19793 వార్తలు






ప్రతి సంవత్సరం ఆగస్టు 3ను భారతదేశంలో జాతీయ హృదయ మార్పిడి దినోత్సవంగా పాటిస్తారు. ఈ రోజు ఉద్దేశ్యం అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా గుండె దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చనే అవగాహన కల్పించడం.గుండె వైఫల్యం చివరి దశకు చేరుకున్న రోగులకు మందులు, యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ శస్త్రచికిత్సలు కూడా ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే ప్రాణాలను కాపాడే మార్గంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు మరణం చెందిన దాత గుండెను సరైన రోగికి మార్పిడి చేయడం ద్వారా అతనికి కొత్త జీవితం అందించవచ్చు. భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం కలిగిన కార్డియాక్ సర్జన్లు, సమర్థవంతమైన అవయవ రవాణా వ్యవస్థ వల్ల ఈ చికిత్స విజయవంతంగా జరుగుతోంది. అయినప్పటికీ, మన దేశంలో అవయవదానం చేసే వారి సంఖ్య ఇంకా అవసరానికి చాలా తక్కువగా ఉంది. ఫలితంగా అనేక మంది రోగులు సరైన సమయంలో గుండె దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదానంలో అత్యంత కీలకమైన అంశం బ్రెయిన్ డెత్‌ను గుర్తించడం, కుటుం

బెంగళూరు: చిప్స్ ప్యాకెట్ లోని చిన్న బంతి బాలుడి ప్రాణం తీసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణసూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గౌరీపుర గ్రామంలో సంతోష్, ఐశ్వర్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మయూర్(3) అనే బాలుడు ఉన్నాడు. ఇంటికొచ్చిన బంధువులలో ఒకరు మయూర్ కు చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడు. చిప్స్ తింటుండగా ప్యాకెట్ లో ఉన్న బంతి నోట్లో పెట్టుకున్నాడు. బంతి గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. చిప్స్ ప్యాకెట్ చిన్నారి ప్రాణం తీసిందని బంధువులు రోదిస్తున్నారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.












మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లష్కర్ బోనాల జాతరలో భాగంగా ఆలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని,మొక్కులు చెల్లించుకున్నారు.తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం నివాసంలో బోనాల విందుకు సిఎం సికింద్ర

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌తో పాటు ఇతర అం డర్‌గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 202627 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది.ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అఖిల భారత కోటా పరిధిలోని డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు జరుగుతుంది. ఈ విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 22లోగా కళాశాలల్లో చేరాలి. రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు, మూ డో విడత సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. ఖాళీగా మిగిలిన సీట్ల కోసం ప్రత్యేక (స్ట్రే వెకెన్సీ) విడతను సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనుండగా, అందులో ఎంపికైన వారు అక్టోబర్ 10లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటా సీట్లకు తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 28లోగా చేరాలి. రెండో విడత ఆగస్టు 31

మన తెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద సందిగ్ధానికి అధిష్టానం తెరదించింది. పార్టీలో కొత్త, పాతవారిని కలుపుకొని పోయేలా మధ్యేమార్గంగా అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఫార్మూలా ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఇక నుం చి నామినేటెడ్ పోస్టుల నియామకంలో పాత వారికి 60శాతం, కొత్తవారికి 40తం పదవు లు దక్కేలా ఎంపిక జరగాలని ఇటీవల ఢిల్లీ లో సమావేశమైన రాష్ట్ర సమన్వయ కమిటీకి అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. శాసనసభ ఎన్నికల సందర్భంగా, అలాగే అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి లో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో పాత వా రికి కాకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారి కే పదవులు దక్కుతున్నాయన్న విమర్శలు దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఉత్పన్నం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు చెం దిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కం డువా కప్పుకున్నారు. వీరిలో పటాన్‌చెరు ఎ మ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మినహా మిగతా తొమ్మిది ఎమ్మెల్యేలు సాంకేతికంగా కాకపోయినప్పటికీ అనధికారికంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నార

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్స్ రివిజన్(సర్) ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల పరిశీలన, డిజిటైజేషన్ ప్రక్రియ డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను ఏరివేసేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఈ తొలగింపుల ప్రక్రియ భవిష్యత్తు ఎన్నికల్లో తమ గెలుపోటములను ఎలా ప్రభావితం చే స్తుందో అని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లు ఉండగా, అందులో ఇప్పటివరకు సుమారు 80శాతం మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. కాగా, మొత్తం ఓటర్లలో 50 లక్షల నుంచి కోటి వరకు ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను తొలగించడం, మరణించిన వారిని ఓట్లు తొలగించడంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ అర్హులైన వారి ఓట్లు తొలగిస్తారనే అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు అర్హులైన ఓట్లు తొలగిస్తారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటరు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యూరి యా ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమై న మేరకు నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్య వసాయ శాఖ ఆదివారం బులిటెన్‌లో వెల్లడించిం ది. యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 73.99 లక్షల బ స్తాల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వీటిలో మార్క్‌ఫెడ్ గిడ్డంగుల్లో 52.35 లక్ష ల బస్తాలు, రిటైలర్ల వద్ద 13.99 లక్షల బస్తాలు, సహకార సంఘాల వద్ద 5.49 లక్షల బస్తాలు, ఇ తర గిడ్డంగుల్లో 2.16 లక్షల బస్తాలు నిల్వగా ఉ న్నాయని వివరించింది. యూరియా బుకింగ్ యా ప్ ద్వారా ఇప్పటివరకు 28.71 లక్షల మంది రై తులు నమోదు చేసుకుని ఎరువులను బుక్ చేసుకున్నారని, మొత్తం 110.77 లక్షల బస్తాల యూ రియా బుక్ కాగా, అందులో 99.04 లక్షల బస్తా లు ఇప్పటికే కొనుగోలు చేశారని, దీంతో యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాలో 89.42 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని పేర్కొంది. యూరి యా బుకింగ్ యాప్ ద్వారా రైతులు ముందుగానే బుకింగ్ చేసుకుని సమీప విక్రయ కేంద్రాల్లో ఎరువులు పొందే అవకాశం కల్పించడంతో పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. రైతులు క్యూలో నిలబడాల్స