
3844 వార్తలు



అమరావతి: ఇద్దరు బాలుర్లు ఫోన్లలో ఆడుకుంటుండగా ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఓ బాలుడిని చంపేసి అనంతరం మృతదేహాన్ని పూడ్చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విందూరు ప్రాంతంలోని మర్రిపల్లిమడుగు గ్రామ శివారులోని ఓ తోటలో రెండు కుటుంబాలు పని చేస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందిన 17 ఏళ్ల బాలుడు, ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడు. ఇద్దరు ఫోన్‌లో ఆడుకుంటుండగా గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో 17 ఏళ్ల బాలుడు మరో బాలుడి గొంతు నులిమి హత్య చేశాడు. భయంతో అక్కడే గుంటలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. తన కుమారుడు కనిపించడంతో గూడూరు పిఎస్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.



ముంబయి: బంధువులతో కలిసి బిర్యానీ తిన్నం తరువాత ఓ కుటుంబ సభ్యులు పుచ్చకాయ తినడంతో ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రాలోని ముంబయిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పైధోనీలో అబ్దుల్లా కాదర్(40), నస్రీన్(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఆయేషా(16), జైనాబ్(12)లు ఉన్నారు. కాదర్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. బంధువుల ఇంట్లో వేడుక ఉండడంతో అబ్దుల్లా కుటుంబం వెళ్లింది. వింధులో బిర్యానీ తరువాత ఇంటికి వచ్చారు. రాత్రి ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. ఆదివారం ఉదయం ఐదు గంటల వాంతులు, విరేచనాలు కావడంతో వారు స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫుడ్ పాయిజన్‌తోనే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్: ‘బిఆర్‌ఎస్ అధినే త, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మర మనిషా.. మనసున్న మనిషా? అనే కవిత ప్రశ్నలకు తొలుత కెసిఆర్ జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ) పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కౌ న్సిల్ ఆవరణలోని తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. భ విష్యత్తులో బిజెపితో కలిసి పోటీ చేయబోమని కె సిఆర్ ఒట్టేసి చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించా రు. కెసిఆర్‌కు చెడు జరగాలని ఆ కుటుంబ సభ్యు లే తప్ప ఎవరూ కోరుకోవడం లేదన్నారు. కెసిఆర్ తనకు శత్రువు కాదు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆయన చెప్పారు. కెసిఆర్ విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి మాత్రమేనని అన్నారు. బిఆర్‌ఎస్ చచ్చిన శవంతో సమానమని, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ పేరిట కవిత ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ గురించి ప్రశ్నించగా, బిఆర్‌ఎస్‌కే మనుగడ లేనప్పుడు కొత్త పార్టీ గురించి ఏమి మాట్లాడాలని ఆయన దాట వేశారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్‌కు సంబంధాలు తెగిపోయాయని అన్నారు. రా

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ మిన హా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ పార్టీ అధినేత కె.చం ద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అన్ని స్థా యిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్‌కు అప్పగించారు. వెంటనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో సోమవారం అధినేత కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ ర జతోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భం గా కెటిఆర్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. లో క్‌సభలో బిఆర్‌ఎస్ సభ్యులు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇటీవల లోక్‌సభలో బిజెపి ఎంపి తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఒక్కమాట మాట్లాడలేదని, బిఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లని పేర్కొన్నారు. హెచ్చరించారు. కాళేశ్వరంపై రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడితే బిఆర్‌ఎస్ పక్షనేత సురేశ్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: సాదా బైనామాల దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కరే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరిం త వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీఓలకే అధికారాలను ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అత్యం త ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సోమవారం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్

మన తెలంగాణ/హైదరాబాద్: ఆయిల్ కంపెనీల మాయాజాలం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి బంక్‌లకు పెట్రోల్, డీజిల్ సరఫరాను తగ్గించాయి. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచి తమ నష్టాలను పూడ్చుకోవడానికి ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. మూడు రోజులుగా డబ్బులు చెల్లించి న బంక్‌లకు సైతం పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేయకపోవడంతో బంక్ ల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న బంక్‌ల్లో వా హనాల రద్దీ పెరుగుతోంది. ఈనెల 29వ తేదీన పశ్చిమబెంగాల్‌లో రెం డో విడత ఎన్నికలు అయిపోగానే ఆయిల్ ధరలను విడతల వారీగా పెం చే ఉద్ధేశ్యంలో భాగంగా బంక్‌లకు ఆయిల్ సరఫరాను కంపెనీలు తగ్గించాయని తెలిసింది. దీనిపై బంక్‌ల యజమానులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా ఆయిల్ కంపెనీలు సివిల్ సప్లయ్ అధికారులు చర్చలు చేపట్టినట్టుగా సమాచారం.దీనికితోడు ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిల్వలు తగ్గాయని అందుకే బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో వాహనదారులు భయంతో బంక్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఆయిల్ కంపెనీ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, సోమవారం ఒక మహిళను ఉద్దేశించి, సమ్మతితో ఉన్న సంబంధంలో నేరం అనే ప్ర శ్న ఎక్కడుంది? అని ప్ర శ్నించింది. తప్పుడు వివాహ హామీతో లైంగిక దాడి చేశాడం టూ తన మాజీ సహజీవన భాగస్వామిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వును ఆమె స వాల్ చేసింది. న్యాయమూర్తులు బి.వి. నాగర త్న, ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. మహిళ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చాలా కాలం పాటు కలిసి నివసించారని, వారికి ఒక సంతానం కూడా ఉందని ధర్మాసనం గమనించింది. వీరిరువురూ కలిసి జీవించారు. వారికి ఒక బిడ్డ కూడా ఉంది. వివాహం జరగలేదని ఇప్పుడు లైంగిక దాడి అంటున్నారు. 15 సంవత్సరాలు కలిసి జీవించారు అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. మహిళ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఆమె భర్త మరణించిన తర్వాత తన బావ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో పరిచ యం ఏర్పడిందని తెలిపారు. వివా హం చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను లైంగికంగా వేధించాడని కోర్టుకు వివరించారు. దీనిపై జస్టి స్ నాగరత్న స్పందిస్తూ, అయితే వివాహానికి ముందే ఎందుకు అతని తో కలిసి జీవించింది? అని ప్రశ్నించా రు. ఆమె అతనితో కలిసి సహజీవనం చేసిం

మన తెలంగాణ/శంకర్‌పల్లి: గాలివాన నుంచి ప్రాణాలు కాపాడుకుందామని షెడ్డు కిందకు వె ళ్లిన కార్మికులకు, అదే షెడ్డు మృత్యుపాశమైంది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని ఎన్‌సిసి (నాగార్జున కన్స్ట్రక్షన్స్) కంపెనీలో భారీ క్రేన్ షెడ్డుపై విరిగిపడటంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం శంకర్ పల్లి మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలివాన మొదలైంది. ఆ సమయంలో ఎన్‌సిసి కంపెనీ బ్రిక్స్, భారీ స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికులు వర్షం నుంచి తలదాచుకునేందుకు సమీపంలోని ఒక రేకుల షెడ్డు కిందకు చేరారు. అయితే గాలి తీవ్రతకు షెడ్డు పక్కనే ఉన్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి కార్మికులు ఉన్న షెడ్డుపై కుప్పకూలింది. భారీ క్రేన్ ఒక్కసారిగా పడటంతో షెడ్డు కింద ఉన్న వారు తప్పించుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. క్రేన్ ఇనుప విడిభాగాల కింద నలిగి ఐదు మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా సమయంలో షెడ్డు కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండటంతో క్షతగాత్రుల సంఖ
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మధిరలో ఆది వెంకటేశ్వర్లు సంస్మరణ సభనవతెలంగాణ-మధిరకార్మికులు, కర్షకుల హక్కుల కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్ని కడదాకా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు (పెద్దబ్బాయి) అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్‌లో సోమవారం పార్టీ పట్టణ కార్యదర్శి పడకంటి మురళి అధ్యక్షతన ఆది వెంకటేశ్వర్లు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. […] The post కార్మికుల కోసం కడదాకా నిలిచిన వ్యక్తి పెద్దబ్బాయి appeared first on Navatelangana.
రైతులు సద్వినియోగం చేసుకోవాలిశాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయం లాభసాటి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణనవతెలంగాణ- అశ్వారావుపేటరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ కె.నాగాంజలి, డాక్టర్ ఐ.కృష్ణతేజ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామంలో ”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు […] The post రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతతో ‘నో స్టాక్ బోర్డులు’ కనపడుతున్నాయనీ, దీంతో రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలి రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లాభాపేక్షతోనే ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని తెలిపారు. కేంద్ర […] The post పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలి appeared first on Navatelangana.
వేతన సవరణ చట్టాలను అమలు చేయాలిఐఎల్‌ఓ సమావేశాలను జరపాలి :సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబునవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధిచికాగో నగరంలో 140 ఏండ్ల కిందట 8 గంటల పని విధానంకోసం పోరాడి ప్రాణా లొదిలిన అమరులను స్మరిం చుకుంటూ.. భారతదేశంలో సామాన్య ప్రజలపై జరుగు తున్న దాడులను ప్రతిఘటిం చేందుకు కార్మికులను సంఘటిత పరిచి సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని […] The post చికాగో పోరాటస్ఫూర్తితో మేడే ఉత్సవాలు appeared first on Navatelangana.
ఆమోదించిన రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్‌మూడుకు పడిపోయిన ఆప్ ఎంపీల సంఖ్యనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆమోదం తెలిపినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ విలీనంతో బీజేపీ సంఖ్యాబలం భారీగా పెరిగింది. ఆప్ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. […] The post బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం appeared first on Navatelangana.
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు కేజ్రీవాల్ నిరాకరణహైకోర్టు న్యాయమూర్తికి లేఖమహాత్ముని సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తానని వెల్లడినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు కేజ్రీవాల్ న్యాయమూర్తికి లేఖ రాస్తూ కోర్టుపై తనకు ‘నమ్మకం పోయిందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అంతరాత్మ […] The post న్యాయంపై నమ్మకం లేదు appeared first on Navatelangana.
రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల దుకాణాల బంద్ విజయవంతం : తెలంగాణ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లునవతెలంగాణ- వరంగల్‌ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జాతీయ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు దుకాణాలను మూసేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ […] The post ఫర్టిలైజర్స్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.

న్యూఢిల్లీ : బారత్ న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) ఇరుదేశాలకు ఎంతో మేలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం ఇరుదేశాల నడుమ కీలక ఎఫ్‌టిఎ కుదిరిన తరువాత ప్రధాని మోడీ స్పందించారు. ఎఫ్‌టిఎ ఇరుదేశాల వ్మూహాత్మక భాగస్వామ్య బంధాన్ని మలుపు తిప్పుతుంది. ప్రత్యేకించి రైతులు, యువజనులు, ఎంఎస్‌ఎంఇలకు ఇతోధిక ప్రయోజనం తథ్యం అని తెలిపారు. ఇరు దేశాల పురోగమన దిశలో ఈ ఎఫ్‌టిఎ మైలురాయి అయి తీరుతుందన్నారు. ఇరుదేశాల మధ్య సోమవారం ఎఫ్‌టిఎపై సంతకాలు జరిగాయి. భారతదేశంలో పర్యటిస్తోన్న న్యూజీలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్‌క్లేతో భారత వాణిజ్య వ్యవహారాల మంత్రి పియూష్ గోయల్ విస్తృత చర్చల తరువాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇ ప్పటి ఒప్పందంతో విద్యార్థులు, యువతకు అత్యధిక ప్రయోజ నం చేకూరేందుకు రంగం సిద్ధం అయిందని ప్రధాని మోడీ తెలిపారు. పలు స్టార్టప్‌లు వెలుస్తాయి. వృత్తి నైపుణ్య ఐటి ప్రతిభావంతులకు ఉద్యోగ ఉపాది అవకాశాలు మెరుగుపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి ఎఫ్‌టిఎతో న్యూజీలాండ్‌కు భారతీయ ఎగుమతులపై నూటికి నూరుశాతం సుంకం రహిత పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా
హాజరైన సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కోరిక నెరవేరింది. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాంతోపాటు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ సోమవారం శాసనమండలి సభ్యులు(ఎమ్మెల్సీగా) ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఇరువురికి అభినందనలు తెలియజేశారు. […] The post ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్ ప్రమాణం appeared first on Navatelangana.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మార్క్‌ఫెడ్ విఫలంనవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధిఈఏడాది అంచనాలకు మించి మొక్కజొన్న పంట దిగుబడి వచ్చింది. మార్కెట్లు, రోడ్లు ఎక్కడ చూసినా మక్క నిల్వలు కనిపిస్తున్నాయి.. దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం.. కాంటాలు పెట్టడంలో మార్క్‌ఫెడ్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట మండలానికి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి సగం మండలాల్లోనే పెట్టారు. ఎటు చూసినా మొక్కజొన్నల కుప్పలు, లోడైన ట్రాక్టర్లు, లారీలు కనిపిస్తున్నాయి. కాంటాలు కాక రైతులు […] The post మార్కెట్‌లో రోడ్ల నిండా మక్కలే.. appeared first on Navatelangana.
దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నాఅర్హత ఉంటే ఇల్లు ఇస్తాంఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుసాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయంతహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలుప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంసర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు […] The post ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్లకు మరిన్ని అధికారాలు appeared first on Navatelangana.