24152 వార్తలు


న్యూఢిల్లీ: విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, విద్యార్థుల సమస్యపై చర్చ జరిపేందుకు తాను ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఉదయం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతి కోరగా, ప్రభుత్వం అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పారని రాహుల్ వెల్లడించారు. పార్లమెంట్‌లో చర్చ జరపాలంటే కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పడం ఆశ్చర్యకరం అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం భారతీయ విలువలకు విరుద్ధమని రాహుల్ విమర్శించారు. నిన్న జరిగిన ఘటనపై ప్రధాని ఇప్పటివరకు ఒక్క క్షమాపణ కూడా చెప్పలేదు. విద్యార్థులను ఈ విధంగా కొట్టించడం పూర్తిగా తప్పు అని అన్నారు.దేశంలో విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షల నిర్వహణ పూర




బిజెపి రాష్ట్ర ముఖ్య నేతలతో మంతనాలుమన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్నప్పటికీ, బిజెపి రాష్ట్ర నాయకులు అప్రమత్తమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఏమిటీ ?, పార్టీ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి ? వంటి ప్రశ్నలను కేంద్ర మంత్రి అమిత్ షా కురిపిస్తే, వాటికి సరైన సమాధానం చెబుతూనే లిఖితపూర్వకంగా ఓ నివేదిక ఇచ్చేందుకు ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 26న అమిత్ షా మధ్యాహ్నం 12.45 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి 1.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బిఎస్‌ఎఫ్‌కు చెందిన హెలికాప్టర్‌లో కరీంనగర్ చేరుకుని, అక్కడ ప్రతిమా విద్యా సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి 3.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం లాంజ్‌లో బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులతో కొంత సేపు మంతనాలు జరుపుతారు. అక్

రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన నిరాహార దీక్షకు సంబంధించి ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన మంగళవారం విచారించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీసుకున్న చర్యలను, కేసులో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. దీంతో సీసీ నెం.308/2024లో సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణకు ముగింపు పలికింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే 2021 ఏప్రిల్ 26న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ పథకంలో కొవిడ్ చికిత్సను చేర్చాలని కోరుతూ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకోలేదని, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ గాంధీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 269, 270తో పాటు విపత్తు నిర్వహణ చ

ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన బొగత జలపాతం మళ్లీ సవ్వడులు చేస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో దట్టమైన పచ్చ-దనం మధ్య వెలసిన ఈ జలపాతం, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలకళను సంతరించుకుని నిండుగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న అటవీ ప్రాంతాల నుంచి ఇసుకవాగు ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో, కొండకోనల గుండా నీరు నుర-గలు కక్కుతూ పాలధారలా కిందకు దుముకుతోంది. కొండల మధ్య హోరెత్తుతున్న జలపాత దృశ్యాలు పర్యాటకులను మంత్రము-గ్ధులను చేస్తున్నాయి. ‘తెలంగాణ నయాగార’గా పిలువబడే బొగత జలపాతం రూపురేఖలు వర్షాకాలంలో మరింత సుందరంగా మారడంతో, ఈ జలపాత సౌందర్యాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. భారీగా నీటి ప్రవాహం పెరగడంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు చేరుకొని వీకెండ్ మూడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఉప్పొంగుతున్న జలపాత దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. వర్షాల కారణంగా జలపాతం వద్ద నీటి ఉధృతి, ప్రవాహం తీవ్రంగ

నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీమణి గీత, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌గౌడ్ హాజరయ్యారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... అమ్మవారి దయ వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని మంత్రి సురేఖ అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ సిబ్బంది ప్రతేక క్యూలైన్లు ఏర్పాటుచేయడంతో భక్తులు అమ్మవారిని సులభంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, సుస్మిత పటేల్ త

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని రుజువు చేస్తున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాహభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు అండ్ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతి అని తెలంగాణ ఇచ్చిన జాతి అని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఇచ్చిన తెలంగాణను అందరూ మెచ్చే తెలంగాణగా తీర్చిదిద్దుతున్న జాతి తమదని మంత్రి వాకిటి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి అని తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి తమేదనని ఆయన చెప్పారు. తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టడంతో పాటు తెలంగాణ భవిష్యత్ తరాలకు బాసటగా నిలిచామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఎక్కుపెట్టిన తుపాకికి ఎదురుగా నిలబడ్డ ఉద్యమకారుల వెనుక దాక్కున పిరికిపందల జాతి మీదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంటల మీద చలికాచుకున్నది మీరని ఆయన ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల సమాధుల మీద గడీలు కట్టుకున్న నికృష్టపు జాతి ఎవరిదో ప్రజలకు తెలుసని



న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి భంగం వాటిల్లనివ్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మంగళవారం ఎన్డీయే నిర్వహించిన 'మంగళ్ మిషన్' సమావేశం అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నీట్ వివాదం, భారతదేశ ఆర్థిక పురోగతి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పట్ల ప్రభుత్వ విధానం వంటి పలు అంశాలపై ప్రధాని మోడీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించాని ఆయన చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు పరీక్షా విధానంలో జవాబుదారీతనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. "విద్యార్థుల భవిష్యత్తుకు హాని కలిగించే ఏ విషయాన్నీ ప్రభుత్వం సహించదని ప్రధాని అన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలకు బాధ్యులుగా తేలిన వారికి కఠిన శిక్షలు తప్పవని.. వారిని జైలుకు పంపిస్తామని ప్రధాని చెప్పారు" అని కిరణ్ రిజిజు తెలిపారు.

న్యూఢిల్లీ: యువత ఛలో పార్లమెంటు నిరసనపై పోలీసు చర్యను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. విద్యార్థులకు మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు పార్లమెంటు కాంప్లెక్స్ వైపు సోమవారం దూసుకెళ్లడంతో పోలీసులు బాష్పవాయువు, లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దమనకాండలో పలువురు విద్యార్థులు గాయపడ్డారని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. షబానా అజ్మీ, ప్రకాశ్ రాజ్ వంటి పలువురు సినీ సెలబ్రెటీలు సైతం విద్యార్థులకు మద్దతు తెలిపారు. విద్యార్థులపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించి ఉండాల్సింది కాదని నటుడు, గాయకుడు దిల్జీజ్ దోసాంజ్ అమెరికా నుంచి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. విద్యార్థుల డిమాండ్లను ఓపిగ్గా వినాలని కోరారు. తనపై కూడా పలువురు జాతివ్యతిరేకిగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జిని నటుడు, కమెడియన్ వీర్‌దాస్ ఖండించారు. విద్యార్థులకు మద్దతివ్వకుండా వారి సమస్యలపై మౌనం వహించే తోటి కళాకారుల తీరును కపటత్వంగా అభివర్ణించారు. దేశంలో లైవ్ ఎంటర్‌టైన్మెంట్, కాన్సర్ట్ ఇండస్ట్రీ దాదాపు

సినిమా షూటింగ్ లో నటుడు నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ప్రస్తుతం బాలయ్య, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మూవీలో నటిస్తున్నాడు. కాకినాడలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణ సమయంలో కాలు జారీ కిందపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మోకాలికి స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జూనీయర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్పందించారు. "బాలా బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి గర్జించాలని అభిలషిస్తున్నా" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నా" అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.







