22657 వార్తలు


కొచి : కొచ్చి కేంద్రంగా ఉన్న సిఎంఆర్‌ఎల్ (కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ )కు వ్యతిరేకంగా నమోదైన మనీలాండరింగ్ కేసులో కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఎన్ శశిధరన్ కర్తా కేరళ మాజీ సిఎం పినరయి విజయన్ కుమార్తె వీణా టికి అక్రమంగా నిధులు చెల్లించినట్టు అంగీకరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను శనివారం న్యాయనిర్ణయాధికార సంస్థకు సమర్పించింది. నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ తన నివేదికలో కోరింది. మాజీ సిఎం పినరయి విజయన్‌తో ఆమెకున్న వ్యక్తిగత సంబంధం వల్లనే ఈ చెల్లింపులు జరిగినట్టు మాజీ ఎండీ అంగీకరించారని పేర్కొంది. సిఎంఆర్‌ఎల్ అక్రమ లావాదేవీల్లో వీణా టి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి.మాజీ సిఎం పినరపి విజయన్ కుమార్తె వీణాకు, సిఎంఆర్‌ఎల్‌కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. విజయన్ కుమార్తె వీణా టి ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు సిఎంఆర్‌ఎల్ సంస్థ ఎలాంటి సేవలు అందించకుండానే దాదాపు రూ. 2.78 కోట్ల మొత్తం ముందస్తు చెల్

లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్ ఈ ఫీజును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన అప్పీల్స్ కోర్టు సాధారణంగా 5000 డాలర్ల లోపు ఉండే ఫీజును లక్షడాలర్లకు పెంచడంపై తీవ్ర వ్యతిరేకత వాషింగ్టన్: అమెరికాలో పనిచేయాలనుకున్న విదేశీ నిపుణులకు, వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. కొత్తగా జారీ చేసే హెచ్1బీ వీసాలపై 100,000 డాలర్ల (సుమారు రూ. 96 లక్షలు) భారీ ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ ఫీజు వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన అప్పీల్‌ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్1బి వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజును విధిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన దిగువ కోర్టు, అమెరికా కాంగ్రెస్ ఎలాంటి అధికారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని, ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్



వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. చర్చల అంశాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తున్నందున ఆ దేశంపై భీకర దాడులు విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. “ప్రస్తుతం మేం వారితో చర్చలు జరుపుతున్నాం. చర్చలను వారు సీరియస్‌గా తీసుకుంటున్నారు. అందుకు కారణం ఉండొచ్చు. వారు లొంగిపోవచ్చు. లేదా ఏదైనా గుహ లోకి వెళ్లి దాక్కోవచ్చు. మా వైపు నుంచి క్షిపణులు లోడ్ చేసే ఉన్నాయి. యుద్ధం ముగించడానికి రెండు అవకాశాలున్నాయి. ఇప్పుడు చేస్తోన్న దాడుల తీవ్రత పెంచి, వాళ్ల దగ్గర ఉన్నదంతా నాశనం చేయొచ్చు. లేకపోతే ఒప్పందం చేసుకోవచ్చు. డీల్ చేసుకోవడమనేది తెలివైన వ్యూహం. చర్చల విషయంలోవారు సీరియస్‌గా ఉన్నంత మాత్రాన ఒప్పందం కుదురుతుందని చెప్పలేం. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి” అని పేర్కొన్నారు.కాగా.. ఇరాన్‌పై భీకర దాడుల్ని పరిశీలిస్తున్నామని, దానిపై నిర్ణయం తీసుకుంటామని ముందురోజు ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఇరాన్ నుంచి కౌంటర్ వచ్చింది. అమెరికా బెదిరింపులకు తలొగ్గబోమని, బలప్రయోగం , ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించబోమని



ఇద్దరు పోలీసులకు గాయాలుటియర్ గ్యాస్, స్పల్ప లాఠీచార్జి ప్రయోగించిన పోలీసులు అదనపు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపు న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తెంది. కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. స్వల్పంగా లాఠీచార్జి జరిపారు. అదనపు బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ముంబై : మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఈటీ) ప్రశ్నాపత్రం లీక్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి బిజేంద్ర గుప్తా బీహార్‌లో అరెస్ట్ అయ్యాడు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతడు బీహార్‌లో ఉన్నట్టు తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. బిజేంద్ర గుప్తా, అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై మహారాష్ట్రకు తీసుకువచ్చి టెట్ పేపర్ లీక్ నెట్‌వర్క్, ఇలాంటి కేసుల్లో అతడి ప్రమేయాన్ని ప్రశ్నించనున్నారు. దేశ వ్యాప్తంగా ఇతర పరీక్ష పత్రాల లీక్ సిండికేట్‌లతో బిజేంద్ర గుప్తాకు ఉన్న సంబంధాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. టెట్ పేపర్ లీక్ కేసులో బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గుప్తా, అతడి అనుచరుడి అరెస్టుతో ఈ సంఖ్య 14కు చేరింది.

కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆకతాయి చేసిన పనికి అమ్మాయి దీటుగా బదులిచ్చారు. హెబ్బల్ నుంచి మాన్యతాకు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా వెంటనే స్పందించి అతడిని నిలదీసింది. అంతేకాకుండా బస్సులోని ఇతర ప్రయాణికుల ముందే అతడిని చితకబాది తన ధైర్యాన్ని చాటుకుంది. ఈ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపేసి ఆకతాయికి తగిన బుద్ధి చెప్పారు. బస్సులో ఆ యువతి సదరు వేధింపుల వ్యక్తిని కొడుతున్న దృశ్యాలను తోటి ప్రయాణికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికుల సమాచారం మేరక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.



న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఢిల్లీకి రావాలన మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. కీలక నేతలకు హైకమాండ్ పిలుపు రావడంతో రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్నది. కేబినెట్‌లో భారీ మార్పులకు కేంద్రం సిద్ధమవుతుందన్న ఊహాగానాలు వ్యాపించాయి. ఫడ్నవీస్‌కు కేంద్రంలో విద్యా శాఖను అప్పగించవచ్చునని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర కేబినెట్ మార్పులు చేర్పులు జరగవచ్చునని గత కొంతకాలంగా రాజకీయ వర్గాలలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. మంత్రులలో కొందరికి ఉద్వాసన పలికి, కొత్తగా మరికొందరికి అవకాశాలు ఇవ్వాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ప్రధాన్ రాజీనామాతో మార్పులు అనివార్యంగా మారింది.

ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గ్రామీణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. వాలీబాల్, త్రోబాల్ తదితర క్రీడల్లో అనేక గ్రామాల జట్లు పోటీపడి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. గ్రామీణ ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక దృఢత్వం, జట్టుగా పనిచేసే నైపుణ్యం, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే ఇషా గ్రామోత్సవం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇషా ఫౌండేషన్ వాలంటీర్లు విశేష కృషితో పోటీల నిర్వహించి, క్రీడాకారులను ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఈ ఏడాది గ్రామోత్సవంలో తొలిసారిగా మహిళల జట్టు పాల్గొనడం విశేషమన్నారు. అత్యంత ఉత్సాహం, పట్టుదలతో పోటీపడిన ఆ జట్టు రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుందని తెలిపారు. వారి విజయం గ్రామీణ మహిళలు, యువతులు క్రీడల వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నిర్వాహకులు కొనియాడారు.***


న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నీట్ (యూజీ) పరీక్షలో జరిగిన అవకతవకల కారణంగా సిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర రాజీనామాతోపాటు, మరో రెండు డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు జెపి నడ్డా, జితేంద్ర సింగ్ ల పిలుపు మేరకు సీజేపీతో ప్రతినిధులు వారితో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిజెపి ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రధానంగా మూడు డిమాండ్లపై కేంద్రంతో చర్చించామని... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని తెలిపారు. ఢిల్లీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. నిరసనకారులపై భవిష్యత్తులోనూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చిందని తెలిపారు.ఇక, ఆత్మహత్య చేసుకుని మరణించిన

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(8) మరోసారి విఫలమయ్యాడు. ఇక, వైభవ్ సూర్యవంశీ తనదైన స్టైల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25) వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, ఇషాన్ కిషన్(81, 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ(60 నాటౌట్, 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగారు. దీంతో జింబాబ్వేకు టీమిండియా 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, బ్రాడ్ ఎవాన్స్ బ్రయాన్ బెన్నెట్, న్యూమన్, నగరవ తలో వికెట్ పడగొట్టారు.జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారీ స్కోరు చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసిన టీమ్ఇండియా ఇషాన్ కిషన్ (81; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (60*; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరిశ




