23468 వార్తలు

ఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ యూనిఫాం అందజేయాలి : సరఫరాపై సమీక్షలో ముఖ్యమంత్రియూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు..పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుత్వరగా సరఫరా చేసేలా సంస్థలపై ఒత్తిడి పెంచాలిఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ అందజేయాలియూనిఫాం సరఫరాపై సమీక్షలోముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ (ఫీడ్ బ్యాక్) తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి […] The post ప్రతి విద్యార్థి నుంచి అభిప్రాయ సేకరణ appeared first on Navatelangana.

భారాన్ని మోస్తున్న ఫీల్డ్ రిపోర్టర్లుమోడీ ప్రభుత్వ అనుకూల ప్రచారంతో ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహంజంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనల్లో బహిర్గతంసేఫ్ జోన్‌లో యాజమాన్యాలు.. బలవుతున్న విలేకరులుప్రధాన మీడియా పక్షపాత ధోరణిపై ఆందోళన దశాబ్దకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన స్రవంతి టెలివిజన్ మీడియాపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి జంతర్‌మంతర్‌లో జరిగిన సీజేపీ నిరసనల్లో బహిర్గతమైంది. అయితే టీవీ స్టూడియోలలో రాజకీయ ఎజెండాలను రూపొం దించే యాజమాన్యాలు, ఎడిటర్లు, స్టార్ యాంకర్లు సేఫ్ జోన్‌లో […] The post గోడీ మీడియాపై ప్రజాగ్రహం appeared first on Navatelangana.

విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేతతో అడ్డుకోలేరు..కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : సీపీఐ రాష్ట్ర నేతల డిమాండ్‌ట్యాంక్ బండ్ వరకు సీపీఐ శ్రేణుల భారీ నిరసన ప్రదర్శన నవతెలంగాణ-హిమాయత్ నగర్ అధికారం, డబ్బు బలంతో రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను చీల్చుతూ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి అధికారంలోకి వస్తున్న బీజేపీని ప్రజలు భవిష్యత్‌లో క్షమించరని సీపీఐ రాష్ట్ర నేతలు హెచ్చరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా […] The post బీజేపీని ప్రజలు క్షమించరు appeared first on Navatelangana.

అంగట్లో మిషన్ లెర్నింగ్ ఫర్ ఐఓటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్థియరీ ప్రశ్నాపత్రాలు రెండు పరీక్షలు రద్దు వేలాది మంది విద్యార్థులపై ప్రభావం!సంబంధిత ప్రొఫెసర్‌పై వేటు డెహ్రాడూన్ : దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న పేపర్ లీక్ ఘటనలు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్న వేళ.. ఉత్తరాఖండ్‌లో మరో పేపర్ లీక్ ఉదంతం బయటపడింది. పరీక్షలకు నెల రోజుల ముందే ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షలో అవే ప్రశ్నలు వచ్చినట్టు తెలియడంతో ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఇంజినీరింగ్ […] The post మరో ప్రశ్నాపత్రం లీక్ appeared first on Navatelangana.

మేషంవృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చూస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, మొండిబాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మరియు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృషభం కార్యాలయాలలో పని ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించండి. కుటుంబంలో సామాన్య వాతావరణం ఉంటుంది. మిధునం నూతన పరిచయాలు వ్యాపార విస్తరణకు తోడ్పడతాయి మరియు ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన రోజు. ఇరుగుపొరుగు వారితో సఖ్యత పెరుగుతుంది. కర్కాటకం శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా లభిస్తుంది. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు. జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి. ఉదర సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త అవసరం. సింహం మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి మరి

గత 24 గంటల్లో నాలుగుసార్లు చర్చలకు ఆహ్వానంసమస్యలకు సంభాషణ ద్వారానే పరిష్కారం.. విద్యార్థుల సూచనలకూ ప్రభుత్వం సిద్ధమే.. న్యూఢిల్లీ: నిరసన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం విజ్ఞప్తి చేశారు. సమస్యలకు పరిష్కారం, ముందడుగు రెండూ సంభాషణ ద్వారానే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. పీటీఐ వీడియోస్‌తో మాట్లాడుతూ.. గత 24 గంటల్లోనే ప్రభుత్వం కనీసం నాలుగుసార్లు సీజేపీని చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులు, యువత మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వ తరఫున వినయపూర్వకంగా కోరుతున్నాను. మా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి అని అన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం జరుగుతుందని జితేంద్ర సింగ్ చెప్పారు. నడ్డా అధికారిక నివాసంలో గానీ, ఆయన కార్యాలయంలో గానీ సమావేశం నిర్వహించవచ్చు. ఏ ప్రదేశం కావాలన్నది విద్యార్థి ప్రతినిధులే నిర్ణయించుకోవచ్చు. నేను కూడా సమావేశానికి హాజరవుతాను అని తెలిపారు.నీట్ అంశంతో పాటు దానికి సంబంధించ


న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనలకు కొనసాగిస్తుండటంతో కేంద్ర హోం శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. జంతర్‌మంతర్‌కు 1.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను గురవారం అర్ధరాత్రి వరకూ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజాభద్రత, పబ్లిక్ ఎమర్జెన్సీ నివారణ దృష్ట్యా టెలికమ్యూనికేషన్ చట్టం-2023, టెలికమ్యూనికేషన్స్ (తాత్కాలికంగా సేవలు నిలిపివేత) నిబంధనలు-2024 కింద ఈ చర్యలు తీసుకున్నట్టు ఎంహెచ్‌ఏ తెలిపింది. జూలై 17 నుంచి జంతర్ మంతర్ ఏరియాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేస్తూ హోం శాఖ ఆదేశాలివ్వడం ఇది ఐదోసారి. పోటీ పరీక్షల్లో అవకతవకలపై జవాబుదారీతనం. విద్యావ్యవస్థలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ సారథ్యంలో జూన్ 20 నుంచి విద్యార్థులు ఆందోళనలు సాగిస్తున్నారు.






అహల్యానగర్: ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా గురువారం మహారాష్ట్ర లోని అహల్యానగర్ లో రెండు గంటల పాటు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారీ మౌన్ అందోళన్ చేపట్టారు. ఉదయం 11 గంటలకు అహల్యానగర్ లోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆయన నిరసన మొదలు పెట్టి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగించారు. ఆ తర్వాత తన గ్రామం రాలేగణ్ సిద్ధికి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖలో విద్యార్థులపై హింస, పోలీసుల చర్యల వార్తలు తీవ్రంగా కలచి వేస్తున్నాయని పేర్కొన్నారు. నిరసనకారుల ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా సమాజం అనుభవిస్తున్న వేదన, ఆశల ప్రతిబింబంగా చూడాలని లేఖలో తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే ప్రభుత్వం కూలిపోదని, దాంతో ప్రభుత్వ పనితీరు మరింత జవాబుదారీతనంతో , సమర్ధంగా మారుతుందన్నారు.






వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న హౌతీలు మరోసారి దాడులకు దిగారు. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన చమురు నౌకపై యెమెన్ సమీపంలో హౌతీలు బుధవారం రాత్రి క్షిపణితో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. తామే ఈ దాడి చేసినట్టు హౌతీలు ప్రకటించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హౌతీలు దాడులకు పాల్పడినా టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, సైనిక చర్య చేపడతామని హెచ్చరించారు. గత ఏడాది వాణిజ్య నౌకలపై దాడి జరిపిన హౌతీలకు అమెరికా గట్టి బుద్ధి చెప్పిందని, మళ్లీ ఇప్పుడు దాడులు మొదలుపెట్టారని ట్రంప్ పేర్కొన్నారు. హౌతీలు ఇరాన్ ప్రతినిధులే అయినందున ఈ దాడులకు ఇరాన్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇకనుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని కూడా ట్రంప్ ఇంతకుముందు హెచ్చరించారు. అయితే దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. పౌర వ్యవస్థలపై అమెరికా దాడి చేస్తే దెబ్బ


