
3826 వార్తలు
నవతెలంగాణ-హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలో జరిగిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 84 మందికిగా గాయాలయ్యాయి అని రైలు నిర్వహణ సంస్థ మంగళవారం తెలిపింది. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టి శిథిలాల కింద వారిని బయటకు తీశారు. జకార్తాకు సమీపంలోని బెకాసిలో సోమవారం రాత్రి ఒక ప్రయాణీకుల రైలు, ఒక సుదూర ప్రాంత రైలు (సిటీ రైలు) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై ఇండోనేషియా ప్రభుత్వ రైల్వే […] The post రెండు రైళ్లు ఢీ.. 14 మంది మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ-ఆర్మూర్ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ పరిధిలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం మంగళవారం మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మంది ఎం.పి.హెచ్.డబ్ల్యూ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబ్ల్యూఎస్ఐ పుష్పావతి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన మరియు భరోసా సెంటర్ […] The post చైల్డ్ సేఫ్టీపై అవగాహన appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్డోంగ్లి మండల నూతన తహశీల్దార్ గా రంజిత్ కుమార్ ఇటీవలే భాద్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం డోంగ్లి మండలంలోని ఎనబోరా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్ తహశీల్దార్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు మీ సేవలు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరికి న్యాయబద్ధమైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏనాబోరా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్సర్, నోవు పటేల్, పాల్గొన్నారు. అనంతరం ఆయనను సన్మానించిన […] The post డోంగ్లి తహశీల్దార్ కు ఘన సన్మానం appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఓ లేగదూడపై దాడి చేసిన ఘటన మరవకముందే నేడు బాలుడిపై దాడి చేశాయి. కాలనీలో అటుగా వెళ్తున్న మంగళవారం పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే గమనించిన స్థానికులు బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినా బాలుడి కాలుపై కుక్క దాడి చేసింది. సమాచారం అందుకున్న బాలుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. […] The post బాలుడిపై పిచ్చి కుక్క దాడి.. తీవ్ర గాయాలు appeared first on Navatelangana.

స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో చైనా మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని Y600 ప్రో పేరిట విడుదల చేసింది. ఈ వివో ఫోన్ నాలుగు రంగుల ఎంపికలలో లభిస్తుంది. ఈ పరికరంలో 6.83-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, బిగ్ 10,200 mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉండటం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.వివో వై600 ప్రో ధర, లభ్యతవివో వై600 ప్రో స్మార్ట్‌ఫోన్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.1.8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,099 (సుమారుగా రూ. 29,000) 2.8GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,299 (సుమారుగా రూ. 32,000) 3.8GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,599 (సుమారుగా రూ. 36,000) 4.12GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,599 (సుమారుగా రూ. 36,000) ఇక ఈ పరికరం 12GB + 512GB స్టోరేజ్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర CNY 2,899 (దాదాపు రూ. 40,000). చైనాలో వివో Y600 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్స్ కు మే 5న నుండి ప్రారంభంకానున్నాయి. కాగా, ఈ ఫోన్ బ్రైట్ మూన్ బ్లాక్, ఫ్లోటింగ్ గోల్డ్, స్టార్ వైలెట్, వాస్ట్ బ్లూ రంగులలో లభిస


ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకోగా, కొందరు నాయకులు ఉన్నత స్థాయి నేతల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మరోవైపు, బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం కసరత్తు చేస్తున్నాయి. అయితే కౌన్సిల్‌లో సంఖ్యాబలం దృష్ట్యా కూటమి మద్దతు కీలకంగా మారింది. ఇదిలా ఉండగా,గతంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడగా, నేడు తిరిగి ప్రత్యేక సమావేశం […] The post రాయికల్‌లో కో-ఆప్షన్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలంలోని కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మల్లేష్ గౌడ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీల సౌకర్యం లేకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిపారు. ధాన్యం ఎక్కువ కాలం కేంద్రాల్లోనే నిల్వ ఉండడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాలు పడితే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే […] The post కొనుగోలు చేసిన ధాన్యం తరలింపుపై నిర్లక్ష్యం appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో సోమవారం ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో వాతావరణ శాఖ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం […] The post తెలంగాణలో ప్రమాదకర స్థాయికి ఎండలు.. appeared first on Navatelangana.


ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో చైనాలో సరికొత్త మొబైల్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని వివో Y500s పేరిట తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 7,200mAh బ్యాటరీ, 6.75-అంగుళాల డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ను కూడా అందించారు. డిజైన్ పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ జనవరిలో చైనాలో విడుదలైన వివో Y500iని చాలా పోలి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివో Y500s ధర, లభ్యత చైనాలో వివో Y500s పరికరం రెండు స్టోరేజీ వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,800 (సుమారుగా రూ.24,800) నుండి ప్రారంభమవుతుంది. అయితే 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,200 (సుమారుగా రూ.30,400). ఈ ఫోన్ గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, ఫీనిక్స్ గోల్డ్ రంగులలో లభిస్తుంది. కస్టమర్లు ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ లిస్టింగ్ ప్రకారం, వివో Y500s మార్చి 2026 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో Y500s ఫీచర్లు ఈ వివో పరికరంలో 6.75-అంగుళాల HD LCD డిస్‌ప్లే ఉంది.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభవార్త. రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పదో తరగతి […] The post రేపే టెన్త్ ఫలితాలు.. appeared first on Navatelangana.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఎస్‌ఎస్‌సి బోర్డ కార్యాలయంలో ఉన్నతాధికారులు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మార్కుల మెమోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. పరీక్ష ఫలితాల కోసం కింద క్లిక్ చేయండి. తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవతెలంగాణ – హైదరాబాద్ : అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌కు భారత దర్యాప్తు ఏజెన్సీలు భారీ షాక్ ఇచ్చాయి. దావూద్ కీలక అనుచరుడు, నిషేధిత డ్రగ్స్ తయారీలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సలీం డోలాను భారత్‌కు అప్పగించారు. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఆ దేశ జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో డోలాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని భారత్‌కు తరలించారు. ప్రస్తుతం డోలాను ఢిల్లీలోని ఆర్‌కే పురంలో ఉన్న నార్కోటిక్స్ […] The post దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్.. appeared first on Navatelangana.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని బిఆర్ఎస్ మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సంగారెడ్డి: కందిలోని సెంట్రల్ జైల్లో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు వంతపాడుతున్న అధికారులను వదిలిపెట్టమని, నేను రాజు.. నేను మంత్రి అన్నట్లుంది రేవంత్ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ అడుగుతారా అనే అహంకార పూరిత దోరణితో వ్యవహరిస్తుందని, విజిలెన్స్, సిఐడి, కమిషన్లు, అక్రమ కేసులు, అరాచకాలను పాల్పడుతున్నారని మండిపడ్డారు. మన్నె క్రిశాంక్ పిఎస్ లో ఫిర్యాదు చేశారని, మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడని, అందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన మొబైల్ ను అందజేశారని అన్నారు.తప్పుడు వార్తలు రాసినోళ్లను కాకుండా ఫిర్యాదు చేసినోళ్లనే అరెస్టు చేశారని, ఫేక్ పోస్టులు పెట్టినోళ్లకు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపారని మండిప


హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురిసింది. ముఖ్యంగా శంషాబాద్-నాదర్గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో వడగళ్ల వాన పడింది. రోడ్లన్నీ వడగళ్లతో నిండిపోవడంతో, అచ్చం కశ్మీర్‌ను తలపించేలా మంచు కురిసిన భ్రమ కలిగించింది. ఈ అరుదైన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇవి హైదరాబాద్ హిమాలయాలు అంటూ చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రోడ్లన్నీ తెల్లటి మంచు ముక్కలతో నిండిపోవడం చూసి వాహనదారులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు విస్మయానికి గురవుతున్నారు.

అమరావతి: గూగుల్ రాక ఎపికి గేమ్ ఛేంజర్ అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది దేశచరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు అని అన్నారు. ఈ సందర్భంగా తుర్లాడలో సిఎం మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్నం చాలా అందమైన ప్రదేశం అని ఎపి చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఈ ప్రాజెక్టు రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం కొనియాడారు. టెక్నాలజీలో ఎపి సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని, ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అని టెక్నాలజీలో దేశానికి ఎపి గేట్ వేగా నిలుస్తుందని చంద్రబాబు తెలియజేశారు. ఎపి భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారబోతుందని, ప్రపంచం గూగుల్ ను ఎంచుకుంటే, గూగుల్ ఎపిని ఎంచుకుందని ఆనందాన్నివ్యక్తం చేశారు. ఎపిలో ఇవాళ్టి నుంచి సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, త్వరలోనే ప్రతీ సిటిజెన్ ఎఐ అసిస్టెంట్ ను ఆశ్రయిస్తారని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికాను కలిపేలా కేబుల్ నిర్మాణం అని ఎపి లాజిస్టిక్ హబ్ గా మారాలన్నదే తన లక్ష్యం అని దీనికి కేంద్రం నుంచి మద్దతు కోరుతున్నామని అన్నారు. ఎంవోయూ చేసుకోవడమే కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఫోకస్ పెడుతున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

నిజామాబాద్: ఉదయం కుమారుడి పెళ్లి చేసి అనంతరం రాత్రి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నందిగామ గ్రామంలో ఎల్కా దేవన్న-సాయమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవన్నకు వందకు పైగా మేకలు ఉన్నాయి. మేకలు కాపరిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు పెళ్లి కోసం 30 మేకలను అమ్మాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చెందిన యువకుడికి కూతురు ఇచ్చి పెళ్లి చేశాడు. అనంతరం తన బంధువులతో కలిసి ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి ముందు మేకల మంద తగ్గిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే తన రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకొని చనిపోయాడు. దేవన్న ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సాయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.