21100 వార్తలు


ఛత్రపతిశంభాజీనగర్ (మహారాష్ట్ర): సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్ ఆయనకు విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తన నివాసం వద్ద ప్రజలను కలుసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా అసౌకర్యం అనిపించి ఇంట్లోకి వెళ్లగానే ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయని డాక్టర్ చెప్పారు. శనివారం ఆయన నివాసం వద్ద పార్కింగ్ ఏరియాలో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఆయన కోసం ప్రజలు వేచి ఉండగా ఆయన వారిని కలుసుకోవడానికి ప్రయత్నించారు. అక్కడ వాంతులు కాగానే మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లిపోయారు.ఆ తరువాత డాక్టర్ వచ్చి పరీక్షించారని అభిజీత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే వెల్లడించారు. దీప్కేను పరీక్షించిన డాక్టర్ విశాల్ లహనే దీప్కే ఆరోగ్య పరిస్థితి వివరించారు. దీప్కే రక్తపోటు స్వల్పంగా తక్కువ స్థాయిలో 100/60లో ఉందన్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఉదయం నుంచి ఆయనకు వికారంగా ఉందన్నారు. రెండుసార్లు ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయన్నారు. ఆయనకు ఇంట్రావీనస్ ద్రవాలు అందించడమైందని, రోజంతా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు డాక్టర్ చెప్పారు. ప్ర

న్యూఢిల్లీ : దేశంలో యుపిఐ లావాదేవీల జోరు కొనసాగుతూ... తాజాగా అది సరికొత్త రికార్డును సృష్టించింది. జులైలో రూ.29.88లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ మేరకు శనివరం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే 22శాతం అదనంగా లావాదేవీలు జరిగినట్లు ఎన్‌పిసిఐ వెల్లడించింది. అయితే విలువ పరంగా అది 19శాతంగా తెలిపింది. జులైలో రోజుకు సగటుగా 96వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. దేశంలో పట్టణాలు, నగరాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయిలోకి సైతం యుపిఐ లావాదేవీలు చొచ్చుకు పోవడం వల్లే ఇది సాధ్యమైందని పేమెంట్స్ కార్పొరేషన్ ప్రకటనలో పేర్కొంది. రీఛార్జ్‌ల కోసం కూడా ప్రజలు డిజిటల్ లావాదేవీలనే ఉపయోగిస్తున్నారని వివరించింది.

కొచ్చి: కేరళ లోని కేరళ, ఇడుక్కి,కొట్టాయం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడి ముగ్గురు మరణించారు. వాగమాన్ జిల్లాలో కొండచరియలు విరిగి పడి ఒకరు మరణించారు. ప్రభాకరన్ నాయర్ అనే అతని మృతదేహం ఇంకా లభించలేదు. ఇడుక్కి జిల్లా లోని ఒక ఇంటిపై కొండ చరియలు విరిగి పడటంతో ఇంట్లో ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పూంజార్ ప్రాంతంలో ఒక ఇంటిపై కొండ చరియలు విరిగి పడటంతో ఇల్లు పూర్తగా ధ్వంసమై ఇద్దరు చిక్కుకున్నారు. రాష్ట్రం లోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. 183 జాతీయ రహదారి పై వంది పెరియార్ ప్రాంతం జలమయమైంది. ఎరాట్టుపేట, కంజిరాపల్లి, కూట్టిక్కల్, ఎరమెలి వంటి అనేక పట్టణాలు నీట మునిగాయి. వయనాడ్‌తో సహా అనేక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

న్యూఢిల్లీ : జిస్‌టి వసూళ్లలో దేశం మరింత పురోగతిని సాధించింది. జులై నెలకు సంబంధించిన వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ శనివారంనాడు విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం రూ.2.11 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు నమోదైనట్లు వెల్లడించింది. గత ఏడాది జులైతో పోలిస్తే ఇది 15.4 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జిఎస్‌టి వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం రెండోసారి. అంతకుముందు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2.43 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.దేశీయ వ్యాపార లావాదేవీల నుంచి వచ్చిన పన్ను ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దిగుమతులపై లభించిన స్థూల పన్ను ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.66,511 కోట్లకు పెరిగింది. జులై నెలలో కేంద్ర జిఎస్‌టి రూ.39,835 కోట్లు, రాష్ట్ర జిఎస్‌టి రూ.47,881 కోట్లు, సమీకృత జిఎస్‌టి రూ.1.23 లక్షల కోట్లు నమోదయ్యాయి. జులై నెలలో మొత్తం రూ.29,968 కోట్ల రీఫండ్లు జారీ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వాటిని మినహాయించిన తర్వాత నికర జిఎస్‌టి వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణలో రూ.5,819 కోట్ల జిఎస్‌టి వసూళ్లు నమోదైనట్లు వెల్లడించింది. ఇది గత

వాణిజ్య సిలిండర్ ధర రూ.192 తగ్గింపుపెంచిన ధరలు క్రమంగా తగ్గిస్తూ వస్తున్న చమురు సంస్థలురెండు నెలల్లో ఇది రెండో భారీ తగ్గింపున్యూఢిల్లీ : హోటళ్లు, రెస్టారెంట్లు, తదితర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌పై ధరలను రూ.192 తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా కొంతకాలంగా వరుసగా పెరిగిన ధరలు.. తాజాగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవలి కాలంలో కమర్షియల్ సిలిండర్‌పై ఇది వరుసగా రెండో తగ్గింపు కావడం విశేషం. జులైలో వాణిజ్య సిలింబర్ ధరలను రూ.183 తగ్గించిన సంగతి తెలిసిందే.శనివారం మరో రూ.192 రూపాయలను తగ్గించారు. దీంతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.202 తగ్గి రూ.2,728కు చేరింది. కోల్‌కతాలో రూ.209 తగ్గి రూ.2,872.50కి చేరింది. మరోవైపు ఐదు కిలోల మార్కెట్ ధరకు సరఫరా చేసే సిలిండర్‌ను రూ.808 నుంచి రూ.762కు తగ్గించారు. ముంబై, చెన్నై, హైదారాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో కూడా గణనీయంగా ధరలు తగ్గాయి.అయితే ఈ తగ్గింపు వాణిజ్య వినియోగ సిలిండర్లకే పరిమితం. గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ

న్యూఢిల్లీ: జాతీయతను నిర్ధారించాకే విదేశీయులను వారి స్వదేశానికి డిపోర్ట్ చేస్తామని, ఎవరైనా వ్యక్తి జాతీయతను ధ్రువీకరించడానికి విదేశాలు అంగీకరించకుంటే వారిని బహిష్కరించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. అస్సాంలో విదేశీయులుగా ప్రకటించిన కొందరిని స్వదేశాలకు పంపకుండా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.ఒక విదేశీయుడికి శిక్ష కానీ కోర్టు విచారణ కానీ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి వద్ద చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రం కానీ పాస్‌పోర్ట్ కానీ ఉండి, క్రిమినల్ కేసులో పెండింగ్‌లో లేకపోతే వారని దేశం నుంచి బహిష్కరించవచ్చని కేంద్రం తెలిపింది. విదేశీయులను దేశ నుంచి డిపోర్ట్ చేయాలంటే సంబంధిత దేశ రాయబార కార్యాలయం నుంచి జాతీయత ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని కేంద్రం ఆ అవిడవిట్‌లో వివరించింది.

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఘటన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దూషించిన బాలిక తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పింది. ప్రధానిని విమర్శించిన వారి మాటలకు ప్రభావితమై తాను సైతం అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. తన మాటలు క్షమించరానివని, అయితే ఇదే తన మొదటి తప్పు, చివరి తప్పు అని. ఇకపై అలా చేయనని చేతులు జోడించి మరీ క్షమాపణలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన పిల్లలను క్షమాస్తానని ప్రధానమంత్రి శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సందేశం నేపథ్యంలో బాలిక వీడియో వెలుగుచూసింది.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన క్లిప్ తాను పోస్ట్ చేయలేదని, ఆ వీడియో చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, సిగ్గుపడ్డానని బాలిక తెలిపింది. జూలైలో తాను మిత్రులతో కలిసి కన్నాట్‌ప్లేక్‌కు వెళ్లానని వెల్లడించింది. అక్కడ కొందరు ప్రధానని తిట్టారని, తనను కూడా విమర్శించమని ప్రోత్సహించడంతో తాను కూడా అదేపని చేశానని తెలిపింది. తన వ్యాఖ్యలకు సిగ్గుపడ









ప్రభుత్వ సేవలు పొందేందుకు అవసరమైన కుటుంబ వివరాలను ఒకే పత్రంలో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికెట్' విధానాన్ని ప్రారంభించింది. ఈ సర్టిఫికెట్‌ను మీసేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత సాధారణంగా రెండు పని దినాల్లో సర్టిఫికెట్ జారీ కానుంది.


హైదరాబాద్: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. జులై 10న విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీన ప్రముఖ ఒటిటి సంస్థ జి5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒటిటి సంస్థ ప్రచార చిత్రాన్ని పంచుకుంది. అలాగే ఈ మూవీ నుంచి ‘సోల్ ఆఫ్ లెనిన్’ సాంగ్ కూడా విడుదలైంది. తమన్ స్వయంగా స్వరాలు సమకూర్చి ఆలపించడం విశేషం. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించారు.

రాజమండ్రి: గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అంతకంతకూ నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక్కడ నీటి మట్టం 13 అడుగులు నమోదైంది. నీటి మట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.


