24525 వార్తలు

నవతెలంగాణ-రెంజల్ రెంజల్ మండలం సాటాపూర్ ఉప సర్పంచ్ వికార్ పాషా ను రెంజల్ మండల ఉప సర్పంచ్ లందరూ ఆయనకు శలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రెంజల్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎప్పటికైనా తరువాత ఆయన రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం తమకు గర్వకారణమని ఉప సర్పంచులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు సర్దార్ చరణ్ సింగ్, శ్రీకాంత్, అఫ్జల్, శ్రీనివాస […] The post ఉప సర్పంచుల రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షులకు ఘన సన్మానం appeared first on Navatelangana.

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ కు.. ఓపెనర్లు డకెట్, బెతెల్ లు 192 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. డకెట్(135 బంతుల్లో 141 పరుగుల) సూపర్ సెంచరీ అలరించాడు. ఇక, బెతెల్ (91) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత జో రూట్ (74 నాటౌట్) అర్ధశతకంతో చెలరేగగా.. చివర్లో జోస్ బట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే అజేయంగా 41 పరుగులతో విజృంభించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోరు చేసింది. మరికాసేపట్లో భారత్ 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగనుంది. భారత భౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని సుభాష్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ ఫుట్‌వేర్ షాపును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, వ్యాపారంలో నిరంతరం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన పాదరక్షలను సరసమైన ధరలకు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని సూచించారు. “కస్టమర్ల సంతృప్తే వ్యాపార విజయానికి మూలం. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడం ద్వారా […] The post రామ్ ఫుట్‌వేర్ షాపును ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి appeared first on Navatelangana.

– అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం లో పర్యావరణ.. పరిరక్షణకు ప్రతిజ్ఞ– రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు నవతెలంగాణ – కామారెడ్డి“ప్రకృతికి జీవం పోదాం”- ప్లాస్టిక్ ను నిషేదిద్దాం నినాదంతో అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం పర్యావరణ. పరిరక్షణ కు ప్రతిజ్ఞ చేద్దామని రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వివిధ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు కలిసి అవగాహన […] The post ప్రకృతికి జీవం పోద్దాం – ప్లాస్టిక్ ను నిషేదిద్దాం appeared first on Navatelangana.

– మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం – సర్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ – తొగుట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పార్టీ అధ్య క్షులు పంది రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన […] The post కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి appeared first on Navatelangana.



లండన్: టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్‌లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా ఈ ఫీట్‌ని నమోదు చేశారు. ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార సంగక్కర-మహేళ జయవర్ధనే కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచులు ఆడాకరు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ శ్రీలంక ఆటగాళ్లే ఉండటం విశేషం. ఇక రోహిత్, కోహ్లీల జోడీ ఈ జాబితాలో 6వ స్థానంలో కొనసాగుతోంది. కాగా, 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఇప్పటివరకూ 67 టెస్టులు, 159 టి-20లు, 287 వన్డేలు ఆడాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 123 టెస్టులు, 125 టి-20లు, 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.


భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కోళ్ల ఫారంలో నిర్వహిస్తున్న అల్ఫ్రాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారంలో 12 మందిని అరెస్ట్ చేయగా.. మరో 23 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడిని జయప్రకాశ్ గౌడ్‌గా గుర్తించారు. నిందితుడు గతలో బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో అల్ఫ్రాజోలం తయారీ కేసులో అరెస్టయ్యాడు. బెయిల్‌పై విడుదలై స్వగ్రామంలో మళ్లీ తయారీ యూనిట్ ఏర్పాటు చేశాడు. జయప్రకాశ్‌పై ఈగల్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి నేడు అరెస్ట్ చేశారు.


నాగాలాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మంది గాయాలయ్యాయి. పది నుంచి పదిహేను ఇళ్లు దెబ్బ తినగా.. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని భావిస్తున్నారు. నాగాలాండ్ పోలీసులు సహా అస్సాం రైఫిల్స్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి మోన్ జిల్లా కేంద్రం వణికిపోయింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, రోడ్లు, మౌలికసదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

చెన్నై: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు కేంద్రం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగులో కమిటీ కుర్రాళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మరికొన్ని చిత్రాలకు వివిధ కేటగిరిల్లో అవార్డులు దక్కాయి. తమిళ చిత్రాలకు కూడా అవార్డులు లభించాయి. విజయ్ సేతుపతి నటించి ‘మహరాజా’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హఇట్‌గా నిలిచిన విషయం తెలిందే. ఈ చిత్రంలో నటించిన బాల నటి సచనా నమీదాస్‌కు జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్‌లో చూసిన సచనా.. తన పేరు వినగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయి.. కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.‘మహారాజ’ జ్యోతికి అవార్డు.. ఏడ్చిన నటివిజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీలో జ్యోతి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సచనా నమీదాస్ గుర్తున్నారా? ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నేషనల్ అవార్డు దక్కింది. అవార్డుల ప్రకటనను లైవ్‌లో చూస్తూ సచన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.… pic.twitter.com/b6KJqYa4DX— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026






‘పెద్ది’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమా సుకుమార్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా చరణ్, సుకుమార్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. దీంతో ఈ కాంబోలో వస్తున్న మరో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అది కూడా ‘పుష్ప’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్‌గా ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడుస్తోంది. అంతేకాక.. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్‌ఫర్మెన్స్‌కు స్కోప్ ఉండేలా ఈ సినిమా ఉంటుందని టాక్. ఇక ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారట. 2027 చివర్లో కానీ.. 2028 మార్చిలో కానీ.. ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నలు జరుగుతున్నట్లు సమాచారం.


హైదరాబాద్: యువతను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. కరీంనగర్ లో కెటిఆర్ కు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను బిఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు? అని బిఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని.. చేస్తాం అని తెలియజేశారు. బిఆర్ఎస్ లాగా నిరుద్యోగ యువతతో తాము ఆటలు ఆడలేదని, నిరుద్యోగులకు కెటిఆర్ క్షమాపణ చెప్పాలని శ్రీధర్ బాబు సూచించారు.

లండన్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. దీంతో భారత పేసర్లు వికెట్లు తీసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జాకబ్ బేతల్ అర్థ శతకం సాధించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. క్రీజ్‌లో బేతల్ (53), డకెట్ (34) ఉన్నారు.
