22473 వార్తలు




హైదరాబాద్: విద్యా వ్యవస్థలో పారదర్శకత వచ్చేవరకు తాము పోరాటం చేస్తామని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇది ముగింపు కాదు అని కేవలం ప్రారంభమేనని, ఇంకా చాలా పెద్ద ప్రయాణం ఉందని ప్రభుత్వాలకు హెచ్చరకలు పంపారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో 37 రోజుల నుంచి జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, మేధావులు, సిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో నిరసన విరమించారు. ఈ సందర్భంగా తన ఎక్స్‌లో అభిజీత్ దీప్కే వీడియోను విడుదల చేశారు. దేశం కోసం మీరు చేసి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనని స్పష్టం చేశారు. మీ అందరి మద్దతుతోనే ఈ ఉద్యమం సక్సెస్ అయ్యిందని ప్రశంసించారు. తమను విమర్శించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని, విమర్శకుల వల్లే తాము ఇంకా మెరుగ్గా పని చేశామని పేర్కొన్నారు. గత 37 రోజుల నుంచి కంటి మీద నిద్ర లేకుండా ధర్నాలు చేస్తున్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉండేదని, గత రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృద

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి బస్సును ఓవర్ టేక్ చేయడంతో బస్సు టైర్ వెనుక కూర్చున్న యువతి కిందపడి మృతి చెందింది. హైదరాబాద్ నుంచి జెపి దర్గాకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్: నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారని రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డా సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ మీడియాతో మాట్లడారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఇంట్లో గుండెపోటుతో కిందపడిపోయారని, వెంటనే అతడిని రోహిణి ఆస్పత్రి తీసుకొచ్చారని పేర్కొన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి తరలిస్తామని వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని కోరారు.



జింబాబ్వేతో జరిగిన రెండో టి-20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే యువ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మైదానం బయట విమర్శల నుంచి వైభవ్‌ను ఎలా కాపాడుకోవాలో టీం ఇండియా వద్ద స్పష్టమైన ప్లాన్ ఉందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. నిన్నటి మ్యాచ్ అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ చాలా స్మార్ట్. ఏం చేస్తున్నాడు, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ఉండాలి అన్న విషయం అతడికి స్పష్టంగా తెలుసు. అతడికి బయట మిత్ర బృందంలో ఆట మీది నుంచి దృష్టి మళ్లించే చాలా అంశాలు ఉండొచ్చు. నేను అటువంటి నేపథ్యం నుంచే వచ్చాను. క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఏ సమయంలో వేటిపై దృష్టి ఉంచాలో తెలియాలి. ఈ విషయంలో నేను వైభవ్‌కు సాయపడతాను. అంతేకాదు.. జట్టులో అభిషేక్, అక్షర్, చాలా మంది ఇతర ఆటగాళ్లు కూడా అతడికి అండగా ఉంటారు. అతడు వీలైనంత క్రికెట్ గురించే ఆలోచించేలా చేస్తాం. సోషల్‌మీడియా, బయట నుంచి వచ్చే విమర్శలు వంటి వాటి ప్రభావానికి లోను కాకుండా తక్కువ స్కోర్ చేసినప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ మారకుండా చూసుకొంటాము. అతడిలాంటి బ్యాటర్ పవర్ ప్లేలోని తొలి ఆర



లద్దాఖ్: భారత్ యుద్ధనౌకలను రూపకల్పన చేస్తోంది: రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ మాత్రం చొరబాటుకు కొత్త మార్గాలను వెతుకుతోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తోందని అన్నారు. కార్గిల్ అమరవీరులకు సైన్యం ఘననివాళి అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా ద్రాస్ సెక్టార్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ యుద్ధనౌకలను రూపకల్పన చేస్తోందని, పాకిస్థాన్ ఉగ్రవాదానికి రూపకల్పన చేయడంలో నిమగ్నమై ఉందని తెలియజేశారు. భారత్ స్టార్టప్ వ్యవస్థను సృష్టిస్తుంటే, పాకిస్థాన్ ఉగ్రవాద వ్యవస్థను సృష్టిస్తోందని, భారత్ సెమీకండక్టర్లను తయారు చేస్తోందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆత్మాహుతి దళాలను ఉత్పత్తి చేస్తోందని, భారత్ అంతరిక్ష యాత్రలకు ప్రసిద్ధి చెందితే.. పాకిస్థాన్ ప్రాక్సీ మిషన్లను నిర్వహిస్తోందని అన్నారు. భారత్ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తోందని, పాకిస్థాన్ సరిహద్దు అవతలకు ఉగ్రవాదులను పంపడంలోనే నిమగ్నమైందని చెప్పారు. భారత్ డేటా సెంటర్ లను నిర్మిస్తుంటే..పాకిస్థాన్ రాడికలైజేషన్ కేంద్రాలు నిర్మిస్తోందని, భారత్ యూపిఐ ద్వారా ప్రపంచాన్ని అనుసంధానిస్తోందన


హైదరాబాద్: మహానగరంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ టవర్స్’ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశముందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ విసి సజ్జనార్, ఐపిఎస్ హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి రూ.10,000 ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) చెల్లించే ప్రక్రియ ప్రారంభం కావడంతో, సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింకులతో బురిడీ కొట్టించే ప్రమాదముందని ఆయన సూచించారు. ఈ పథకంలో ఎలాంటి దళారులు లేదా మధ్యవర్తులకు తావులేదని, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం చెల్లించిన ఈఎండి సొమ్ము భద్రంగా ఉంటుందని, ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి ఒరిజినల్ బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుందని వివరించారు. "డబ్బులు చెల్లిస్తే ఇల్లు కచ్చితంగా ఇప్పిస్తాం" అని నమ్మించే వారి మాటలు నమ్మవద్దని హెచ్చరించారు. "ఈ రోజే ఆఖరు తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుంది" అని భయపెట్టి, తొందరపాటులో నగదు బదిలీ చేయించుకోవడం నేరగాళ్ల ప్రధాన ఎత్తుగడ అని సజ్జనార్ తెలియజేశారు.వాట్సాప్ లేదా మెసేజ్‌ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను నమ్మ







నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున పెద్ది సుదర్శన్ గుండెపోటు తో చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరణ వార్త తెలిసిన వెంటనే కెటిఆర్ వరంగల్ కు ప్రయాణమయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎల్ఎగా గెలిచారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా సేవలందించారు. వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో 1974 ఆగస్టు 6న రాజిరెడ్డి అమృతమ్మ అనే దంపతులకు సుదర్శన్ జన్మించారు. 1991లో వరంగల్ లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారం

మేషంమేష రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగాలపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ వీరికి లభిస్తాయి. వ్యాపార పరంగా చేసేటువంటి నూతన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మాతృ వర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. ఎంత కష్టపడినా ఫలితం అంతంతమాత్రంగా ఉంటుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో గోపిక పాటించండి. అందరిని నమ్మి అని చెప్పవద్దు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. సౌర కంకణం చేతికి ధరించండి. ఈ రాశి వారికి కలసి వచ్చి సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.వృషభంవృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి ధనం చేతికందుతుంది. వ్యాపార రంగంలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఫార్మా రంగంలోని వారికి అనుకూ

న్యూఢిల్లీ: వరల్డ్ జూనియర్ స్వ్కాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యంగ్ ప్లేయర్ అనహత్ సింగ్ సంచలనం సృష్టించింది. అద్భుత ఆటతీరుతో ఫైనల్‌కు చేరిన అనహత్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో ఈజిప్ట్‌కు చెందిన బార్బ్ సమేహ్‌ను వరుసగా నాలుగు గేమ్స్‌లలో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో అనహత్.. బార్బ్ సమేహ్‌పై 11-3, 8-11, 11-4, 11-6 తేడాతో గెలుపొంది టైటిల్ పోరు అర్హత సాధించింది. ఇక తొలి గేమ్‌ను 11-3తో సునయాసంగా గెలిచిన అనహత్‌కు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. ఈ గేమ్‌లో 11-8తో చేజార్చుకుంది. అనంరతం చెలరేగిన అనహత్ వరుసగా రెండు గేముల్లో ఆదిపత్యం చెలాయించి.. 11-4, 11-6తో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది.