన ఘనతలు అద్భుతంగా నీ నిబద్ధత, వృత్తిపట్ల అంకితభావం ప్రత్యేకమైనది. వండర్‌ఫుల్ కెరీర్‌కు కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్’’ అంటూ రోహిత్ పోస్ట్ చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేను అభినందిస్తూ పోస్ట్ పెట్టాడు. ‘‘అజ్జు భాయ్.. నీతోపాటు మైదానం, డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎంతో గౌరవం. ప్రశాంతంగా ఉండే తీరు, ఆటపట్ల నిబద్ధత అద్భుతం. నిరంతరం మాకు స్పూర్తిగా నిలిచావు. సెండ్ ఇన్నింగ్స్ మరింత సంతోషకరంగా ఉండాలని.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని సూర్య పేర్కొన్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా రహానే గురించి సోషల్
