🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3834 వార్తలు

రేపు పదో తరగతి ఫలితాలు విడుదల
పాత
తెలంగాణ

రేపు పదో తరగతి ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఎస్‌ఎస్‌సి బోర్డ కార్యాలయంలో ఉన్నతాధికారులు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మార్కుల మెమోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. పరీక్ష ఫలితాల కోసం కింద క్లిక్ చేయండి. తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్..
పాత
తెలంగాణ

దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్..

నవతెలంగాణ – హైదరాబాద్ : అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌కు భారత దర్యాప్తు ఏజెన్సీలు భారీ షాక్ ఇచ్చాయి. దావూద్ కీలక అనుచరుడు, నిషేధిత డ్రగ్స్ తయారీలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సలీం డోలాను భారత్‌కు అప్పగించారు. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఆ దేశ జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో డోలాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని భారత్‌కు తరలించారు. ప్రస్తుతం డోలాను ఢిల్లీలోని ఆర్‌కే పురంలో ఉన్న నార్కోటిక్స్ […] The post దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్.. appeared first on Navatelangana.

రేవంత్ రెడ్డి హిట్లర్ ను మించిపోయారు: హరీష్ రావు
పాత
తెలంగాణ

రేవంత్ రెడ్డి హిట్లర్ ను మించిపోయారు: హరీష్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని బిఆర్ఎస్ మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సంగారెడ్డి: కందిలోని సెంట్రల్ జైల్లో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు వంతపాడుతున్న అధికారులను వదిలిపెట్టమని, నేను రాజు.. నేను మంత్రి అన్నట్లుంది రేవంత్ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ అడుగుతారా అనే అహంకార పూరిత దోరణితో వ్యవహరిస్తుందని, విజిలెన్స్, సిఐడి, కమిషన్లు, అక్రమ కేసులు, అరాచకాలను పాల్పడుతున్నారని మండిపడ్డారు. మన్నె క్రిశాంక్ పిఎస్ లో ఫిర్యాదు చేశారని, మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడని, అందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన మొబైల్ ను అందజేశారని అన్నారు.తప్పుడు వార్తలు రాసినోళ్లను కాకుండా ఫిర్యాదు చేసినోళ్లనే అరెస్టు చేశారని, ఫేక్ పోస్టులు పెట్టినోళ్లకు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపారని మండిప

అవినీత్ కౌర్ అందాలు చూస్తే మతిపోవాల్సిందే
పాత
శంషాబాద్ లో వడగాళ్ల వాన... మంచుతో నిండిపోయిన రోడ్లు
పాత
తెలంగాణ

శంషాబాద్ లో వడగాళ్ల వాన... మంచుతో నిండిపోయిన రోడ్లు

హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురిసింది. ముఖ్యంగా శంషాబాద్-నాదర్గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో వడగళ్ల వాన పడింది. రోడ్లన్నీ వడగళ్లతో నిండిపోవడంతో, అచ్చం కశ్మీర్‌ను తలపించేలా మంచు కురిసిన భ్రమ కలిగించింది. ఈ అరుదైన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇవి హైదరాబాద్ హిమాలయాలు అంటూ చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రోడ్లన్నీ తెల్లటి మంచు ముక్కలతో నిండిపోవడం చూసి వాహనదారులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు విస్మయానికి గురవుతున్నారు.

ప్రపంచం గూగుల్ ను ఎంచుకుంటే, గూగుల్ ఎపిని ఎంచుకుంది: చంద్రబాబు
పాత
తెలంగాణ

ప్రపంచం గూగుల్ ను ఎంచుకుంటే, గూగుల్ ఎపిని ఎంచుకుంది: చంద్రబాబు

అమరావతి: గూగుల్ రాక ఎపికి గేమ్ ఛేంజర్ అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది దేశచరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు అని అన్నారు. ఈ సందర్భంగా తుర్లాడలో సిఎం మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్నం చాలా అందమైన ప్రదేశం అని ఎపి చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఈ ప్రాజెక్టు రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం కొనియాడారు. టెక్నాలజీలో ఎపి సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని, ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అని టెక్నాలజీలో దేశానికి ఎపి గేట్ వేగా నిలుస్తుందని చంద్రబాబు తెలియజేశారు. ఎపి భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారబోతుందని, ప్రపంచం గూగుల్ ను ఎంచుకుంటే, గూగుల్ ఎపిని ఎంచుకుందని ఆనందాన్నివ్యక్తం చేశారు. ఎపిలో ఇవాళ్టి నుంచి సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, త్వరలోనే ప్రతీ సిటిజెన్ ఎఐ అసిస్టెంట్ ను ఆశ్రయిస్తారని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికాను కలిపేలా కేబుల్ నిర్మాణం అని ఎపి లాజిస్టిక్ హబ్ గా మారాలన్నదే తన లక్ష్యం అని దీనికి కేంద్రం నుంచి మద్దతు కోరుతున్నామని అన్నారు. ఎంవోయూ చేసుకోవడమే కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఫోకస్ పెడుతున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

నిజామాబాద్‌లో ఉదయం కూతురు పెళ్లి... రాత్రి తండ్రి ఆత్మహత్య
పాత
తెలంగాణ

నిజామాబాద్‌లో ఉదయం కూతురు పెళ్లి... రాత్రి తండ్రి ఆత్మహత్య

నిజామాబాద్: ఉదయం కుమారుడి పెళ్లి చేసి అనంతరం రాత్రి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నందిగామ గ్రామంలో ఎల్కా దేవన్న-సాయమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవన్నకు వందకు పైగా మేకలు ఉన్నాయి. మేకలు కాపరిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు పెళ్లి కోసం 30 మేకలను అమ్మాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చెందిన యువకుడికి కూతురు ఇచ్చి పెళ్లి చేశాడు. అనంతరం తన బంధువులతో కలిసి ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి ముందు మేకల మంద తగ్గిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే తన రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకొని చనిపోయాడు. దేవన్న ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సాయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక్కడికి రాగానే మనసు ఎంతో ఉల్లాసంగా మారింది: మోడీ
పాత
డైటీషియన్‌ను చంపిన భర్త... మృతదేహాన్ని చెక్క పెట్టెలో సిమెంట్‌తో పూడ్చి
పాత
తెలంగాణ

డైటీషియన్‌ను చంపిన భర్త... మృతదేహాన్ని చెక్క పెట్టెలో సిమెంట్‌తో పూడ్చి

అహ్మదాబాద్: భార్యపై అనుమానంతో ఆమెను భర్త చంపి అనంతరం పూర్వీకుల ఇంట్లో చెక్కపెట్టేలో మృతదేహాన్ని సిమెంట్‌తో పూడ్చి పెట్టిన సంఘటన గుజరాత్‌లో సూరత్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సలబత్‌పూరాలో విశాల్ సాల్వి-శిల్ప అనే దంపతులు నివసిస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిల్ప ఎంఎస్ చేసి పూర్తి చేసి సూరత్ మున్సిపల్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ రిసెర్చ్ సెంటర్‌లో డైటీషియన్‌గా జాబ్ చేస్తోంది. సొంతంగా క్లీన్‌క్ కూడా నిర్వహిస్తోంది. గతంలో విశాల్ డైమండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. గత కొంత కాలంగా ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. గత కొంత కాలంలో భార్య మరొకరుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. పలుమార్లు ఫోన్‌లో కాల్స్ చెక్ చేయడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను భర్త చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆమెన తన పూర్వీకులు ఉండే ఇంటికి తీసుకెళ్లి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని చెక్క పెట్టెలో పెట్టి సిమెంట్ పూత పూశాడు. అనంతరం తన భార్య కనిపించడంలేదని పోలీస్

రగులుతున్న రాజకీయ హింసాగ్ని
పాత
తెలంగాణ

రగులుతున్న రాజకీయ హింసాగ్ని

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఆదివారంనాడు జరిగిన హత్యాయత్నంపై ప్రపంచమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ హత్యాయత్నానికి దారి తీసిన కారణాలపై చర్చ తీవ్రంగా జరుగుతోంది. అమెరికాలో రాజకీయ హింస అనేది కొత్తేమీ కాదు. ఆ దేశచరిత్రలో తుపాకీ సంస్కృతి ఒక భాగమై పోయింది. రిపబ్లికన్ అధినేత అబ్రహం లింకన్ 1865లో హత్యకు గురికాగా, అప్పటి నుంచి 1963లో జాన్ ఎఫ్. కెన్నడీ వరకు అధికారంలో ఉన్న నలుగురు అధ్యక్షులు హత్యకు గురయ్యారు. 2007 కాంగ్రెసనల్ రీసెర్చి సర్వీస్ నివేదిక ప్రకారం ప్రభుత్వ అధినేతలుగా ఉన్న 45 మంది ప్రముఖుల్లో 10 మందిపై ప్రత్యక్ష దాడులు జరిగినట్టు తేలింది. ఇక హత్యాయత్న వైఫల్యాలు, బెదిరింపులు తదితర సంఘటనలు 30కి పైగా జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా 2024లో కూడా ట్రంప్‌పై రెండుసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఈ సంఘటనను రిపబ్లికన్లు, డెమోక్రాట్లు తమ రాజకీయ ప్రయోజనాలకు అన్వయించుకుంటున్నారు. ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్లు ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా విమర్శిస్తుండగా, ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రేరేపించడం, ద్వేషపూరిత హెచ్చరికలు ఇవే ట్రంప్‌పై దాడికి కారణమవుతున్నాయని డెమోక్రాట్లు ఆగ్రహ

నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు
పాత
తెలంగాణ

నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాసులకు కూడా రాత్రి లోపు మోస్తరు నుంచి భారీ ఉరుములతో […] The post నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన..!
పాత
తెలంగాణ

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన..!

నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశాలోని కియోన్‌ఝర్‌ జిల్లాలో మానవత్వాన్ని తలదన్నేలా, నిబంధనలు ఓ నిరుపేద జీవితంతో ఎలా ఆడుకున్నాయో తెలిపే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.19,300 విత్‌డ్రా చేసుకునేందుకు, ఆమె అస్థిపంజరాన్ని భుజాలపై మోసుకుంటూ ఓ వ్య‌క్తి సుమారు 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు […] The post సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన..! appeared first on Navatelangana.

మణిపూర్‌లో శాంతి మృగ్యమేనా?
పాత
తెలంగాణ

మణిపూర్‌లో శాంతి మృగ్యమేనా?

మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి ఆధారిత హింస ఇక అప్పుడప్పుడు చెలరేగే సంక్షోభం కాదు; సులభంగా అదుపు చేయలేని స్థిరమైన ధోరణిగా మారింది. దీన్ని లక్ష్యంగా చేసుకుని హత్యలు, పేలుళ్లు, వదంతులతో చెలరేగే ఘర్షణలు.. ఏ కొత్త ఘటన జరిగినా, ఆగ్రహం, సమీకరణ, ప్రతీకార దాడులుగా మారే పాత చక్రంలోనే కలిసిపోతున్నాయి. ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం హింస పునరావృతం కావడం మాత్రమే కాదు; అది క్రమంగా సాధారణంగా మారిపోవడం. రాజకీయ నాయకత్వ మార్పులు జరిగినా, కేంద్ర జోక్యం జరిగినా పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు. ఇది సమస్య మరింత లోతుగా ఉన్నదని సూచిస్తోంది. దీర్ఘకాలిక, సృజనాత్మక, నిష్పాక్షిక చర్యలు అవసరమైన ఈ ఘర్షణను ఎదుర్కోవడంలో రాజకీయ సంకల్పానికి పరిమితులు ఉన్నాయని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. జాతి ఘర్షణలు ఏ ప్రభుత్వానికైనా అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటి. వీటికి ఒక్క కారణం ఉండదు; చారిత్రక అసంతృప్తులు, గుర్తింపు రాజకీయాలు, సంవత్సరాలుగా పేరుకుపోయిన అనుమానాలు కలిసి ఈ సమస్యలను కొనసాగిస్తాయి. మణిపూర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి ఘటనను వెంటనే జాతి కోణంలోనే చూడడం అక్కడ సాధారణమైపోయింది. నిజాల కంటే పరస్

డబ్బులు ఇవ్వడం లేదని... అక్క అస్థిపంజరంతో బ్యాంక్ కు చేరుకున్న తమ్ముడు
పాత
తెలంగాణ

డబ్బులు ఇవ్వడం లేదని... అక్క అస్థిపంజరంతో బ్యాంక్ కు చేరుకున్న తమ్ముడు

భువనేశ్వర్: అక్క చనిపోయిందని ఆమె అకౌంట్‌లో ఉన్న డబ్బులు ఇవ్వడంలేదని సోదరి అస్థిపంజరంతో బ్యాంక్‌కు చేరుకొని తమ్ముడు నిరసన తెలిపిన సంఘటన ఒడిశా రాష్ట్రం కేంఝర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... దియానల్లి గ్రామంలో గ్రామంలో జీతూ ముండా(50) అనే గిరిజనుడు నివసిస్తున్నాడు. జీతూ అక్క కల్రా ముండా(56)కు మాలిపోసిలోని గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. జనవరి 26న ఆమె మృతి చెందడంతో ఆమె ఖాతాలో రూ.20 వేల రూపాయలు ఉన్నాయి. జీతూ పలుమార్లు బ్యాంకు అధికారులను కలిసి తన అక్క ఖాతాలో డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఖాతాదారుడు వస్తేనే డబ్బులు ఇవ్వడం జరుగుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. తన అక్క చనిపోయిందని బ్యాంకు అధికారులకు తెలిపాడు. ఆయినా కూడా అతడి మాటాలను బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. దీంతో అతడు అక్క అస్థిపంజరాన్ని తీసుకొని బ్యాంక్‌కు వెళ్లడంతో ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. వెంటనే బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డబ్బు విత్ డ్రా చేసి ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి జీతూ వెళ్లిపోయాడు.

రేవంత్-మహేష్ ద్వయం కాంగ్రెస్ భవితకు దిక్సూచి
పాత
తెలంగాణ

రేవంత్-మహేష్ ద్వయం కాంగ్రెస్ భవితకు దిక్సూచి

రాజకీయాల్లో అధికారాన్ని సాధించడం ఒక ముఖ్య ఘట్టం అయితే, ఆ అధికారాన్ని ప్రజల విశ్వాసంగా నిలబెట్టి తిరిగి ప్రజాతీర్పు పొందడం అసలైన నాయకత్వ పరీక్ష. ప్రస్తుతం ఈ పరీక్షను ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ల జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకశక్తిగా మారింది. రేవంత్‌రెడ్డి పలుమార్లు.. ‘నేను- మహేష్ కలిసి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం’ అనే వ్యాఖ్య ఒక రాజకీయ నినాదం కన్నా ఎక్కువే అని చెప్పక తప్పదు. అది పార్టీ- ప్రభుత్వ సమన్వయానికి ఇచ్చిన సంకేతం. పాలనలో విశ్వాసాన్ని నిర్మించడం, ఆ విశ్వాసాన్ని ఓట్లుగా మలచడం ఈ రెండు భిన్నదశలను సమన్వయం చేయాల్సిన అవసరాన్ని సిఎం రేవంత్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ధోరణిని గమనించవచ్చు. తెలుగుదేశం పార్టీ 1994 నుంచి 2004 వరకు, ఆ తర్వాత కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు, రాష్ట్ర విభజన అనంతరం బిఆర్‌ఎస్ 2014 నుంచి 2023 వరకు అధికారంలో కొనసాగాయి. ఈ వరుసలో ప్రజలు ఒకే పార్టీకి నిరంతరంగా అధికారం ఇవ్వకుండా, కాలానుగుణంగా మార్పును కోరుకున్నారని స్పష

ధరిత్రి దినోత్సవం మనకు వద్దా?
పాత
తెలంగాణ

ధరిత్రి దినోత్సవం మనకు వద్దా?

ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరపాలని 1970లో ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఆ సంవత్సరం ఏప్రిల్ 22న అమెరికన్లు లక్షలాదిగా భూమి రక్షణకై వివిధ రాష్ట్రాలలో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. పర్యావరణ రక్షణకై శాస్త్రవేత్తలు, మేధావులు తపించిన దశాబ్దంగా 70 దశకాన్ని పేర్కొనవచ్చును. శాస్త్రవేత్తల అంచనాలను మించి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుండటంవల్ల మట్టి వేడెక్కుతున్నది. నీటిలో, వాతారణంలో ఉష్ణోగ్రతలు ఏటేటా పెరుగుతున్నవి. మన దేశం తొలిసారిగా 1990, ఏప్రిల్ 22న భూమి దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులతో భూమి వేడెక్కడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించడం వంటి కార్యక్రమాలను నిర్వహించాయి. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించడంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి కారణం భూమిపై ఏ మేరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి? దాని ప్రభావం వలన వాతావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, ప్రాణులకు ఏ విధమైన నష్టం సంభవిస్తున్నది? అనే అంశాలపై ఎవరికీ పెద్దగా

పీవీ సింధుకు అరుదైన గౌరవం
పాత
తెలంగాణ

పీవీ సింధుకు అరుదైన గౌరవం

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ సభ్యురాలిగా అరుదైన గౌరవం లభించింది. గత ఏడాది డిసెంబర్‌లో బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్‌లోకి ఎంపికైన ఆమె, ఇప్పుడు అధికారికంగా కౌన్సిల్ సభ్యురాలిగా గుర్తింపు పొందారు. శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె తన కొత్త హోదాలో పాల్గొని, ప్లేయర్ల తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తూ షట్లర్ల తరఫున సూచనలు అందించారు. […] The post పీవీ సింధుకు అరుదైన గౌరవం appeared first on Navatelangana.

IPL-2026: నేడు పంజాబ్  కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్
పాత
చిత్తూరులో జర్నలిస్టు దారుణ హత్య
పాత
తెలంగాణ

చిత్తూరులో జర్నలిస్టు దారుణ హత్య

నవతెలంగాణ – తిరుపతి: చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం రహమత్‌నగర్‌లో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వేట కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా నరికి చంపారు. దీంతో అక్కడిక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. […] The post చిత్తూరులో జర్నలిస్టు దారుణ హత్య appeared first on Navatelangana.

మంచి క్యామియో రోల్ చేశా
పాత
తెలంగాణ

మంచి క్యామియో రోల్ చేశా

డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ’గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను ఒక మంచి క్యామియో రోల్ చేశా. నా పాత్ర పేరు శాలిని. తను ఒక వ్లాగర్. ఇందులో తరుణ్‌తో ఒక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. -మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. ఆయనతో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో శ్రీ విష్ణు క్యారెక్టర్ చాలా ఆస

మక్కజొన్నల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
పాత
పర్యాటక కేంద్రాలను  సందర్శించిన ఆఫీసర్లు
పాత
మందమర్రిలోని కన్నులపండువగా  శ్రీనివాసుడి కల్యాణం
పాత
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)