
3938 వార్తలు
నవతెలంగాణ-నాచారంబీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాచారంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసిన మహానేత కేసీఆర్ నాయకత్వమే రాష్ట్ర సాధనకు దారి తీసిందని పేర్కొన్నారు. ఉద్యమకారుల నిరంతర పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందువల్లే ప్రజాప్రతినిధులుగా సేవ […] The post తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఘన సన్మానం appeared first on Navatelangana.
నవతెలంగాణ-కంఠేశ్వర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈనెల 28న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ సమస్మరణ సభను న్యూ అంబేద్కర్ భవన్లో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్మరణ సభకు పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా వామపక్ష […] The post నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

నవతెలంగాణ-రామారెడ్డి కష్టపడి పండించిన రైతు తన ధాన్యాన్ని దళారులకు అన్నీ మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించి లబ్ధి పొందాలని సర్పంచ్ లతశ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని అన్నారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఉప సర్పంచ్ దయానంద్, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, పాలకవర్గ సభ్యులు చాట్ల లక్ష్మణ్, వంచ సతీష్, నరేందర్ రెడ్డి, కూడెల్లి ఎల్లం, దేవదాస్, కీసరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు […] The post వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన గౌసోద్దిన్ భార్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సేవా సమితి సభ్యులు సోమవారం బాధిత కుటుంబానికి రూ.3000 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. The post అనారోగ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.


పశ్చిమ బెంగాల్: బిహార్, ఒడిశాలో కమలం వికసించిందని.. ఇప్పుడు బెంగాల్ వంతు అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జనసంఘ్ కు బెంగాల్ పుట్టినిల్లు అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ పశ్చిమబెంగాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఏం చేయలేదని, టిఎంసి రైతులు, యువత కోసం చేసిందేమి లేదని విమర్శించారు. బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పడమే టిఎంసి విధానం అని మండిపడ్డారు. 15 ఏళ్లు ఏం చేశారో టిఎంసి ఒక్కసారైనా చెప్పిందా? అని రిపోర్టు కార్డును ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత లేదా? అని మోడీ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీకు 15 ఏళ్లు అవకాశం ఇచ్చారని, టిఎంసి తన సిండికేట్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని, టిఎంసి సిండికేట్ ను ఓడించాలని సూచించారు. బెంగాల్ యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇది మోడీ గ్యారెంటీ అని పేర్కొన్నారు.
నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల బస్ స్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు సంక్షేమం, […] The post తాడిచెర్లలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్‌లో బీజేపీని తిరస్కరించాలని CPI జనరల్ సెక్రటరీ డి.రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గెలుపుతో బెంగాల్‌తో పాటు దేశాన్ని సంక్షోభంలో పడేస్తుందన్నారు. నేటితో ముగియునున్న సెకండ్ ఫేజ్ ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వవద్దని నేను బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం. బెంగాల్‌లో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకోనివ్వకూడదు. ఇది కేవలం బెంగాల్‌కే కాకుండా, యావత్తు దేశానికి కూడా వినాశకరంగా పరిణమిస్తుందని’ అని చెప్పారు. […] The post బెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం:CPI జనరల్ సెక్రటరీ డి.రాజా appeared first on Navatelangana.
ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు, కుమార్ యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుకౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని యుంసీటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.. కౌలు రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందలేక వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతమన్నారు. భూమి కౌలుకు తీసుకొని అరుగాలం కష్టపడి పంట పండిస్తే పండించిన పంటను ప్రభుత్వానికి […] The post కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండల కేంద్రంలో పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజలందరూ గో ఆరాధన ఉద్యమ ర్యాలీ సోమవారం చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరుకొని గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతలతో గోశాల నుండి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదేవిధంగా తహశీల్దార్ ముజీబ్ కు వినతిపత్రం అందజేశారు. గో వంశ సంరక్షణ, గోవును దేశమాతగా, ఓన్నత్య త్యాగానికి చిహ్నంగా […] The post పార్టీలకతీతంగా గో ఆరాధన ఉద్యమ ర్యాలీ appeared first on Navatelangana.
నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం శ్రీరాంపల్లి గ్రామంలో సంవృద్ది జీవ ప్రార్ధన మందిరం నందు సోమవారం ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని రిబ్బన్ కట్ చేసి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వడిత్య విజయ్, శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, పెద్దవూర మండల మాజీ ఉప సర్పంచ్ మట్టపల్లి ప్రదీప్ రెడ్డి, పాస్టర్ శ్యాం బాబు, దోరేపల్లి నరేష్, డేవిడ్, శంకర్ రెడ్డి, జోషి, […] The post వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బుసిరెడ్డి పాండన్న appeared first on Navatelangana.
నవతెలంగాణ -పెద్దవూర నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి 26 ఆవిర్భావ దినోత్సవం సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతపల్లి సర్పంచ్ జటావత్ రవి నాయక్, పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొదిళ్ల శ్రీను ,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు రమావత్ శ్రీకర్ నాయక్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేసి కేక్ […] The post ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం appeared first on Navatelangana.
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్థులకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కాక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ […] The post తాజ్ పూర్ లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.
పరకాలలో బిఆర్ఎస్ ఘనంగా ఆవిర్భావ దినోత్సవంలో చల్లా ధర్మారెడ్డినవతెలంగాణ – పరకాల పరకాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా […] The post బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి appeared first on Navatelangana.

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కుమారుడు హీరోగా నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సౌత్ ఇండియన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాని ప్రత్యేక షోలో అమిర్ ఖాన్ చూశారు. ఈ సినిమా చూస్తూ అమిర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న సాయి పల్లవి అమిర్‌ను ఓదార్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆయనకు కన్నీళ్లు ఆగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి అమిర్ ఖానే నిర్మాత కావడం మరో విశేషం.#AamirKhan cried after watching his son Junaid Khan’s acting in #EkDin 😭😭#SaiPallavi #JunaidKhan pic.twitter.com/g5aRAiXDXG— Random Cine Mood (@RandomCineMood) April 26, 2026

హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ఎంఎల్‌సిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పాల్గొన్నారు. గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎంఎల్‌సిలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసమే తనకు మంత్రి పదవి ఇచ్చారనేది నిజం కాదు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి మైనార్టీల సంక్షేమం కోసం పని చేస్తోందని ప్రశంసించారు. ఎంఎల్‌సిగా తనని ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, మంత్రి మండలికి, పిసిసికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని అజారుద్దీన్ హామీ ఇచ్చారు.

జగద్గిరి గుట్ట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి సాయి నగర్ లోని రెస్క్యూ హోమ్ నుంచి ఏడుగురు మహిళల పారిపోయారు. రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను పోలీసులు రక్షించి రెస్క్యూ హోమ్ లో ఉంచారు. రెస్క్యూ హోమ్ నిర్వాహకుల కళ్ళు కప్పి అక్కడ నుంచి సాల్మా(ఢిల్లీ), స్వేత(తెలంగాణ), కమలమ్మ(తెలంగాణ), ప్రియాంక(తెలంగాణ), సంధ్య(ఎపి), చాందిని(పశ్చిమ బెంగాల్), బీట్రైస్(కెన్యా) అనే మహిళలు పారిపోయారు. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పారిపోయిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్: త్యాగాల పునాదుల మీద పార్టీ బిఆర్ఎస్ ఏర్పడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దశాబ్దాలుగా, అన్యాయానికి గురై నెత్తురు మండిన జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా అని కొనియాడారు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండా కెటిఆర్ ఆవిష్కరించారు. సీనియర్ నేతలు పాల్గొన్నారు. జై కెసిఆర్, జై బిఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగుతుంది. కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాల్లో అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బిఆర్ఎస్ అని స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే సమస్యలకు చరమగీతం పాడవచ్చని కెటిఆర్ తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ 25 ఏళ్ల క్రితం జలదృశ్యంలో గులాబీ జెండా ఎత్తారని, 14 సంవత్సరాలు తెలంగాణ జాతిని పార్టీ ఐక్యం చేసిందని అన్నారు. అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బిఆర్ఎస్ అని రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు అధికార బాధ్యతలు ఇచ్చారని, రాష్ట్ర అవశ్యకతను బోధించి ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కెసిఆర్ ది అని ప్రశంసించారు. పదేళ్ల పాటు అధికారమిస్తే బాధ్యతగా భావించి రా
నవతెలంగాణ-హైదరాబాద్: ఆప్ పాలిత రాష్ట్రం పంజాబ్‌లో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఏక కాలంలో విస్తృత దాడులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మది ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది.పంజాబ్ మాజీ DIG హర్‌చరణ్ సింగ్ భుల్లార్, ఇతరులకు సంబంధించిన కేసుల విషయంలో, PMLA చట్టం-2002 కింద చండీగఢ్, లూథియానా, పాటియాలా, నాభా, జలంధర్‌తో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ED తెలిపిన వివరాల ప్రకారం, బినామీ ఆస్తులను వెలికితీయడం, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించడమే ఈ […] The post పంజాబ్‌లో ఈడీ సోదాలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. The post ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మైనింగ్ ఇంజినీరింగ్ విద్యార్థి వినీశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వినీశ్‌ను ఓయూ సిబ్బంది గాంధీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఈ ఘటప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ఓయూలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం appeared first on Navatelangana.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా దర్శకత్వం లో, వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ ప్లస్‌ఎస్ మూ వీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ‘రావు బహదూర్’ జూన్ 5న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కథ, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ బాధ్యతలను స్వయంగా తీసుకున్న వెంకటేష్ మహా యూనివర్సల్ ఎమోషన్స్‌ను కలిపిన కథను అద్భుతంగా తెరకెక్కించారు.