25124 వార్తలు


గన్నవరం: యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసేఫ్) రిమాండ్‌ను గన్నవరం కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో రావణ్ రిమాండ్ గడువు నేటితో ముగియడంతో అతడిని అధికారులు వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. పలువురు ప్రముఖులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, సోషల్‌మీడియాలో వీడియోలు పోస్టులు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. అతడి మొబైల్‌లో మావోయిస్టులను పొగుడుతూ చేసిన వీడియోలు ఉండటంతో దేశ ద్రోహం, ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు.



అహ్మదాబాద్: గుజరాలోని అహ్మదాబాద్‌లో ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాక్టీర లైసెన్సు రద్దు చేసినప్పటికీ.. అక్కడ అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. ఈ క్రమంలోనే ఓ యూనిట్‌లో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘ది ఒడిస్సీ’. ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. అందుకు తగినట్లే రికార్డుస్థాయిలో ముందస్తు బుకింగ్స్ అయ్యాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు భారత్‌లో రూ.20.76 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 39.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.375 కోట్లు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. హోమర్ రాసిన ‘ది ఒడిస్సీ’ ఇతిహాసం ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ అద్భుత దృశ్య కావ్యంగా దీన్ని తీర్చిదిద్దారు. మాట్ డామన్, టామ్ హాలెండ్, అన్నీ హథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా కీలక పాత్రల్లో నటించారు. సుమారు రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో కేవలం 91 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయడం విశేషం. సినిమా మొత్తాన్ని ఐమ్యాక్స్ 70 ఎంఎం కెమెరాలతో తీయడం గమనార్హం. థియేట్రికల్ అనుభూతిని పంచే మూవీ కావడంతో సినీ ప్రేక్షకులు బాక్సాఫీస్‌కు క్యూ కడుతున్నారు. వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ వసూళ్లు రెట్టింపు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.









జోగిపేట: ముక్కుపచ్చలారని పసికందును కన్నతండ్రే దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది. సిఐ అనిల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోగిపేట పట్టణానికి చెందిన కృష్ణ, గౌరమ్మ దంపతులు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా తన భార్యతో గొడవపడిన కృష్ణ.. పాలు తాగుతున్న బిడ్డను లాక్కొని.. చిన్నారి చెంపలపై కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ.. చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టాడు. గౌరమ్మ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసికందును జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.



హైదరాబాద్: ప్రజలకు కాంగ్రెస్ పై కోపం ఉందని, బిఆర్ఎస్ పై నమ్మకం లేదని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. బిజెపిలో కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్టానం దృష్టి పెట్టిందని అన్నారు. ఎంపి లక్ష్మణ్ నివాసంలో ఇరువురి నేతలతో గంటపాటు సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి బండిసంజయ్, ఈటల రాజేందర్ తో అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని బండిసంజయ్, ఈటల రాజేందర్ కు లక్ష్మణ్ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై చర్చించామని, వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, లోక్ సభ సీట్లు పెరుగుతాయని అన్నారు. బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు తామంతా కలిసి పనిచేస్తామని ఎంపి లక్ష్మణ్ తెలియజేశారు.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ సోదరుడు అర్జూ, మరో వ్యక్తి టైసన్‌లకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆమిర్ మూడో వివాహం చేసుకొని మతపరమైన వివాదానికి తావిచ్చారని.. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని వారు హెచ్చరించారు. త్వరలోనే దీనికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఆడియోలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై మతపరమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయంపైనే బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఇటీవల కొందరు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ గ్యాంగ్ బెదిరించింది.

అమరావతి: చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి లక్ష్యం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చెత్త పేరుకోవడం వల్ల అనేక రోగాలు వస్తాయని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సిఎం పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎన్టిఆర్ గ్రౌండ్ లోని ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని, మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్వీన్ స్వీప్ కార్యక్రమం పెట్టామని తెలియజేశారు. చాలామంది ఆపరేషన్ క్వీన్ స్వీప్ లో పాల్గొన్నారని, ఇంట్లో ఎవరికి వారే తడి, పొడి చెత్తలను వేరు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తడి, చెత్తను కంపోస్ట్ గా తయారు చేసుకోవాలని, 12 ఏళ్ల ముందు కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చేవి కావని అన్నారు. కృష్ణా జిల్లా దేశానికి అన్నం పెట్టిన స్థలం అని కవుల నుంచి హీరోల వరకు ఎంతో మంది ఈ గడ్డ మీద పుట్టిన వారేనని పేర్కొన్నారు. 12 ఏళ్లలో ఎంతో కృషి చేసి పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు నీరు తెచ్చామని, వానలు లేక ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదులన్ని అనుసంధానం చేస్తామని..కరువు లేకుండా చేస్తామని, రూ.1


