
3834 వార్తలు



రాయ్‌పూర్: ఎంబిఎ విద్యార్థినిపై దుకాణాదారుడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భుబానేశ్వర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ యువతి ఎంబిఎ చదువుకుంటూ ఓ రూమ్ తన అద్దెకు తీసుకొని ఉంటుంది. రూమ్‌లో స్నేహితురాలితో కలిసి ఉంటుంది. 67 ఏళ్ల వృద్ధుడు కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అతడు సరుకులను డోల్ డెలవరీ కూడా చేస్తున్నారు. ఎంబిఎ విద్యార్థిని అవసరాల నిమిత్తం నిత్యావసరాలు బుక్ చేసుకుంది. 67 ఏళ్ల వృద్ధుడు వస్తువు తీసుకొని యువతి రూమ్‌కు చేరుకొని డోర్ తట్టాడు. వెంటనే ఆమె వస్తువు తీసుకుంది. అంతకు ముందే వృద్ధుడు యువతికి తెలియడంతో మంచి నీళ్లు అడిగాడు. రూమ్‌లో ఎవరు లేరని గమనించి వెంటనే డోర్ లోక్ చేసి యువతిపై అత్యాచారం చేశాడు. వెంటనే యువతి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.





హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు విశ్వరూపం చూపిస్త్తున్నాడు. భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతుంది. మండిపోతున్న ఎండల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుం డటంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలుపెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో మనకు పగటి పూట చుక్కలు కనిపిస్తాయి. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఎలా ఉంటుందో తెలిస్తేనే భయం వేస్తోంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్క రోజు వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇతర జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. వడదెబ్బతో మంచిర్యాల జిల్లాలో భోగారపు మార









అమరావతి: ఇద్దరు బాలుర్లు ఫోన్లలో ఆడుకుంటుండగా ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఓ బాలుడిని చంపేసి అనంతరం మృతదేహాన్ని పూడ్చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విందూరు ప్రాంతంలోని మర్రిపల్లిమడుగు గ్రామ శివారులోని ఓ తోటలో రెండు కుటుంబాలు పని చేస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందిన 17 ఏళ్ల బాలుడు, ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడు. ఇద్దరు ఫోన్‌లో ఆడుకుంటుండగా గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో 17 ఏళ్ల బాలుడు మరో బాలుడి గొంతు నులిమి హత్య చేశాడు. భయంతో అక్కడే గుంటలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. తన కుమారుడు కనిపించడంతో గూడూరు పిఎస్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.



ముంబయి: బంధువులతో కలిసి బిర్యానీ తిన్నం తరువాత ఓ కుటుంబ సభ్యులు పుచ్చకాయ తినడంతో ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రాలోని ముంబయిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పైధోనీలో అబ్దుల్లా కాదర్(40), నస్రీన్(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఆయేషా(16), జైనాబ్(12)లు ఉన్నారు. కాదర్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. బంధువుల ఇంట్లో వేడుక ఉండడంతో అబ్దుల్లా కుటుంబం వెళ్లింది. వింధులో బిర్యానీ తరువాత ఇంటికి వచ్చారు. రాత్రి ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. ఆదివారం ఉదయం ఐదు గంటల వాంతులు, విరేచనాలు కావడంతో వారు స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫుడ్ పాయిజన్‌తోనే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్: ‘బిఆర్‌ఎస్ అధినే త, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మర మనిషా.. మనసున్న మనిషా? అనే కవిత ప్రశ్నలకు తొలుత కెసిఆర్ జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ) పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కౌ న్సిల్ ఆవరణలోని తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. భ విష్యత్తులో బిజెపితో కలిసి పోటీ చేయబోమని కె సిఆర్ ఒట్టేసి చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించా రు. కెసిఆర్‌కు చెడు జరగాలని ఆ కుటుంబ సభ్యు లే తప్ప ఎవరూ కోరుకోవడం లేదన్నారు. కెసిఆర్ తనకు శత్రువు కాదు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆయన చెప్పారు. కెసిఆర్ విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి మాత్రమేనని అన్నారు. బిఆర్‌ఎస్ చచ్చిన శవంతో సమానమని, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ పేరిట కవిత ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ గురించి ప్రశ్నించగా, బిఆర్‌ఎస్‌కే మనుగడ లేనప్పుడు కొత్త పార్టీ గురించి ఏమి మాట్లాడాలని ఆయన దాట వేశారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్‌కు సంబంధాలు తెగిపోయాయని అన్నారు. రా

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ మిన హా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ పార్టీ అధినేత కె.చం ద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అన్ని స్థా యిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్‌కు అప్పగించారు. వెంటనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో సోమవారం అధినేత కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ ర జతోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భం గా కెటిఆర్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. లో క్‌సభలో బిఆర్‌ఎస్ సభ్యులు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇటీవల లోక్‌సభలో బిజెపి ఎంపి తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఒక్కమాట మాట్లాడలేదని, బిఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లని పేర్కొన్నారు. హెచ్చరించారు. కాళేశ్వరంపై రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడితే బిఆర్‌ఎస్ పక్షనేత సురేశ్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: సాదా బైనామాల దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కరే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరిం త వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీఓలకే అధికారాలను ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అత్యం త ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సోమవారం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్