21546 వార్తలు



దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ వివాదం.. విద్యార్థుల నిరసనల నడుమ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో మోడీ తప్పుచేశారా? గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలో అతిపెద్ద పోటీ పరీక్షలలో అక్రమాలు జరగడం, దానిపై స్పందించడానికి సమయం పట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన, పరీక్షా వ్యవస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. జంతర్ మంతర్ వేదికగా సిజెపి, నిరసనకారులు చేపట్టిన ఉద్యమంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా అనేది అత్యంత కీలకమైన, రాజీలేని డిమాండ్ గా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, విద్యార్థుల సమస్యలపై ఊపందుకున్న ఈ ఉద్యమం స్వల్ప కాలంలోనే కేంద్ర నిర్ణయాలను ప్రభావితం చేయగలదని నిరూపించింది. పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా పెరిగిన అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ రాజీనామాను ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తొలుత ఉద్యమాన్ని లైట్ తీసుకుంది కేంద్రం. అయితే ఉద్యమం తీవ్రత గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి. అయితే నీట్ పరీక్ష లీక్ వివాదం, విచారణ జరుగుతున్న సమయంలోనే







తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన చోదకశక్తులుగా నిలిచాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దశాబ్దాలుగా తీరని పాలమూరు దాహార్తి తీరుతుందని, వలసల జిల్లా అనే ముద్ర శాశ్వతంగా చెరిగిపోతుందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కోటిఆశలతో ఎదురుచూశారు. కానీ, స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు గడిచినా ఉమ్మడి పాలమూరు పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ అన్న చందంగానే ఉంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత పాలకులు మారినా, పార్టీలు మారినా, మహబూబ్‌నగర్ జిల్లాపట్ల ప్రదర్శిస్తున్న అలసత్వం మాత్రం మారలేదు. జూరాల, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, ప్రతిష్టాత్మక పాలమూరు- రంగారెడ్డి వంటి ఎత్తిపోతల పథకాలు నేటికీ అరకొర పనులతో, అసంపూర్తి నిర్మాణాలతో వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఫలితంగా పచ్చని పొలాలుగా మారాల్సిన పాలమూరు నేలలు నేటికీ ఎండిపోతూనే ఉన్నాయి. బతుకుదెరువుకోసం గ్రామాలు ఖాళీచేసి దుబాయ్, ముంబై, హైదరాబాద్‌లకు పొట్టచేతపట్టుకుని వలసవెళ్లే రైతులు, కూలీల గుండెకోతలింకా ఆగిపోలేదు. నీటి పారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం, స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం జిల్లా ప్రయోజనాలకు తీవ్ర విఘ


ఒక వ్యాఖ్య దేశంలో చిచ్చురగిల్చింది. నిద్రాణమైన యువతను మేలుకొలిపింది. వారి చైతన్యానికి సవాల్ విసిరింది. వారి సహనానికి పరీక్ష పెట్టింది. వెరసి ఉవ్వెత్తున ఉద్యమ సెగలు లేవడానికి దోహదపడింది. పర్యవసానంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. యువత ఉద్యమానికి కేంద్రం దిగివచ్చింది పరీక్షల నిర్వహణ ప్రక్షాళనకు పూనుకొన్నది. మే నెల 15వ తేదీన భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విషయమై యువకులను (న్యాయవాదులను అని ఆయన ఉద్దేశం) ఉపాధి ఉద్యోగం లేని పరాన్న జీవులుగా, బొద్దింకలుగా అభివర్ణించారు. ఇది సహజంగానే యువతకు ఆగ్రహం కలిగించింది. తీవ్రంగా స్పందించిన అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఒక ఆన్‌లైన్ పార్టీ వెబ్‌సైట్ ప్రారంభించాడు. కొన్ని గంటలలోనే లక్షలు దాటి కోట్లకు చేరింది. దాని అభిమానుల సంఖ్య ఇంతింతై వటుడింతై అన్న రీతిలో దానికి స్పందన లభించింది జూన్ 15 కు అమెరికా నుండి జంతర్‌మంతర్ కేంద్రానికి చేరుకొని అభిజిత్ తన నిరసన ప్రారంభించాడు. నీట్ యుజి పరీక్ష నిర్వహణలో జరిగిన అవినీతి అవకతవకలకు వ్యతిరేకంగా. అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న నీట్ ఆశావహుల కుటుంబాలకు కో

గ్లాస్గో: స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అసాధారణ ఆటతో పతకాల పంట పండిస్తున్నారు. పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఓ స్వర్ణం మరో రజతం లభించింది. అంతేగాక పురుషుల లాంగ్ జంప్‌లో స్టార్ ఆటగాడు మురళీ శ్రీశంకర్ వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రాతో సహా మరో ఇద్దరు ఫైనల్‌కు చేరుకున్నారు. షాట్‌పుట్‌లో తజిందర్ పాల్ సింగ్, సమర్‌దీప్ సింగ్ గిల్‌లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. బాక్సింగ్‌లో భారత్‌కు ఇప్పటికే ఆరు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల 100 మీటర్ల టి47 విభాగంలో పారా అథ్లెట్లు దిలీప్ మహాదు గావిత్, మహ్మద్ బాసిల్ అసాధారణ ఆటతో అదరగొట్టి స్వర్ణ, రజత పతకాలను సొంతం చేసుకున్నారు. దిలీప్ గావిత్, బాసిల్ అద్భుత ప్రతిభతో అదరగొట్టారు. దిలీప్ 10.71 సెకన్లలోనే రేసును పూర్తి చేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బాసిల్ 10.83 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం దక్కించుకున్నాడు. ఒకే విభాగంలో ఇద్దరు భారత అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారు. గావిత్ సాధించిన పతకంతో ఈ క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య మూడుకు చేరింది. ఇంతకుము

అమరావతి: భిక్షాటన చేసుకునే బాలికకు మాయమాటలు చెప్పి అనంతరం ఆమెను ఆటో డ్రైవర్ లొంగదీసుకున్నాడు. అనంతరం బాలిక పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమెను చంపేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని మాధవధార జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారు..... కంచర పాలెం మండలంలోని దుర్గానగర్‌లో బొలిశెట్టి సురేష్(32) ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఓ బాలిక భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. బాలికను సురేష్ పరిచయం చేసుకొని మాయమాటలతో లొంగదీసుకున్నాడు. అనంతరం గర్భిణీకి సాయంగా ఉండేందుకు సదరు బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. మార్చి 24న సురేష్‌కు పాప పుట్టింది. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక బలవంతం పెట్టడంతో పాటు ఇంటికొచ్చి గొడవకు దిగింది. దీంతో ఆమె తలపై పదునైను ఆయుధంతో కొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకొని జ్ఞానాపురం రైల్వే స్టేషన్ లో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఒడిశాలోని రాయగడ ప్రాంతంలోని చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ట్రాలీ బ్యాగ్‌ను పడేసి సొంతూరు వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో స్థానికుల సమాచార

అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా.. విడుదలైన 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్‌చేసి, అందరినీ లాభాల బాట పట్టించింది. తాజాగా ఈ మైల్‌స్టోన్ క్లబ్‌లో చేరింది. ‘లెనిన్’ సినిమా జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజే రూ.16.7 కోట్ల భారీ గ్రాస్ రాబట్టింది. మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.67.2 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. 10 రోజుల్లో రూ.88 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. 20 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇక అఖిల్ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు




దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ’ఐ యామ్ గేమ్’ ట్రైలర్ విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. “ఐయామ్ గేమ్ ట్రైలర్‌లోని ఆ ఫైరీ వైబ్ నాకు బాగా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది. నా సోదరుడు దుల్కర్ మరో స్పెషల్ మూవీతో వస్తున్నారని నమ్మకం కలిగింది. తనకి మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతనితో పాటు మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు”అని ట్వీట్ చేశారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 20న ఓణం కానుకగా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ వేఫేరర్ ఫిలమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మ



