24331 వార్తలు



మన భారతీయ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక పోషకాలు, ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రతిరోజూ పరిమిత మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఎముకలు, గుండె, చర్మం ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి రోజు పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పెరుగులోని మంచి బ్యాక్టీరియా శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి: కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండే పెరుగు ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలు, వృద్ధులు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. బరువు నియంత్రణకు సహకారం: ప్రోటీన్ అధికంగా ఉండే పెరుగు ఎక్క

ఢిల్లీ: నెల రోజులుగా భారత్ అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రాష్ట్రీయ, జాతీయ, అంతరిక్ష రంగాల్లో భారత్ గర్వించదగిన క్షణాలు అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడుతూ.. కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, నెల రోజులుగా అనేక పరిణామాలు జరిగాయని తెలియజేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని, రెండ్రోజుల క్రితం ప్రయోగం ద్వారా ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన నిలిచామని అన్నారు. భారత యువత అంతరిక్షంలో తమదైన ముద్ర వేశారని మోడీ కొనియాడారు. ఈ వర్షాకాల సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాలని అందరం ప్రార్థిద్దామని, గతేడాది ఇదే సమాయానికి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నామని, ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ ను రోదసీలో విజయవంతంగా ప్రవేశపెట్టారని మోడీ పేర్కొన్నారు.



హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో కిలో బంగారం మాయమైంది. 1028.59 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 7 నెక్లెస్లు, 7 జతల చెవిపోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్‌లో భద్రపరిచిన ఆభరణాలు మాయమయ్యాయి. వాష్‌రూమ్ కిటికీ ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన వ్యాపారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట ‘ఇంత ఇష్టమా’ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ లవ్ మెలోడీ హీరో చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతకు హీరోయిన్ మైమరచిపోయి అతనిపై ప్రేమను పెంచుకునే భావోద్వేగాలను అందంగా చూపించారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ఈ లవ్ సాంగ్ మరింత అందాన్ని తీసుకురాగా, రామ్ మిర్యాల, లిప్సిక గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ల మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే విజువల్స్ ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తు తం ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ వచ్చేసింది. ఈ పాట ను ఆదివారం నాడు అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్ అదిరిపోయింది.ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపూర్‌లోనే జరిగింది. అందుకే ఈ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలని అనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నా రు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’లో మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అనంతపూర్ బ్యాక్ గ్రౌండ్‌లోనే సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.




చెన్నై: చదివించి వైద్యుడిని చేసినందుకు అక్క కూతురుకు మేనమామ అశ్లీల ఫొటోలు, అసభ్యకర మెసేజ్‌లు పంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తేనాంపెట్టై ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చెల్లవేల్ అనే యువకుడు వైద్య విద్య చదివేందుకు అతడి సోదరి ఐదు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసింది. వైద్యుడైన తరువాత తన కూతురును పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకొని ముఖం చాటేశాడని పేర్కొంది. తంజావూర్ జిల్లా మరుంకుళం ప్రాంతంలో ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా అతడు సేవలందిస్తున్నాడు. తన కూతురు సెల్‌ఫోన్‌కు అశ్లీల ఫొటోలు, అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో చెల్లవేల్ అక్క అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా అతడిపై క్రిమినల్ కేసు ఉన్నట్టు సమాచారం.




మన దృష్టి కిటికీ కాదు మనసు రంగుతో పూయబడిన అద్దం చూస్తున్నామనుకునేది ప్రపంచం కాదు మనలో ముందే వ్రాసిన భావనల ప్రతిబింబం సాక్ష్యం ఒకటే అయినా నమ్మకం దానికి వేరే రూపం ఇస్తుంది భావాలు మబ్బులైతే తర్కం సూర్యుడు కావాలి నిజం బయట దాగి ఉండదు మన పక్షపాతపు పొరలలో చిక్కుకుపోతుంది గత అనుభవం గీతలు గీస్తే ప్రస్తుతం వాటి మధ్యే నిలుస్తుంది పక్షపాతం తెలియని చూపు బంధనం పక్షపాతం తెలిసిన చూపు విముక్తి మన అద్దం శుభ్రం అయినప్పుడే ప్రపంచం కాదు, సత్యమే మనలో ప్రతిఫలిస్తుంది - డాక్టర్ నూకరాజు బెందుకుర్తి



మౌనవేణువేదో అపురూప రాగాలను తొలకరిస్తున్నట్టు ఏ వెన్నెల పాలపుంతలనో పచ్చి పసుపూ వెన్నముద్దతో కలగలిపి మైపూతగాఅలదుకున్నట్టు ఉజ్వలప్రకాశమై అదృశ్య ఉనికి ఒకటి అహరహం వెన్నంటి నీడలా పలకరిస్తూనే ఉంది గాలి సన్నాయిలచిరుమేళవింపుల్లో పాలరాతి సోపానాల మీద జారిపడే సరిగమల్లో గమకాలుకుదించుకు వేలాది వాయులీన తరంగాల్లో తడిసి ముద్దైపోతూ మమేకమవుతూ నక్షత్ర దీపాలు అలంకరించిన పసిడి పల్లకిలో రేకులు రేకులుగా విప్పారే వెయ్యి రేకుల బ్రహ్మకమలం -పొరలుపొరలుగా తరలివచ్చే ఊహల మధుపాయీల గుంపు అమృతహృదయాన్నిఅక్షరాలనిండా పొదిగి విరబూసిన విరిబాలలను సుతారంగా అల్లిన కవన మాలికలు ద్వార బందాలకు వేళ్ళాడదీసిన ప్రదర్శన తుంచుకు అలంకరించుకుందామనో కసికసిగా నలిపి విసిరేద్దామనో ఎన్ని కాంక్షల కసాయి చూపులో అందని ఆకాశాలను దింపితెచ్చి ఎరుపెక్కిన చందమామ అరచేతిలో శిలువవేసి చుక్కలను ఇంటి చుట్టూ కంచెగా నాటుకున్న బృందావనం పాటలు రాకపోతేనేంఏ అణువు కదలించినా కాంభోజి రాగాలూ యమునా కల్యాణిలే ఎన్ని ఉపద్రవాలు దండెత్తి వచ్చినా ఎన్నెన్ని యుద్ధనౌకలు సముద్రాన మునిగినా ఎంత మారణ కాండ శృతిమించి విషాదం చిమ్మినా భ

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. పొరుగింటి బాలికతో కలిసి అక్కాచెల్లెలు వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... దోమలగూడలో అక్కాచెల్లెలు సహిత కుమారి(16), స్నేహ కుమారి(14)లు ఇంటి పక్కనే ఉన్నబంధువు రోహిణి కుమార్తె లత (14)తో కలిసి ఆటోలో వెళ్లారు. హిమాయత్‌నగర్‌లో ముగ్గురు ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగినట్టు సిసి టివి ఫుటేజీ లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ముగ్గురు బాలికల కోసం గాలింపు చేపట్టారు.

ప్రపంచ సాహిత్య చరిత్రలో ‘నేర కథా రచయిత్రి’గా అగాథా క్రిస్టీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. బైబిల్, షేక్‌స్పియర్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఆమె రచనలు ఉన్నాయనే రికార్డు ఆమె స్వంతం చేసుకున్నారు. అగాథా క్రిస్టీ 66 నవలలు, 14 కథా సంకలనాలు రాశారు . ప్రపంచంలోనే అత్యంత దీర్ఘకాలం ప్రదర్శితమవుతున్న ‘ది మౌస్ట్రాప్’ నాటకం ఇవన్నీ ఆమె అపార ప్ర తిభకు నిదర్శనాలు. అయితే, ఈ వ్యాసం క్రిస్టీని కేవలం ‘క్రైమ్ క్వీన్’గా కాక, తన కాలంలోని సామాజిక, సాంస్కృతిక ప్రక్రియలతో సంభాషించిన ఒక సంక్లిష్ట రచయిత్రిగా పేరు సంపాదించింది. ప్రపంచ సాహిత్యాన్ని తెలుసుకోవడంలో భాగంగా ఆమె జీవితంలోని కీలక ఘట్టాలను, రచనా ప్రత్యేకతలను, సాహిత్య విమర్శకుల దృక్పథాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అగాథా క్రిస్టీ వ్యక్తిగత జీవితంలోని అనేక సంఘటనలు ఆమె రచనలను ప్రత్యక్షంగా ప్రభావితం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫార్మసిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు విషాలపై అద్వితీయ పరిజ్ఞానాన్ని ఇచ్చింది. ఆమె నవలల్లో విషప్రయోగాలు చాలా వాస్తవికంగా, శాస్త్రీయంగా చిత్రీకరించబడటానికి ఇదే ప్రధాన కారణం. రెండవ వివాహం తర్వాత పురావస్తు శాస్త్రవ