25179 వార్తలు

హైదరాబాద్: ప్రజలకు కాంగ్రెస్ పై కోపం ఉందని, బిఆర్ఎస్ పై నమ్మకం లేదని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. బిజెపిలో కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్టానం దృష్టి పెట్టిందని అన్నారు. ఎంపి లక్ష్మణ్ నివాసంలో ఇరువురి నేతలతో గంటపాటు సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి బండిసంజయ్, ఈటల రాజేందర్ తో అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని బండిసంజయ్, ఈటల రాజేందర్ కు లక్ష్మణ్ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై చర్చించామని, వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, లోక్ సభ సీట్లు పెరుగుతాయని అన్నారు. బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు తామంతా కలిసి పనిచేస్తామని ఎంపి లక్ష్మణ్ తెలియజేశారు.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ సోదరుడు అర్జూ, మరో వ్యక్తి టైసన్‌లకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆమిర్ మూడో వివాహం చేసుకొని మతపరమైన వివాదానికి తావిచ్చారని.. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని వారు హెచ్చరించారు. త్వరలోనే దీనికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఆడియోలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై మతపరమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయంపైనే బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఇటీవల కొందరు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ గ్యాంగ్ బెదిరించింది.

అమరావతి: చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి లక్ష్యం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చెత్త పేరుకోవడం వల్ల అనేక రోగాలు వస్తాయని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సిఎం పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎన్టిఆర్ గ్రౌండ్ లోని ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని, మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్వీన్ స్వీప్ కార్యక్రమం పెట్టామని తెలియజేశారు. చాలామంది ఆపరేషన్ క్వీన్ స్వీప్ లో పాల్గొన్నారని, ఇంట్లో ఎవరికి వారే తడి, పొడి చెత్తలను వేరు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తడి, చెత్తను కంపోస్ట్ గా తయారు చేసుకోవాలని, 12 ఏళ్ల ముందు కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చేవి కావని అన్నారు. కృష్ణా జిల్లా దేశానికి అన్నం పెట్టిన స్థలం అని కవుల నుంచి హీరోల వరకు ఎంతో మంది ఈ గడ్డ మీద పుట్టిన వారేనని పేర్కొన్నారు. 12 ఏళ్లలో ఎంతో కృషి చేసి పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు నీరు తెచ్చామని, వానలు లేక ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదులన్ని అనుసంధానం చేస్తామని..కరువు లేకుండా చేస్తామని, రూ.1




హైదరాబాద్, జులై 18: శనివారం నగరం నలువైపులా హైడ్రా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకుంది. మార్కెట్లో ఈ భూముల విలువ రూ. 30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 84 ఎకరాలు స్వాధీనం చేశారు. రాయదుర్గం విలేజ్‌లోని సర్వే నంబరు 46లో ఉన్న ఈ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి.. పక్కనే అర ఎకరం పట్ట ల్యాండ్ లో ఈ ప్రభుత్వ భూమిలోకి చొరబడి గజాల చొప్పున అమ్మకాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 106 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసి.. కంటోన్మెంట్ ప్రాంతంలో కల జీఎల్ ఆర్( జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబరు 243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేశారు. మైనింగ్ కార్యక








‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చిదంబరం. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బాలన్ - ది బాయ్’. చందు సలీమ్ కుమార్, టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జులై 31 నుంచి జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. హత్య కేసులో జైలుకు వెళ్లిన మహిళ అక్కడ ఓ అబ్బాయకి జన్మనిస్తుంది. శిక్ష పూర్తయి బయటకు వచ్చాక తన గతం గురించి ఎవరికీ చెప్పకుండా మారుపేర్లతో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటుంది. కల్లోలభరితమైన బాల్యం, ఆ తర్ావత అదృశ్యమైన తన తల్లి కోసం వెతుకుతున్న ఓ టీనేజ్ అబ్బాయి కథగా ‘బాలన్ - ది బాయ్’ రూపొందింది. మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాపై ప్రముఖ నటులు సూర్య, నాగచైతన్య తదితరులు ప్రశంసలు కురిపించారు.


ఆసిఫాబాద్: చాయ్ తాగేందుకు 20 రూపాయలు ఇవ్వలేదని వృద్ధుడిని గొడ్డలితో నరికి తల, మొండెం వేరు చేసిన సంఘటన కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పర్సనంబాల గ్రామానికి చెందని మసాడి సోమయ్య(65) అనే వ్యక్తి భార్య తానుబాయితో కలిసి నంబాలలో ఉంటున్న చిన్న కూతురు సుజాత ఇంటికి వెళ్లారు. హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కూతురు లక్ష్మి కూడా అక్కడికి రావడంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. పెద్ద కూతురు లక్ష్మిని హైదరాబాద్‌కు వెళ్లేందుకు రెబ్బెన రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ట్రైన్ ఆలస్యం కావడంతో స్టేషన్ ముందు టీతాగుతూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో తుంగెడ గ్రామానికి చెందిన బోగారపు నగేష్ అనే వ్యక్తి సోమయ్య గొడ్డలితో వెంబడించాడు. కొంచెం దూరం వెళ్లిన టీ తాగడానికి 20 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో సోమయ్యను వెంబడించాడు. అనంతరం గొడ్డలి తీసుకొని సోమయ్య మెడపై నగేష్ వేటు వేశాడు. తల, మొండెం వేరు చేసి అక్కడి నుంచి నగేష్ పారిపోయాడు. డిఎస్‌పి అశోక్, రెబ్బెన సిఐ సంజయ్, ఎస్‌ఐ వెంకటకృష్ణ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తానుబాయ




అమరావతి: ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఏలూరు జిల్లా పొలవరం గోదావరి తీరంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి గోదావరిలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద ఈ ఘటన చేసుకుంది. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు కోసం స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. గొమ్ముకొత్త గూడెంకి చెందిన మహిళలుగా మత్స్యకారులు గుర్తించారు.


మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ శంకర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మానసిక ఆందోళనలతో ఓ యువతి గత అర్ధరాత్రి నగ్నంగా పరుగులు తీసి అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన తేజస్విని (27) అనే యువతి రెంట్ యాప్ లో ఇల్లు వెతికి మూడు నెలల క్రితం శంకర్ నగర్ లోని ఓ ఇంటిలో తల్లితో కలిసి నివాసం ఉంటుంది. కాగా గత అర్థరాత్రి తల్లి పడుకున్న సమయంలో తేజస్విని ఇంటి బయట నుంచి గడియ పెట్టి నగ్నంగా బయటికి పరుగులు తీసింది. ఇంటికి దగ్గరలోని బీరప్ప గుడిలో నుండి ఓ విగ్రహాన్ని తీసుకుని సమీపంలోని పీర్జాదిగూడ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తేజస్విని నగ్నంగా పరుగులు పెట్టి చెరువు వైపు వెళ్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాలలో రికార్డయ్యాయి. కాగా మానసిక ఆందోళనతోనే సదరు యువతి నగ్నంగా పరుగులు తీసి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.