
3737 వార్తలు

మన తెలంగాణ/శంకర్‌పల్లి: గాలివాన నుంచి ప్రాణాలు కాపాడుకుందామని షెడ్డు కిందకు వె ళ్లిన కార్మికులకు, అదే షెడ్డు మృత్యుపాశమైంది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని ఎన్‌సిసి (నాగార్జున కన్స్ట్రక్షన్స్) కంపెనీలో భారీ క్రేన్ షెడ్డుపై విరిగిపడటంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం శంకర్ పల్లి మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలివాన మొదలైంది. ఆ సమయంలో ఎన్‌సిసి కంపెనీ బ్రిక్స్, భారీ స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికులు వర్షం నుంచి తలదాచుకునేందుకు సమీపంలోని ఒక రేకుల షెడ్డు కిందకు చేరారు. అయితే గాలి తీవ్రతకు షెడ్డు పక్కనే ఉన్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి కార్మికులు ఉన్న షెడ్డుపై కుప్పకూలింది. భారీ క్రేన్ ఒక్కసారిగా పడటంతో షెడ్డు కింద ఉన్న వారు తప్పించుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. క్రేన్ ఇనుప విడిభాగాల కింద నలిగి ఐదు మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా సమయంలో షెడ్డు కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండటంతో క్షతగాత్రుల సంఖ
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మధిరలో ఆది వెంకటేశ్వర్లు సంస్మరణ సభనవతెలంగాణ-మధిరకార్మికులు, కర్షకుల హక్కుల కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్ని కడదాకా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు (పెద్దబ్బాయి) అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్‌లో సోమవారం పార్టీ పట్టణ కార్యదర్శి పడకంటి మురళి అధ్యక్షతన ఆది వెంకటేశ్వర్లు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. […] The post కార్మికుల కోసం కడదాకా నిలిచిన వ్యక్తి పెద్దబ్బాయి appeared first on Navatelangana.
రైతులు సద్వినియోగం చేసుకోవాలిశాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయం లాభసాటి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణనవతెలంగాణ- అశ్వారావుపేటరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ కె.నాగాంజలి, డాక్టర్ ఐ.కృష్ణతేజ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామంలో ”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు […] The post రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతతో ‘నో స్టాక్ బోర్డులు’ కనపడుతున్నాయనీ, దీంతో రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలి రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లాభాపేక్షతోనే ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని తెలిపారు. కేంద్ర […] The post పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలి appeared first on Navatelangana.
వేతన సవరణ చట్టాలను అమలు చేయాలిఐఎల్‌ఓ సమావేశాలను జరపాలి :సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబునవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధిచికాగో నగరంలో 140 ఏండ్ల కిందట 8 గంటల పని విధానంకోసం పోరాడి ప్రాణా లొదిలిన అమరులను స్మరిం చుకుంటూ.. భారతదేశంలో సామాన్య ప్రజలపై జరుగు తున్న దాడులను ప్రతిఘటిం చేందుకు కార్మికులను సంఘటిత పరిచి సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని […] The post చికాగో పోరాటస్ఫూర్తితో మేడే ఉత్సవాలు appeared first on Navatelangana.
ఆమోదించిన రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్‌మూడుకు పడిపోయిన ఆప్ ఎంపీల సంఖ్యనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆమోదం తెలిపినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ విలీనంతో బీజేపీ సంఖ్యాబలం భారీగా పెరిగింది. ఆప్ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. […] The post బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం appeared first on Navatelangana.
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు కేజ్రీవాల్ నిరాకరణహైకోర్టు న్యాయమూర్తికి లేఖమహాత్ముని సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తానని వెల్లడినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు కేజ్రీవాల్ న్యాయమూర్తికి లేఖ రాస్తూ కోర్టుపై తనకు ‘నమ్మకం పోయిందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అంతరాత్మ […] The post న్యాయంపై నమ్మకం లేదు appeared first on Navatelangana.
రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల దుకాణాల బంద్ విజయవంతం : తెలంగాణ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లునవతెలంగాణ- వరంగల్‌ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జాతీయ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు దుకాణాలను మూసేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ […] The post ఫర్టిలైజర్స్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.

న్యూఢిల్లీ : బారత్ న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) ఇరుదేశాలకు ఎంతో మేలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం ఇరుదేశాల నడుమ కీలక ఎఫ్‌టిఎ కుదిరిన తరువాత ప్రధాని మోడీ స్పందించారు. ఎఫ్‌టిఎ ఇరుదేశాల వ్మూహాత్మక భాగస్వామ్య బంధాన్ని మలుపు తిప్పుతుంది. ప్రత్యేకించి రైతులు, యువజనులు, ఎంఎస్‌ఎంఇలకు ఇతోధిక ప్రయోజనం తథ్యం అని తెలిపారు. ఇరు దేశాల పురోగమన దిశలో ఈ ఎఫ్‌టిఎ మైలురాయి అయి తీరుతుందన్నారు. ఇరుదేశాల మధ్య సోమవారం ఎఫ్‌టిఎపై సంతకాలు జరిగాయి. భారతదేశంలో పర్యటిస్తోన్న న్యూజీలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్‌క్లేతో భారత వాణిజ్య వ్యవహారాల మంత్రి పియూష్ గోయల్ విస్తృత చర్చల తరువాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇ ప్పటి ఒప్పందంతో విద్యార్థులు, యువతకు అత్యధిక ప్రయోజ నం చేకూరేందుకు రంగం సిద్ధం అయిందని ప్రధాని మోడీ తెలిపారు. పలు స్టార్టప్‌లు వెలుస్తాయి. వృత్తి నైపుణ్య ఐటి ప్రతిభావంతులకు ఉద్యోగ ఉపాది అవకాశాలు మెరుగుపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి ఎఫ్‌టిఎతో న్యూజీలాండ్‌కు భారతీయ ఎగుమతులపై నూటికి నూరుశాతం సుంకం రహిత పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా
హాజరైన సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కోరిక నెరవేరింది. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాంతోపాటు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ సోమవారం శాసనమండలి సభ్యులు(ఎమ్మెల్సీగా) ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఇరువురికి అభినందనలు తెలియజేశారు. […] The post ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్ ప్రమాణం appeared first on Navatelangana.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మార్క్‌ఫెడ్ విఫలంనవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధిఈఏడాది అంచనాలకు మించి మొక్కజొన్న పంట దిగుబడి వచ్చింది. మార్కెట్లు, రోడ్లు ఎక్కడ చూసినా మక్క నిల్వలు కనిపిస్తున్నాయి.. దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం.. కాంటాలు పెట్టడంలో మార్క్‌ఫెడ్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట మండలానికి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి సగం మండలాల్లోనే పెట్టారు. ఎటు చూసినా మొక్కజొన్నల కుప్పలు, లోడైన ట్రాక్టర్లు, లారీలు కనిపిస్తున్నాయి. కాంటాలు కాక రైతులు […] The post మార్కెట్‌లో రోడ్ల నిండా మక్కలే.. appeared first on Navatelangana.
దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నాఅర్హత ఉంటే ఇల్లు ఇస్తాంఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుసాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయంతహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలుప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంసర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు […] The post ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్లకు మరిన్ని అధికారాలు appeared first on Navatelangana.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్ 29(బుధవారం)న రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. తొలి విడతలో 152 స్థానాలకు ఈనెల 23న పోలింగ్ జరగ్గా..రికార్డు స్థాయిలో (92 శాతం) ఓటింగ్ నమోదైంది. రెండో విడతలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనున్నది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ, సీపీఐ(ఎం) విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి. అయితే రెండో విడతలో కీలకమైన 110 అసెంబ్లీ స్థానాలు ఎటువైపు మొగ్గు చూపితే అధికారం ఆ […] The post రేపే పశ్చిమ బెంగాల్ రెండో విడత ఎన్నికలు appeared first on Navatelangana.
– దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు?– పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదు – రిపోర్టు ప్రకారం చర్యలు వద్దని చెప్పింది– కేసీఆర్ మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే : సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, కొన్ని సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు […] The post కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి తెస్తాం appeared first on Navatelangana.
సుమారు 2.5 మిలియన్ టన్నులు ఇంపోర్ట్‌దిగుమతి ఖర్చులు పెరిగితే ప్రభుత్వంపై ఆర్థిక భారం ముందస్తు ప్రణాళికాలోపం కారణంగానే ఈ పరిస్థితి : మోడీ సర్కారుపై సర్వత్రా విమర్శలు వ్యవసాయరంగంలో ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామంన్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలోని పరిస్థితు లను ముందుగానే అంచనా వేయటంలో విఫలమైన మోడీ సర్కారు చర్యలతో భారత్ భారీ మూల్యం చెల్లించు కుం టోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడి తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. చిరు వ్యాపారులను […] The post రెట్టింపు ధరలకు యూరియా దిగుమతి appeared first on Navatelangana.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆధారాలు లేకుండా ఒక రిటైర్డు ఉద్యోగిపై సీబీఐ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగంలోని అధికరణ 21 ద్వారా వ్యక్తికి లభించిన స్వేచ్ఛను కాలరాయడమేనని చెప్పింది. రిటైర్డు ఉద్యోగికి రూ.50 వేలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. 2009 జనవరి 31న రిటైర్ ఉద్యోగిపై, అదే ఏడాది మార్చిలో తయారైన మెడిసిన్స్ విషయంలో సీబీఐ కేసు పెట్టింది. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే సెంట్రల్ ఆస్పత్రికి సరఫరా చేసిన రాక్సీత్రోమైసిన్ […] The post కేంద్రానికి రూ.50 వేలు జరిమానా : హైకోర్టు appeared first on Navatelangana.
సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థపొరాటాల కాలం..జనంలో ఉండి పనిచేయాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు‘మన స్థాయిలో మరో సుందరయ్య’ పుస్తకావిష్కరణనవతెలంగాణ- వైరాటౌన్‌సామ్రాజ్యవాద విధానాలు ప్రపంచవ్యాప్తంగా సమస్యలను సృష్టిస్తున్నాయని, పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలో సోమవారం మార్క్సిస్టు పోరాట యోధుడు సంక్రాంతి మధుసూదన్‌రావు ప్రథమ వర్థంతి జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్మారక […] The post సామ్రాజ్యవాదంతో ప్రపంచానికి సమస్యలు appeared first on Navatelangana.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ”చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు అపర్ణ చందన, సరిత, వందన, […] The post ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి సీతక్క appeared first on Navatelangana.
వ్యవసాయం, గ్రామీణ జీవనంపై కార్పొరేట్ దాడిరైతు-కార్మికుల ఐక్య పోరాటమే ప్రత్యామ్నాయం : బి వెంకట్, ఎంపీ శివదాసన్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం మోకరిల్లిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, ఎంపీ శివదాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కర్నాటకలోని షాపూర్‌లో వ్యవసాయ, గ్రామీణ కార్మికుల మహాప్రదర్శనలో వారు మాట్లాడారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలపై వచ్చే నెల 15న దేశవ్యాప్త సమ్మె […] The post వచ్చే నెల 15న ఉపాధి హామీ కార్మికుల దేశవ్యాప్త సమ్మె appeared first on Navatelangana.
రేవంత్‌రెడ్డి, భట్టి సహా పలువురి సంతాపంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో) మారబోయిన మధుసూదన్ (50) హఠ్మారణం చెందారు. సోమవారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాద్ అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మిర్యాలగూడలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గతంలో ఈనాడు, […] The post డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్ హఠాన్మరణం appeared first on Navatelangana.
– దానితో పంజాబ్ నష్టపోతుంది– పాఠశాలల ఎదుటా గంజాయి అమ్మకాలు ఆందోళనకరం– ఈ దందాలో ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టం : ‘స్పందన’ బృందాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహిళలపై జరుగుతున్న 80 శాతం అఘాయిత్యాలు, అకృత్యాలకు మత్తు పదార్థాలు, డ్రగ్సే కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లాంటి రాష్ట్రం డ్రగ్స్ వల్ల నిర్వీర్యమైందని ఆయన గుర్తు చేశారు. వ్యసనాల బారిన పడిన ఆ రాష్ట్రం ఇప్పుడు కోలుకోని స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. […] The post డ్రగ్స్ వల్లే 80 శాతం అఘాయిత్యాలు appeared first on Navatelangana.
ఢిల్లీ హ్యాట్రిక్ ఓటమిన్యూఢిల్లీ: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంతగడ్డపైనే 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీకిది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లు.. భువనేశ్వర్ కుమార్ (3/5), జోష్ హేజిల్‌వుడ్ (4/12) సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించారు. […] The post ఆర్సీబీ అదుర్స్ appeared first on Navatelangana.
పశ్చిమ బెంగాల్‌లోప్రజల నుంచి విశేష స్పందననవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా హౌరా జిల్లాలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు, బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. డోమ్‌జూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి దులు దాస్‌కు మద్దతుగా బాలి జగచ్చా రాజచంద్రపూర్ నుంచి కొమిల్లా పారా వరకు భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో […] The post వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు appeared first on Navatelangana.